Rohit Sharma Test Captain: టెస్టు కెప్టెన్సీ కూడా హిట్‌మ్యాన్‌కే - ఆ ఇద్దరిపై వేటు పడింది!
రోహిత్ శర్మను పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్, టీ20 సిరీస్‌కు జట్లను కూడా ప్రకటించారు.
Rohit Sharma: భారత జట్టుకు పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను బీసీసీఐ నియమించింది. శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాబట్టి కోహ్లీ నుంచి పూర్తిగా అన్ని ఫార్మాట్ల పగ్గాలను రోహిత్ అందుకున్నట్లే. దీంతోపాటు శ్రీలంక సిరీస్‌కు టెస్టు, టీ20 జట్లను కూడా బీసీసీఐ నియమించింది. అలాగే జస్‌ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమించారు.
గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌కు ముందు విరాట్ టీ20 కెప్టెన్ పదవి నుంచి స్వయంగా తప్పుకున్నాడు. తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి తనకు ఇష్టం లేకుండానే బీసీసీఐ తప్పించింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్ ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ తప్పుకున్నాడు.
ఇక శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లకు విశ్రాంతిని ఇచ్చారు. రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. టెస్టు జట్టులో ప్రియాంక్ పంచల్, సౌరబ్ కుమార్‌లకు మొదటిసారి చోటు దక్కింది. విరాట్ టెస్టులకు తిరిగి జట్టులోకి రానున్నాడు. ఇక అజింక్య రహానే, పుజారాలపై వేటు పడింది.
టీ20 జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శామ్సన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా (వికెట్ కీపర్), అవేష్ ఖాన్
టెస్టు జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ప్రియాంక్ పంచల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, సౌరబ్ కుమార్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా (వికెట్ కీపర్)
T20I squad - Rohit Sharma (C),Ruturaj Gaikwad, Shreyas Iyer, Surya Kumar Yadav, Sanju Samson, Ishan Kishan (wk), Venkatesh Iyer, Deepak Chahar, Deepak Hooda, R Jadeja, Y Chahal, R Bishnoi,Kuldeep Yadav, Mohd. Siraj, Bhuvneshwar Kumar, Harshal Patel, Jasprit Bumrah(VC),Avesh Khan
— BCCI (@BCCI) February 19, 2022
Test squad - Rohit Sharma (C), Priyank Panchal, Mayank Agarwal, Virat Kohli, Shreyas Iyer, Hanuma Vihari, Shubhman Gill, Rishabh Pant (wk), KS Bharath, R Jadeja, Jayant Yadav, R Ashwin, Kuldeep Yadav, Sourabh Kumar, Mohd. Siraj, Umesh Yadav, Mohd. Shami, Jasprit Bumrah (VC).
— BCCI (@BCCI) February 19, 2022