By: ABP Desam | Updated at : 01 Aug 2021 08:12 PM (IST)
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం గెలిచింది. దీంతో ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన క్రీడాకారిణిగా తెలుగు తేజం పీవీ సింధు కొత్త రికార్డు సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కోసం ఆదివారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు వరుస గేమ్స్‌లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం వచ్చి చేరింది.
2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు.. తాజా ఒలింపిక్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీస్ పోరులో చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్ చేతిలో 18-21, 12-21తేడాతో ఓటమిపాలైంది. ఇక ఆదివారం కాంస్యం కోసం జరిగిన మరో ఆసక్తికర పోరులో బింగ్జియావోపై సింధు ఘన విజయం సాధించింది. దాంతో వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సింధు కొత్త రికార్డు సృష్టించింది.
బింగ్జియావోపై సింధుకు మంచి రికార్డు లేకపోవడంతో అభిమానుల్లో మళ్లీ అదే ఆందోళన. ఈ మ్యాచ్ ముందు వరకు వీరిద్దరూ 15 సార్లు తలపడగా.. తొమ్మిదింట్లో ప్రత్యర్థి, ఆరింట్లో సింధు నెగ్గారు. కానీ, ఈ రోజు సింధు... ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ప్రత్యర్థితో కూడా అనవసర తప్పిదాలు చేయిస్తూ సింధు తన ఖాతాలో పాయింట్లు జమ చేసుకుంది.
సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత సింధు ఏడ్చింది
కాంస్య పతక పోరు అనంతరం పీవీ సింధు తండ్రి వేంకట రమణ స్పందించారు. ‘అందరికీ ధన్యవాదాలు. నిన్న సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత సింధుతో మాట్లాడా. ఆమెలో స్ఫూర్తి నింపా. సింధు నాతో మాట్లాడే సమయంలో కన్నీటి పర్యంతమైంది. ఏడవద్దు... తదుపరి మ్యాచ్ పై దృష్టి పెట్టమని చెప్పా. ఈ రోజు కోర్టులో చాలా దూకుడుగా కనిపించింది. స్ట్రోక్స్‌ని రిపీట్ చేయమని చెప్పా. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన క్రీడాకారిణిగా సింధు నిలిచింది’ అని రమణ అన్నారు.
సింధు కాంస్యం... స్వర్ణంతో సమానం
అనంతరం సింధు తల్లి విజయ మాట్లాడుతూ... ‘సింధు సాధించిన ఈ కాంస్యం... స్వర్ణంతో సమానం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. సింధు 2024లో పారిస్ ఒలింపిక్స్‌లో కూడా ఆడుతోంది. సింధు సంతోషమే మాకు ముఖ్యం’ అని తెలిపారు.
దేశం గర్విస్తోంది
సింధు కాంస్యం గెలవడంతో పలువురు ప్రముఖులు ‘దేశం గర్విస్తోంది’ అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు తదితరులు విషెస్ అందజేశారు.
We are all elated by the stellar performance by @Pvsindhu1. Congratulations to her on winning the Bronze at @Tokyo2020. She is India’s pride and one of our most outstanding Olympians. #Tokyo2020 pic.twitter.com/O8Ay3JWT7q
— Narendra Modi (@narendramodi) August 1, 2021
Our ace shuttler has made us proud again! Congratulations on your victory @Pvsindhu1! We're absolutely proud of you!🥉🇮🇳 | #Tokyo2020| #Olympics pic.twitter.com/A1A4nTvjT7
— N Chandrababu Naidu (@ncbn) August 1, 2021
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధును సీఎం శ్రీ కేసీఆర్ అభినందించారు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పివీ సింధు చరిత్ర సృష్టించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. pic.twitter.com/jfzBISonHu
— Telangana CMO (@TelanganaCMO) August 1, 2021
WTC Final: ఓవల్ సీక్రెట్ ప్యాటర్న్ అదే - రన్స్ కొట్టే టెక్నిక్ చెప్పిన హిట్‌మ్యాన్!
Amit Shah meets wrestlers: కేంద్ర హోంమంత్రితో రెజ్లర్ల భేటీ, చట్టం పని చట్టాన్ని చేసుకోనివ్వండన్న అమిత్‌షా
Kick Boxer Gayatri: ఇసుక తెన్నెల్లో మెరిసిన మాణిక్యం- జాతీయ స్థాయిలో 3 బంగారు పతకాలు సాధించిన గాయత్రి
WTC Final 2023: ఓవల్‌లో మనోళ్ల ఆట ఎలా ఉంది ? - టాప్ స్కోర్లు చేసింది వీరే
Josh Hazelwood Ruled Out: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్ - ‘జోష్’ లేకుండానే బరిలోకి దిగనున్న కంగారూలు
Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ ఎలా ఉంది? - ఎలా పని చేస్తుంది? - ఈ ఫొటోలు చూస్తే ఫుల్ క్లారిటీ!
iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!