Team India T20 Records: టీ20ల్లో ఎక్కువ సార్లు ఊడ్చేసింది టీమ్‌ఇండియానే.. బద్దలైన రికార్డులు!
కివీస్‌పై విజయంతో టీమ్‌ఇండియా కొన్ని రికార్డులు బద్దలు కొట్టింది. అత్యధిక వైట్‌వాష్‌ల రికార్డును సమం చేసింది. ఇది భారత్‌కు వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక సిరీసు విజయం.
న్యూజిలాండ్‌పై విజయంతో టీమ్‌ఇండియా అరుదైన రికార్డులు బద్దలుకొట్టింది. వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక టీ20 సిరీసును కైవసం చేసుకుంది. అంతేకాకుండా మూడు మ్యాచులున్న టీ20 సిరీసులకు అత్యధికంగా వైట్‌వాష్ చేసింది. ఆరు సిరీసులు గెలిచిన దాయాది పాకిస్థాన్‌ను భారత్ సమం చేసింది.
కివీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమ్‌ఇండియా దుమ్మురేపింది. ఈడెన్ గార్డెన్‌లో టాస్ గెలిచినప్పటికీ మొదట బ్యాటింగ్ చేసింది. ఫియర్‌లెస్ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించింది. రోహిత్ శర్మ (56), ఇషాన్ కిషన్ (29), శ్రేయస్ అయ్యర్ (25), వెంకటేశ్ అయ్యర్ (20), దీపక్ చాహర్ (21*) దుమ్మురేపారు. ప్రత్యర్థికి 185 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. బౌలింగ్‌లో అక్షర్ పటేల్ 3, హర్షల్ పటేల్ 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని 17.2 ఓవర్లకు 111 పరుగులకే ఆలౌట్ చేశారు. మార్టిన్ గప్తిల్ ఒక్కడే 51 పరుగులు చేశాడు.
ఎక్కువ వైట్‌వాష్‌లు చేసింది (3+ మ్యాచులు)
- భారత్ - 6
- పాకిస్థాన్ - 6
- అఫ్గానిస్థాన్ - 5
- ఇంగ్లాండ్ - 4
- దక్షిణాఫ్రికా - 3
భారత్ చేతిలో వైట్‌వాష్‌కు గురైన జట్లు
- 3-0 vs ఆస్ట్రేలియా 2016 (A)
- 3-0 vs శ్రీలంక 2017 (H)
- 3-0 vs వెస్టిండీస్ 2018 (H)
- 3-0 vs వెస్టిండీస్ 2019 (A)
- 5-0 vs న్యూజిలాండ్ 2020 (A)
- 3-0 vs న్యూజిలాండ్ 2021 (H)
One Happy Bunch! 😊
— BCCI (@BCCI) November 21, 2021
Thank you Kolkata 🙏
Next Stop - Kanpur 👍 👍#TeamIndia #INDvNZ @Paytm pic.twitter.com/55Lfi7MnTR
Also Read: Ian Chappell on T20 WC: ప్రపంచకప్ టాస్ గెలువు కప్పు కొట్టుగా మారిందన్న ఇయాన్ ఛాపెల్..!
Also Read: MSD on IPL: సంవత్సరమా.. ఐదేళ్లా.. ఐపీఎల్ కెరీర్‌పై ధోని ఏమన్నాడంటే?
Also Read: MS Dhoni IPL update: ఐపీఎల్ 2022 ధోనీ ఆడతాడా? ఆడడా? మళ్లీ మొదలైన రచ్చ..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి