అన్వేషించండి

Manu Bhaker-Neeraj Chopra: అబ్బే ! అదేం లేదు! మా మనూ ఇంకా చిన్నపిల్ల!

Neeraj Chopra Manu Bhaker: నీరజ్‌ చోప్రాతో మనూ బాకర్ పెళ్లి కుదిరిందన్న వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ విషయంపై మను బాకర్‌ తం‌డ్రి రామ్‌కిషన్‌  కీలక వ్యాఖ్యలు చేశారు.

Manu Bhaker's Father Clarifies On Marriage Rumours: ఒలింపిక్‌(Olympic)  మెడలిస్ట్‌ మను బాకర్‌-నీరజ్‌ చోప్రా(Neeraj Chopra Manu Bhaker) పెళ్లంటూ సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈ ఇద్దరు ఒలింపిక్‌ పతక విజేతలు పెళ్లి పీటలు ఎక్కనున్నారని.. వారిద్దరూ పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని రకరకాల ఊహాగానాలు రెండు రోజులుగా సోషల్‌ మీడియాను ఊపేస్తున్నాయి. మను బాకర్‌ తల్లి నీరజ్‌తో ఒట్టు వేయించుకోవడం... నీరజ్‌-మను సిగ్గు పడుతూ మాట్లాడుకోవడం ఇలా చాలా సంఘటనలను లింక్‌ చేసుకున్న నెటిజన్లు వాళ్లిద్దరి వివాహమే తర్వాయి అని కామెంట్లతో చెలరేగిపోయారు. అయితే ఈ విషయంపై మను బాకర్‌ తం‌డ్రి రామ్‌కిషన్‌ బాకర్‌ స్పందించారు. వీరిద్దరిపై వస్తున్న పుకార్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.

 
మనూ తండ్రి ఏమన్నాడంటే..?
మను బాకర్‌-నీరజ్‌ చోప్రా పెళ్లిపై మను బాకర్‌ తం‌డ్రి రామ్‌కిషన్‌(Ram Kishan)  కీలక వ్యాఖ్యలు చేశారు. మను బాకర్‌ ఇంకా చాలా చిన్నపిల్లని.. ఆమెకు ఇంకా పెళ్లి చేసుకునే వయసే రాలేదని స్పష్టం చేశారు. మను బాకర్‌ తల్లి సుమేధా భాకర్.. నీరజ్ చోప్రాను తన కొడుకులా భావిస్తుందని వెల్లడించారు. సోషల్ మీడియాలో నీరజ్‌-మనూ బాకర్‌ వివాహమంటూ వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని రామ్‌కిషన్‌ స్పష్టం చేశారు. తన కుమార్తె  ఇంకా చాలా చిన్నదని.. ఆమె వివాహం గురించి ఇంకా ఆలోచించడం లేదని తేల్చి చెప్పారు.  22 ఏళ్ల మనూ బాకర్‌ పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో  రెండు కాంస్య పతకాలు సాధించింది. నీరజ్ చోప్రా మామయ్య కూడా ఈ వైరల్ వీడియోపై స్పందించినట్లు తెలుస్తోంది. నీరజ్ పతకం తేవడంతో దేశం మొత్తం సంతోషంలో ఉందని.. అలాగే అతని పెళ్లి కూడా దేశం మొత్తానికి తెలిసిన తర్వాతే జరుగుతుందని అతను వ్యాఖ్యానించినట్లు తెలిసింది. 
 

ఎలా ప్రారంభమైందంటే..
2024 పారిస్ ఒలింపిక్స్ పూర్తయిన తర్వాత మనూ బాకర్‌, నీరజ్‌ చోప్రా పీకల్లోతు ప్రేమలో  ఉన్నారన్న వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు చెలరేగిపోయారు. ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత మను బాకర్‌ తల్లి సుమేధా భాకర్.. నీరజ్‌ చోప్రాతో మాట్లాడుతున్న  వీడియో వైరల్‌గా మారింది. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలీదు కానీ దానిపై చాలా ఊహాగానాలు చెలరేగాయి. ఇద్దరు ఒలింపియన్ల మధ్య చాలా కాలంగా ప్రేమలో ఉన్నారన్న వార్తలు కూడా వైరల్‌గా మారాయి. చాలా మీడియా సంస్థలు దానికి సంబంధించిన వార్తలను వండి ప్రేక్షకులకు అందించాయి.  మనూ  బాకర్‌ ఒలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో శ్రీజేష్‌తో కలిసి పతాకధారిగా వ్యవహరించింది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget