అన్వేషించండి

Imane Khelif : మస్క్‌, హ్యారీ పోటర్‌ రచయిత జేకే రౌలింగ్‌పై బాక్సర్‌ పరువు నష్టం దావా

Olympic Gold Medal Winner Imane Khelif: ఒలింపిక్స్‌లో తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారిపై పరువు నష్టం దావా వేయాలని అల్జీరియా బాక్సర్‌ ఇమానె ఖెలిఫ్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Why Elon Musk, JK Rowling Have Been Named In Lawsuit By Algerian Boxer:  పారిస్‌ ఒలింపిక్స్‌(Paris Olympics) ముగిసింది. పతక సంబరాలు, ఆరంభ, ముగింపు వేడుకలు విశ్వ క్రీడలను మరిం అందాన్ని తీసుకొచ్చాయి. అలాగే వివాదాలు ఒలింపిక్స్‌ను చుట్టుముట్టాయి. అలా పారిస్‌ విశ్వ క్రీడలను చుట్టేసిన వివాదాల్లో ఇమానే ఖలీఫ్‌ ఉదందం ఒకటి. మహిళల 66 కేజీల విభాగంలో అల్జీరియా బాక్సర్‌ ఇమానే ఖలీఫ్(Imane Khelif) స్వర్ణ పతకంతో సత్తా చాటింది. ఇంతవరకూ అంతాబాగానే ఉంది. కానీ ఇమానే ఖలీఫ్‌ లింగ అర్హతపైనే ఒలింపిక్స్‌లో తీవ్ర వివాదం చెలరేగింది. అసలు ఆమె అమ్మాయే కాదని.. ఆమెను ఒలింపిక్స్‌కు ఎలా అనుమతి ఇస్తారని చాలామంది ప్రముఖులు అప్పుడే ఒలింపిక్స్‌ నిర్వహక కమిటీని ప్రశ్నించారు. లింగ పరీక్ష’లో విఫలమవడంతో 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నిషేధానికి గురైన ఖలీఫ్‌ను విశ్వ క్రీడలకు అనుమతించడంపై కూడా విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు ఈ వివాదంపై లీగల్‌ చర్యలు తీసుకునేందుకు ఇమానే ఖలీఫ్‌ సిద్ధమైంది. ఆన్‌లైన్‌లో తనకు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేసిన వారిపై పరువు నష్టం దావా వేసేందుకు ఇమానే ఖలీఫ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మస్క్‌, రౌలింగ్‌పై దావా..

ఒలింపిక్స్‌లో తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారిపై పరువు నష్టం దావా వేయాలని అల్జీరియా బాక్సర్‌ ఇమానె ఖెలిఫ్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒలింపిక్స్‌ జరుగుతున్న సమయంలో ఇమానెపై నెట్టింట చాలా కామెంట్లు వినిపించాయి. ఇటలీ ప్రధాని సహా చాలామంది ఇమానె ఖలీఫ్‌ను మహిళల విభాగంలో ఆడనివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పురుషుల జన్యు లక్షణాలు ఉన్న అథ్లెట్లను మహిళల పోటీల్లోకి ఎలా తీసుకున్నారంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని  కూడా మండిపడ్డారు. మహిళా అథ్లెట్లు అందరూ ఒకే రకమైన నిబంధనలతో పోటీ పడే హక్కును కాపాడాలని మెలోని అన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ పోటీలో ఖలీఫ్ పాల్గొనడంపై ఎలాన్ మస్క్(Elon Musk),  ప్రముఖ రచయిత జేకే రౌలింగ్‌(JK Rowling) వంటి ప్రముఖులు విమర్శలు సంధించారు. పురుష  క్రోమోజోమ్‌లు ఉన్న అథ్లెట్లు మహిళల క్రీడలలో ఎలా పోటీ  పడతారని, అది సరికాదని అన్నారు. ఈ వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్‌ మీడియాలో  విపరీతంగా పోస్ట్ లు పెడుతున్నారు. 

Also Read: వినేశ్ ఫొగాట్‌ సిల్వర్ మెడల్ పై CAS తీర్పు వాయిదా, అప్పటివరకూ ఎదురుచూపులే

చర్యలకు సిద్ధమైనా ఇమానే..?

సోషల్ మీడియా వేదికగా తనపై జరిగిన వేధింపులపై ఇప్పటికే ఇమానే ఖెలిఫ్‌ కేసు నమోదు చేసింది. హ్యారీపోటర్‌ పుస్తక రచయిత జేకే రౌలింగ్‌ ఇమానే వ్యవహారంగా కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారు. మహిళల బాక్సింగ్‌లో పురుష క్రోమోజోమ్‌లు ఉన్న వారిని ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. టెస్లా సీఈవో కూడా ఓ పోస్ట్‌కు రిప్లై ఇవ్వడంతో అతనిపైనా చర్యలు తీసుకోవాలని ఇమానే భావిస్తోంది. మహిళల క్రీడల్లోకి పురుషులను అనుమతించకూడదని ఓ నెటిజన్‌ ఆ సమయంలో పోస్ట్‌ చేయగా దానికి కచ్చితంగా అని ఎలాన్‌ మస్క్‌ రిప్లై ఇచ్చారు. దీనిపైనా చర్యలు తీసుకునేందుకు ఇమానే సిద్దమైనట్లు తెలుస్తోంది. 

Also Read: అబ్బే ! అదేం లేదు! మా మనూ ఇంకా చిన్నపిల్ల!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desamడేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
Embed widget