అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Paris Olympics 2024: ఒలింపిక్ పతకం గెలిస్తే భారీగా డబ్బు వస్తుందా? అథ్లెట్లకు ఎంత ప్రైజ్ మనీ ?
Olympic Games Paris 2024: ఒలింపిక్ పతక విజేతలపై కనక వర్షం కురుస్తుంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నందుకు వివిధ దేశాలు తమ క్రీడాకారులకు ప్రైజ్ మనీ ఇస్తాయి. ఎంతంటే?
Prize Money for Olympic Medal Winners: ఒలింపిక్స్(Olympics)లో పతకం సాధిస్తే తమ జీవితాలు మారిపోతాయని ఆటగాళ్లు ఎందరో. విశ్వ క్రీడల్లో గెలిచే ఒక్క పతకంతో అథ్లెట్ల తలరాతలు మారిపోతాయి. ఏళ్ల తరబడి చేసిన కష్టానికి.. పడ్డ శ్రమకు ఒక్క పతకంతో ఉపశమనం లభిస్తుంది. పతకం గెలిచిన క్రీడాకారుడు ఆ దేశంలో దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు కూడా పొందుతాడు. అయితే ఒలింపిక్ పతకం సాధించిన ఆటగాడికి ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ ఎంత నగదు ఇస్తుందో తెలుసా..? పతకం గెలిచిన వారికి భారీగా నజరానాలు అందుతాయని అంతా భావిస్తారు.
నిజంగానే పతకం సాధించిన వారికి అంత భారీగా ఒలింపిక్ కమిటీ ప్రైజ్ మనీ ఇస్తుందా అంటే అదేం లేదనే చెప్పాలి. అసలు ఒలింపిక్ పతకం గెలిచిన వారికి ఆ పతకం తప్ప ఒక్క డాలర్ కూడా ఇవ్వరు. కానీ తమ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో.. భవిష్యత్తు అథ్లెట్లకు ఆశలు కల్పించాలన్న తలంపుతో ఆయా దేశాలు, అక్కడి క్రీడా సంఘాలు మాత్రం పతకం సాధించిన వారికి భారీ నజరానాలు అందిస్తాయి. తమ క్రీడాకారులను నజరానాలను అందించడంలో ప్రపంచంలోనే ధనిక దేశం సౌదీ అరేబియా ముందుంది. సౌదీ అరేబియా అథ్లెట్ ఒక్క పతకం గెలిచినా అతని జీవితం ఇక మాములుగా ఉండదు. విలాసవంతమైన జీవితం అతని వశమైనట్లు. భారత ప్రభుత్వంతో పాటు క్రీడా సంఘాలు కూడా మన దేశ అథ్లెట్లకు అండగా నిలుస్తున్నాయి.
భారత్(India)
ఇండియా అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పతకమోత మోగిస్తే గోల్డ్ మెడల్‌కు రూ. 75 లక్షల నజరాన అందుకుంటారు. రజత పతకానికి రూ. 50 లక్షలు, కాంస్య పతకానికి రూ. 10 లక్షలు ఇస్తారు. ఇండియా ఒలింపిక్ సంఘం గోల్డ్ మెడల్ గెలిచిన వారికి లక్షా 20,000 డాలర్లను ప్రోత్సాహక బహుమతిగా ఇస్తుంది. ఇవికాక పారిశ్రామిక దిగ్గజాలు, క్రీడా సంఘాలు కూడా నజరాన ప్రకటిస్తుంటాయి.
అమెరికా (USA)
విశ్వ క్రీడల్లో పతక పంట పండించిన వారికి అగ్రరాజ్యం 37, 500 డాలర్లను నజరానగా అందిస్తోంది. ఒలింపిక్, పారా ఒలింపిక్ కమిటీ ఆపరేషన్ గోల్డ్ ప్రోగ్రాం అనే ఓ ప్రత్యేక పథకంతో పతక వీరులకు అమెరికా ఈ నజరాన అందిస్తుంది. రజత పతకానికి 22,500, కాంస్య పతకానికి 15,000 డాలర్లను అమెరికా తమ అథ్లెట్లకు అందిస్తుంది. ఇంకా వేరే క్రీడా సంఘాలు కూడా తమ ఆటగాళ్లకు బహుమతి కింద నగదు అందిస్తాయి.
సింగపూర్ (Singapore)
సింగపూర్ ఒలింపిక్ పతక విజేతలను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేక ప్రోత్సాహక పథకాన్నే ప్రారంభించేసింది. సింగపూర్ అథ్లెట్లు గోల్డ్ మెడల్ సాధిస్తే ఏడు లక్ష 44 వేల డాలర్లతో పాటు నెలవారి స్టైఫెండ్ కూడా ఇస్తారు. సిల్వర్‌కు 3, 72,000 డాలర్లు, బ్రౌంజ్ మెడల్‌కు లక్షా 86,000 వేల డాలర్లను బహుమతిగా ఇస్తారు.
సౌదీ అరేబియా (Saudi Arebia)
ఒలింపిక్ పతకం సాధిస్తే సౌదీ అరేబియా అథ్లెట్ల పంట పండినట్లే. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధిచిన తారెగ్ హమేదీకి సౌదీ ప్రభుత్వం 1.33 మిలియన్ డాలర్లను నజరాగా ప్రకటించింది. ఇప్పటివరకూ ఓ ఆటగాడికి దక్కిన అత్యధిక పారితోషకం ఇదేనన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. ఈసారి సౌదీ ఆటగాళ్లు ఎవరైనా స్వర్ణ పతకం గెలిస్తే వారికి ఎంతిస్తారన్న విషయాన్ని మీ ఊహకే వదిలేస్తున్నాం.
రష్యా (Russia)
విశ్వ క్రీడల్లో పతకం సాధించిన వారికి మాస్కో ప్రభుత్వం 45,300 డాలర్లను బహుమతిగా ఇస్తోంది. విదేశీ కార్లు, విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లతోపాటు ప్రత్యేకమైన బిరుదులు, అవార్డులను కూడా ఇస్తోంది. అలాగే పతకం గెలిచిన వారికి లైఫ్ టైమ్ స్టైపెండ్‌లు అందిస్తారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement