World Highest Bridge:ప్రపంచంలో ఎత్తైన వంతెనను మూడేళ్లలో నిర్మించిన చైనా - 2గంటల ప్రయాణం 2 నిమిషాల్లో పూర్తి !
China: చైనా ఇంజనీరింగ్ లో అద్భుతాలు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను మూడేళ్లలో పూర్తి చేసింది. ప్రారంభించింది.

China opens world highest bridge: చైనా ప్రపంచంలోనే అతి ఎత్తైన 625 మీ. బ్రిడ్జ్‌ను ప్రారంభించింది. చైనా తన దక్షిణపశ్చిమ ప్రావిన్స్ గుయిజౌలోని హువాజియాంగ్ గ్రాండ్ కాన్యాన్‌పై ప్రపంచంలోనే అతి ఎత్తైన బ్రిడ్జ్‌ను అధికారికంగా ప్రారంభించింది. 625 మీటర్ల ఎత్తున ఉన్న ఈ హువాజియాంగ్ గ్రాండ్ కాన్యాన్ బ్రిడ్జ్, బెపాన్ నది మీదుగా నిర్మించారు. ఈ ఇంజనీరింగ్ అద్భుతం, గ్రాండ్ కాన్యాన్‌ను దాటడానికి 2 గంటల సమయాన్ని కేవలం 2 నిమిషాలకు తగ్గిస్తుంది. భారతదేశంలోని చెనాబ్ రైల్ బ్రిడ్జ్ 359 మీటర్లు కంటే ఇది రెండు రెట్లు ఎత్తైనది.
From 2 hours to 2 minutes
— Good View Hunting (@SceneryCHN) September 28, 2025
China's Huajiang Grand Canyon Bridge🌉—1,420m span, 625m high—has opened to traffic, setting new world records in engineering.#Guizhou #EngineeringMarvel pic.twitter.com/bWzsQyF0fp
ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ మొత్తం పొడవు 2,890 మీటర్లు, ప్రధాన స్పాన్ 1,420 మీటర్లు. ఇది బ్రిటన్‌లోని హంబర్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతి పొడవైన సింగిల్-స్పాన్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కంటే 10 మీటర్లు పొడువు. బ్రిడ్జ్ డెక్ నుంచి గోర్జ్ పైకి 625 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది షాంఘై టవర్ చైనాలోనే అతి ఎత్తైన భవనం ఎత్తుకు సమానం. నిర్మాణం 2022 జనవరి 18న ప్రారంభమై, మూడు సంవత్సరాల్లో పూర్తయింది. ఇది పర్వతప్రాంతంలో నిర్మించిన అతి పొడవైన స్పాన్ బ్రిడ్జ్‌గా కూడా రికార్డు సృష్టించింది.
🇨🇳 VIDEO: The world's highest bridge opens in China
— AFP News Agency (@AFP) September 28, 2025
China's Huajiang Grand Canyon Bridge -- the world's highest from ground level -- officially opens to traffic in southern Guizhou province. Previously recorded footage shows the bridge towering 625 metres (2,051 feet) above a… pic.twitter.com/4tMPXqTckv
గుయిజౌ ప్రావిన్స్, ప్రపంచంలోని 100 అతి ఎత్తైన బ్రిడ్జ్‌లలో దాదాపు సగం ఉన్న ప్రదేశం. ఇక్కడే ఇటీవలి వరకు అతి ఎత్తైన బెపాన్‌జియాంగ్ బ్రిడ్జ్ 565 మీటర్లు ఉంది, ఇప్పుడు అది రెండో స్థానంలో ఉంది పర్వతాల కారణంగా నుంచి వేరుగా ఉండేది, ఆర్థికంగా వెనుకబడి ఉంది. ఈ బ్రిడ్జ్, దక్షిణపశ్చిమ చైనాలోని దూరవాంత ప్రాంతాలను అనుసంధానం చేసే పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్‌లో భాగం. కాన్యాన్ దాటడానికి మునుపటి 70-120 నిమిషాల సమయం ఇప్పుడు 1-2 నిమిషాలకు తగ్గుతుంది.
The world's tallest bridge opened to traffic Sunday morning in southwest China's Guizhou Province, slashing travel time across a deep canyon from two hours to just two minutes after three years of construction. #GLOBALink pic.twitter.com/NL05A6FgWn
— China Xinhua News (@XHNews) September 28, 2025






















