News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Virat Kohli: విరాట్ కోహ్లీ భారత్ సూపర్ స్టార్ మాత్రమే కాదు.. గ్లోబల్ ఐకాన్.. పాకిస్థాన్ మహిళా క్రికెటర్

టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నంటూ.. విరాట్ కోహ్లీ ప్రకటించడంతో అభిమానులంతా షాక్ లో ఉన్నారు. అయితే దీనిపై పాకిస్థాన్ మహిళా క్రికెటర్ కూడా స్పందించింది.

FOLLOW US: 
Share:

విరాట్ కోహ్లీ.. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో అందరికీ ఊహించని షాక్ తగిలినట్టైంది. భారత అభిమానులేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విరాట్ అభిమానులు ఈ విషయంపై స్పందించారు. అయితే తాజాగా.. పాకిస్థాన్ మహిళా క్రికెటర్ కైనత్ ఇంతియాజ్ కూడా తన ఆవేదనను తెలిపింది. విరాట్‌ కోహ్లి భారత సూపర్‌స్టార్‌ మాత్రమే కాదు, గ్లోబల్‌ ఐకాన్‌ అంటూ కైనత్ పొగిడింది.
భారత టెస్టు సారథి పదవికి కోహ్లి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా కోహ్లీ పేరు ట్రెండింగ్ లో నిలిచింది.  ప్రపంచం నలుమూలల నుంచి అతడి అభిమానులు స్పందించారు. పాకిస్థాన్ మహిళా క్రికెటర్  కైనత్ ఇంతియాజ్ సైతం స్పందించింది. కోహ్లీని 'Real G.O.A.T(Greatest Of All Time)'గా అభివర్ణించింది. తనదైన శైలిలో కోహ్లీ ముందుకెళ్తూ వచ్చాడని.., కోహ్లీ కెప్టెన్సీ స్ఫూర్తిదాయకంగా ఉందని కైనత్ పేర్కొంది. మనం చూసిన గొప్ప కెప్టెన్లలో కోహ్లీ ఒకరు అని చెప్పింది.

ఇటీవలే.. సుదీర్ఘ ఫార్మాట్‌ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని కోహ్లీ ప్రకటించాడు. కొత్త ఏడాదిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తాడని.. సెంచరీల వరద పారిస్తాడని ఆశగా ఎదురు చూస్తున్న  అభిమానుల గుండెలు బద్దలు చేశాడు. ఏడేళ్ల సారథ్యంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని కోహ్లీ చెప్పాడు. తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐ, తనను వ్యక్తిగా, ఆటగాడిగా వెలుగులోకి తీసుకొచ్చిన ఎంఎస్ ధోనీకి ధన్యవాదాలు తెలిపాడు. సోషల్‌ మీడియాలో సుదీర్ఘ లేఖను పోస్టు చేశాడు.

2014, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన విరాట్‌ కోహ్లీ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసు ఓటమి తర్వాత ఆ బాధ్యతల నుంచి నిష్క్రమించాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏం జరిగిందో తెలియదు! జట్టు యాజమాన్యం ఏమైనా అందా తెలియదు! నాయకుడిగా జట్టును ముందుకు నడిపించలేక పోతున్నానని భావించాడా తెలియదు! వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం బాధించిందా తెలియదు! అనూహ్య నిర్ణయమైతే తీసుకున్నాడు. ఇక ఆటగాడిగానే కొనసాగనున్నాడు.

Also Read: Anushka on Kohli Resignation: ఎంతో ఎత్తుకు ఎదిగావు.. లోపల, బయట కూడా.. విరాట్‌పై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్!

Also Read: Virat Kohli Resigns: బీసీసీఐపై కోహ్లీ అలిగాడా? జట్టుకు ముందు, బోర్డుకు ఒక రోజు తర్వాత రాజీనామా విషయం

Also Read: Team India Next Captain: విరాట్‌ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్‌..! లాజిక్‌ ఇదే!

Also Read: Virat Kohlis Successor: టీమిండియా టెస్టు పగ్గాలు అతడి చేతికే.. రోహిత్‌ శర్మకు మాత్రం నో ఛాన్స్!

Published at : 18 Jan 2022 05:52 PM (IST) Tags: Virat Kohli Indian Cricket BCCI Pakistan Women’s Cricket Kainat Imtiaz on kohli Virat Kohli’s Resignation as Test Captain Captain Kohli

ఇవి కూడా చూడండి

IPL 2024: వేలానికి 1166 మంది ఆటగాళ్లు దరఖాస్తు , ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ ధర?

IPL 2024: వేలానికి 1166 మంది ఆటగాళ్లు దరఖాస్తు , ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ ధర?

Pro Kabaddi 2023: ఇక సమరమే....నేటి నుంచే ప్రో కబడ్డీ సీజన్‌-10

Pro Kabaddi 2023: ఇక సమరమే....నేటి నుంచే ప్రో కబడ్డీ సీజన్‌-10

IND vs AUS T20I: భారత్‌దే అత్యధిక విజయాల రికార్డు - పాకిస్థాన్‌ రికార్డు బద్దలు

IND vs AUS T20I: భారత్‌దే అత్యధిక విజయాల రికార్డు - పాకిస్థాన్‌ రికార్డు బద్దలు

Mitchell Marsh: ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెడతా , అందులో తప్పేముంది

Mitchell Marsh: ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెడతా , అందులో తప్పేముంది

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

టాప్ స్టోరీస్

తెలంగాణలో రేపే కౌంటింగ్‌-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం

తెలంగాణలో రేపే కౌంటింగ్‌-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం

Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?

Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు