PM Modi Tweet Asia Cup Final | ఆసియా కప్ గెలవడంపై ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్
ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ ని టీమ్ ఇండియా చిత్తుగా ఓడించింది. ఈ కప్ గెలవడంతో మొత్తం 9 ఆసియా కప్ లను సొంతం చేసుకున్న టీమ్ గా నిలిచింది భారత్. దేశ్యాప్తంగా ఫ్యాన్స్ అంతా టపాసులు కాల్చి మరి సంబరాలు చేసుకున్నారు. అయితే పాక్ పై భారత్ సాధించిన గెలుపుపై ప్రధాని మోదీ ఆసక్తి కర ట్వీట్ చేసారు.
“గేమ్స్ ఫీల్డ్ లో ఆపరేషన్ సిందూర్.. ఎక్కడైనా ఫలితం మాత్రం మారదు. భారతే గెలుస్తుంది” అని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. పాకిస్తాన్ ప్లేయర్స్ మైదానంలో ఇండియా ఫైటర్ జెట్స్ కూలాయి అంటూ, గన్ షాట్ సెలెబ్రేషన్స్ చేసుకోవడం ... ఇలా వీటన్నిటికీ ఒక ట్వీట్ తో మోదీ సమాధానం చెప్పారని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తి చేస్తున్నారు. జనరల్ గా ఇండియా ప్లేయర్స్ విజయాలు సాదించినపుడు మోదీ ట్వీట్ చేయడం చాలా కామన్. కానీ ఈ ట్వీట్ మాత్రం ఆలా లేదనే చెప్పాలి. భారత విజయాన్ని ‘ఆపరేషన్ సిందూర్’ తో పోలుస్తూ తన అభిప్రాయాన్ని మోదీ వ్యక్తపరిచారు.




















