RCBW Vs UPW: ఆర్సీబీ ఆల్మోస్ట్ ఇంటికే - 10 వికెట్ల తేడాతో యూపీ చేతిలో ఘోర ఓటమి!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది.
Royal Challengers Bangalore Women vs UP Warriorz, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ దాదాపుగా ముగిసినట్లే. రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు ఏకంగా 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం యూపీ వారియర్జ్ 13 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్, ఓపెనర్ అలీస్సా హీలీకి (96 నాటౌట్: 47 బంతుల్లో, 18 ఫోర్లు, ఒక సిక్సర్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీని బెంగళూరు బౌలర్లు ఏ దశలోనూ ఆపలేకపోయారు. కెప్టెన్, ఓపెనర్ అలీస్సా హీలీ మొదటి బంతి నుంచి బౌండరీలతో విరుచుకుపడింది. తనను ఆపడం బెంగళూరు బౌలర్ల వల్ల కాలేదు. హీలీకి మరో ఓపెనర్ దేవిక వైద్య (36 నాటౌట్: 31 బంతుల్లో, ఐదు ఫోర్లు) చక్కని సహకారం అందించింది. దీంతో యూపీ 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ కోరుకున్న శుభారంభం మాత్రం లభించలేదు. మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో స్మృతి మంధాన ఫెయిల్యూర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా ఆరు బంతుల్లో నాలుగు పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టింది.
మరో ఓపెనర్ సోఫీ డివైన్, వన్ బౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ (52: 39 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. భాగస్వామ్యం బలపడుతున్న దశలో బెంగళూరును ఎకిల్ స్టోన్ దెబ్బ కొట్టింది. జోరు మీదున్న సోఫీ డివైన్‌ను పెవిలియన్ బాట పట్టించింది.
ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఒక్కరు కూడా క్రీజులో నిలబడలేదు. కేవలం 65 పరుగుల వ్యవధిలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది వికెట్లు కోల్పోయింది. దీంతో 19.3 ఓవర్లలోనే రాయలల్ ఛాలెంజర్స్ బెంగళూరు 138 పరుగులకు ఆలౌట్ అయింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ నాలుగు వికెట్లు దక్కించుకుంది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీసుకోగా, రాజేశ్వరి గయక్వాడ్ ఒక వికెట్ పడగొట్టింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల తుదిజట్టు
స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఎరిన్ బర్న్స్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, సహానా పవార్, కోమల్ జంజాద్, రేణుకా ఠాకూర్ సింగ్
యూపీ వారియర్జ్ తుది జట్టు
అలిస్సా హీలీ (కెప్టెన్, వికెట్ కీపర్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, దేవిక వైద్య, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయక్వాడ్
9️⃣6️⃣* runs
— Women's Premier League (WPL) (@wplt20) March 10, 2023
4️⃣7️⃣ balls
1️⃣8️⃣ fours
1️⃣ six@ahealy77's knock in the chase for @UPWarriorz was packed with timing & elegance 👌🏻👌🏻
Watch her innings here 🎥🔽 #TATAWPL | #RCBvUPW https://t.co/lTEnR2xCCM pic.twitter.com/Z7vpAdKtnO