X

IND vs NZ, 1st Test: ద్రవిడ్‌ చెప్పిన 'సీక్రెట్‌' బయటపెట్టిన శ్రేయస్‌ అయ్యర్‌!

నాలుగో రోజు ఎక్కువ పరుగులు రాబట్టేందుకు ఏం చేయాలో రాహుల్‌ ద్రవిడ్‌ తనకు సూచించారని శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు. ఆ సూచన పాటించడం వల్లే అర్ధశతకం చేశానని పేర్కొన్నాడు.

FOLLOW US: 

కాన్పూర్‌ టెస్టు నాలుగో రోజు ఏం చేయాలో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనకు చెప్పారని యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు. ఎక్కువ పరుగులు చేసేందుకు, జట్టును ఆదుకొనేందుకు ఏం చేయాలో వివరించారని పేర్కొన్నాడు. తనకు వ్యక్తిగత రికార్డులు ముఖ్యం కాదని జట్టు గెలుపునకే ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించాడు. ఆదివారం ఆట ముగిసిన తర్వాత అతడు మాట్లాడాడు.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రేయస్‌ అయ్యర్‌ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక శతకంతో జట్టును ఆదుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ 51 పరుగులకే 5 వికెట్లు పడ్డ తరుణంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌, వృద్ధిమాన్‌ సాహాతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. అరంగేట్రంలోనే శతకం, అర్ధశతకం బాదిన భారత తొలి క్రికెటర్‌గా అవతరించాడు. మ్యాచులో బాగా ఆడేందుకు తాను కోచ్‌ ద్రవిడ్‌ సలహాలు పాటించానని వెల్లడించాడు.

'ఏదేమైనా మేమీ మ్యాచ్‌ తప్పక గెలవాలి. నాకు అదే ముఖ్యం. సాధ్యమైనంత ఎక్కువ సేపు ఆడాలని ద్రవిడ్‌ సర్‌ చెప్పారు. వీలైనని పరుగులు చేయాలని సూచించారు. నేను పరుగులు చేయాలంటే ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని తెలుసుకున్నా. సెషన్‌ మొత్తం ఆడాలన్న మానసిక ధోరణితో ఎక్కువ బంతులు ఆడాను. అంతకు మించి ఇంకేమీ ఆలోచించలేదు. వర్తమానంపై దృష్టి సారించాను' అని శ్రేయస్‌ తెలిపాడు.

'నిజాయతీగా చెప్పాలంటే పిచ్‌ అంత కఠినంగా ఏమీ లేదు. మేమీ పోటినిచ్చే స్కోరు చేయాలి. బహుశా 275-280 అనుకున్నాను. మేం మా స్పిన్నర్లపై విశ్వాసం ఉంచాం. ఆఖరి రోజు వారు ప్రత్యర్థిని కచ్చితంగా ఒత్తిడిలోకి నెట్టగలరు. ఆధిక్యంతో కలిసి 250 పైచిలుకు పరుగులు సరిపోతాయనే అనుకున్నా. అదృష్టవశాత్తు ఆ స్కోరు లభించింది' అని శ్రేయస్‌ వివరించాడు. ఇలాంటి ఒత్తిడిలో ఆడటం తనకు అలవాటేనని పేర్కొన్నాడు. రంజీల్లో ఎన్నోసార్లు  ఇలాంటి పరిస్థితుల్లో ఆడానని గుర్తుచేశాడు.

Also Read: IND vs NZ Kanpur Test: యాష్‌ నువ్వే భేష్‌..! బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశావన్న వెటోరీ

Also Read: Kapil Dev: ముందు పాండ్యను బౌలింగ్‌ చేయనివ్వండి..! నా వరకైతే అశ్వినే మెరుగైన ఆల్‌రౌండర్‌

Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్‌ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?

Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్‌ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్‌ ప్లేయర్‌

Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: India Team India New Zealand Shreyas Iyer Rahul Dravid Ind Vs NZ Kanpur Test

సంబంధిత కథనాలు

Rahul Dravid Comments: క్లీన్‌స్వీప్ ఓటమి మాకు కనువిప్పు.. టీమిండియా దారుణ వైఫల్యంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఏమన్నాడంటే..!

Rahul Dravid Comments: క్లీన్‌స్వీప్ ఓటమి మాకు కనువిప్పు.. టీమిండియా దారుణ వైఫల్యంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఏమన్నాడంటే..!

Ind VS SA: పరాజయం పరిపూర్ణం... సిరీస్ వైట్ వాష్ చేసిన దక్షిణాఫ్రికా.. చాహర్ పోరాటం సరిపోలేదు!

Ind VS SA: పరాజయం పరిపూర్ణం... సిరీస్ వైట్ వాష్ చేసిన దక్షిణాఫ్రికా.. చాహర్ పోరాటం సరిపోలేదు!

Vamika First Appearance: స్టేడియంలో వామిక సందడి.. మొదటిసారి కూతురిని చూపించిన అనుష్క శర్మ!

Vamika First Appearance: స్టేడియంలో వామిక సందడి.. మొదటిసారి కూతురిని చూపించిన అనుష్క శర్మ!

Ind vs SA, 1st Innings Highlights:సిరీస్‌లో మొదటిసారి దక్షిణాఫ్రికా ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే?

Ind vs SA, 1st Innings Highlights:సిరీస్‌లో మొదటిసారి దక్షిణాఫ్రికా ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే?

PV Sindhu Wins: సయ్యద్ మోదీ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్న పీవీ సింధు... మాళవికా బన్సోద్ పై వరుస సెట్లలో విజయం

PV Sindhu Wins: సయ్యద్ మోదీ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్న పీవీ సింధు... మాళవికా బన్సోద్ పై వరుస సెట్లలో విజయం
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Hyderabad: హైదరాబాద్ లో 36 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు... విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ కూడా...

Hyderabad: హైదరాబాద్ లో 36 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు... విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ కూడా...

Minister Son Open Fire on Children: క్రికెట్ ఆడుతున్న పిల్లలపై మంత్రి కుమారుడు కాల్పులు... చిన్నారులకు తీవ్రగాయాలు... ఆగ్రహంతో మంత్రి ఇంటిపై గ్రామస్థుల దాడి..!

Minister Son Open Fire on Children: క్రికెట్ ఆడుతున్న పిల్లలపై మంత్రి కుమారుడు కాల్పులు... చిన్నారులకు తీవ్రగాయాలు... ఆగ్రహంతో మంత్రి ఇంటిపై గ్రామస్థుల దాడి..!

Pooja Hegde New House: సొంతింటి కోసం పూజా హెగ్డే అలా ప్లాన్ చేశారు! ఇంకా ఆమె తల్లి చేసిన సాయం ఏంటంటే...

Pooja Hegde New House: సొంతింటి కోసం పూజా హెగ్డే అలా ప్లాన్ చేశారు! ఇంకా ఆమె తల్లి చేసిన సాయం ఏంటంటే...

AP PRC Issue: నేడు సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలు... పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ప్రకటన

AP PRC Issue: నేడు సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలు... పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ప్రకటన