By: ABP Desam | Updated at : 04 Oct 2021 07:55 PM (IST)
Edited By: Ramakrishna Paladi
భారత్ vs పాకిస్థాన్
అంతర్జాతీయ క్రికెట్లో దాయాదుల పోరును మించిందే లేదు! భారత్, పాక్ మైదానంలో తలపడుతున్నాయంటే కోట్లాది మంది టీవీల ముందు వాలిపోతారు. వేల మంది టికెట్ల కోసం పోటీ పడతారు. వేల రూపాయలు పలుకుతున్నా టికెట్లు తీసుకుంటారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి పోరును పాక్‌తోనే మొదలు పెడుతోంది. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా మ్యాచు జరగనుంది. ఆదివారమే టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి.
Also Read: 'దారి తప్పిన పరుగుల వరద' : ఓడిన మ్యాచుల్లో టాప్ స్కోరర్లు వీరే!
Also Read: పంజాబ్ పాత కథే! విజయానికి చేరువై బోల్తా! ప్లేఆఫ్స్ చేరిన కోహ్లీసేన
ప్లాటినంలిస్ట్ వెబ్‌సైట్ ద్వారా అక్టోబర్ 3న టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అలా వెబ్‌సైట్లో సేల్స్ మొదలైందో లేదో గంటల్లోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయని తెలిసింది. స్టేడియంలోని అన్ని పెవిలియన్లలో టికెట్లు అయిపోయాయి. వాటి కోసం అభిమానులు విపరీతంగా ఎగబడ్డారని తెలిసింది. జనరల్, జనరల్ ఈస్ట్, ప్రీమియం, పెవిలియన్ ఈస్ట్, ప్లాటిన్ స్టాండ్స్‌లో టికెట్ల విక్రయం పూర్తయిపోయింది.
Also Read: చితక బాదుడు 'సీక్రెట్' చెప్పిన మాక్సీ! బెంగళూరు అలా చెప్పడం వల్లే!
కొవిడ్ నేపథ్యంలో స్టేడియంలో 70 శాతం సామర్థ్యం మేరకు అభిమానులను ఐసీసీ అనుమతిస్తోంది. దుబాయ్ స్టేడియంలో 25,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. అయితే 18,500 సీట్లకు మాత్రమే టికెట్లు విక్రయించారు. ప్రీమియం టికెట్‌ను 1500 దిర్హమ్స్ అంటే రూ.30వేలు, ప్లాటినం టికెట్లను 2600 దిర్హమ్స్ అంటే రూ.50వేలకు అమ్మారని వార్తలు వస్తున్నాయి. సోమవారం తెల్లవారే సరికే టికెట్లు లేవని సందేశం వచ్చేసింది.
Also Read: ఢిల్లీతో చెన్నై ఢీ.. గెలిచినవాళ్లకే టాపర్లయ్యే అవకాశం!
Was waiting for weeks to get my hands on #Pak v #Ind World Cup match ticket… they went on sale yesterday while we were busy with moving houses and got sold out in a few minutes 🥺 anyone selling general category tickets here? #T20WorldCup #Dubai
— sarahrizvi (@sarahrizvi) October 4, 2021
Is anyone willing to sell their #indvspak #ICCT20WorldCup2021 tickets for the match on 24th Oct in Dubai?
— Bhagya (@Bhagya01309213) October 4, 2021
Kindly contact.
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
MI Vs DC: కీలక మ్యాచ్‌లో తడబడ్డ ఢిల్లీ - ముంబై టార్గెట్ ఎంతంటే?
MI Vs DC Toss: బెంగళూరుకు గుడ్‌న్యూస్ - టాస్ గెలిచిన ముంబై!
Thailand Open: ప్చ్.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!
IPL 2022 TV Ratings: ఐపీఎల్ టీవీ రేటింగ్స్ ఢమాల్! పరిహారం డిమాండ్ చేస్తున్న అడ్వర్టైజర్లు
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !
Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలమ్మ