News
News
X

ICC Women World Cup 2022: వరల్డ్ కప్‌ కోసం భారత్ జట్టు ప్రకటన... జెమీమా రోడ్రిగ్స్‌కు నిరాశ..

2022 ఐసీసీ ప్రపంచ కప్‌ మార్చి4న న్యూజిలాండ్‌లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరగనుంది. మార్చి ఆరున భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ఉంటుంది.

FOLLOW US: 

ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌ కోసం భారత్‌ జట్టను బీసీసీఐ ప్రకటించింది. మిథాలీరాజ్ నాయకత్వంలో 15మందితో కూడిన టీంను సిద్ధం చేశారు. జెమీమా రోడ్రిగ్స్‌ను తప్పించారు. 

ఈ ఏడాది మార్చి నుంచి ప్రారంభం కానున్న మహిళా ప్రపంచకప్‌ కోసం భారత్‌ జట్టును ప్రకటించింది బీసీసీఐ. 15మంది సభ్యులతో కూడిన జట్టును వెల్లడించింది. 
టీమిండియా తన మొదటి మ్యాచ్‌ను మార్చి ఆరున ఓవల్‌లో పాకిస్థాన్‌తో ఆడనుది. 

ముంబయికి చెందిన 21 ఏళ్ల జెమిమా రోడ్రిగ్స్‌ను తప్పించడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. ఆల్ రౌండర్‌గా ఆమెను కచ్చితంగా ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకుంటారని అంతా అనుకున్నారు కానీ బీసీసీఐ అందరి అంచనాలు తలకిందులు చేసి రోడ్రిగ్స్‌ను తప్పించింది. 

ప్రపంచకప్‌ కంటే ముందు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు ఆడనుంది టీమిండియా. ఫిబ్రవరి 11 నుంచి ఐదు వన్డేలు ఆడనుంది ఇదే జట్టు. 

News Reels

ICC మహిళల WC 2022 కోసం ఎంపికైన జట్టు ఇదే:

మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్-కీపర్), స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (వికెట్-కీపర్), రాజేశ్వరి గయాక్వాడ్, పూనమ్ యాదవ్.

స్టాండ్‌బై ప్లేయర్స్: సబ్భినేని మేఘన, ఏక్తా బిష్త్, సిమ్రాన్ దిల్ బహదూర్.

2022 ఐసీసీ ప్రపంచ కప్‌ మార్చి4న న్యూజిలాండ్‌లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరగనుంది. మార్చి 5న హామిల్టన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. మార్చి 6న తౌరంగాలో భారత్ పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది.

టోర్నమెంట్ 31 రోజుల పాటు కొనసాగుతుంది, ఇందులో మొత్తం 31 మ్యాచ్‌లు ఉంటాయి. ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ ట్రోఫీ కోసం ఎనిమిది జట్లు తలపడనున్నాయి. టోర్నమెంట్‌కు ఆక్లాండ్, క్రైస్ట్‌చర్చ్, డునెడిన్, హామిల్టన్, టౌరంగ, వెల్లింగ్టన్‌లో వేదికలు సిద్ధం చేశారు. 

Also Read: జకోవిచ్‌కు అవమానం.. ఎయిర్‌పోర్టులోనే నిలిపివేత, ఆ దేశ అధ్యక్షుడి మండిపాటు

Also Read: బుమ్రా, జన్‌సెన్‌ మాటల యుద్ధం..! మైదానంలో టెన్షన్‌.. టెన్షన్‌

Also Read: విహారి పోరాటానికి హ్యాట్సాఫ్‌! సఫారీల లక్ష్యం 240.. టీమ్‌ఇండియా 266 ఆలౌట్‌

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Published at : 06 Jan 2022 11:03 AM (IST) Tags: Team India ICC Womens World Cup 2022 ICC Womens World Cup 2022 Squad Team India Squad Team India Squad for Womens World Cup 2022

సంబంధిత కథనాలు

FIFA WC 2022 Qatar: ఫ్రాన్స్ పై ట్యునిషియా సంచలనం- అయినా నాకౌట్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్

FIFA WC 2022 Qatar: ఫ్రాన్స్ పై ట్యునిషియా సంచలనం- అయినా నాకౌట్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్

FIFA WC 2022 Qatar: డెన్నార్క్ పై విజయం- 16ఏళ్ల తర్వాత నాకౌట్ చేరిన ఆస్ట్రేలియా

FIFA WC 2022 Qatar: డెన్నార్క్ పై విజయం- 16ఏళ్ల తర్వాత నాకౌట్ చేరిన ఆస్ట్రేలియా

IND vs BAN: బంగ్లాదేశ్‌లో భారత్ పర్యటన ప్రారంభం, వన్డే, టెస్టు సిరీస్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే!

IND vs BAN: బంగ్లాదేశ్‌లో భారత్ పర్యటన ప్రారంభం, వన్డే, టెస్టు సిరీస్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే!

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

National Sports Awards Winners: జాతీయ క్రీడా అవార్డులు 2022-  విజేతల జాబితా ఇదే

National Sports Awards Winners: జాతీయ క్రీడా అవార్డులు 2022-  విజేతల జాబితా ఇదే

టాప్ స్టోరీస్

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తి, ఏకంగా 9 గంటలు - ఏ ప్రశ్నలు వేశారంటే

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తి, ఏకంగా 9 గంటలు - ఏ ప్రశ్నలు వేశారంటే

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?