అన్వేషించండి

Paris Olympics 2024: హరియాణా నుంచి ఒలింపిక్స్‌ వరకు, ఓ ఛాంపియన్‌ ప్రస్థానం

Olympic Games Paris 2024: మను భాకర్‌తో కలిసి కాంస్యం గెలువడం ద్వారా సరబ్‌జోత్‌ వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇంతకీ సరబ్‌జోత్‌ ఎవరంటే..

Who is Sarabjot Singh: భయమా.. అంటే ఎంటీ.. ఇది ఓ సినిమాలో హీరో డైలాగ్‌.. ఇప్పుడు ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సరబ్‌జోత్‌(Sarabjot Singh) కూడా ఇదే బాపత్తు. ఒత్తిడా... అంటే ఏంటీ అని కాంస్య పతక పోరులో గెలిచిన అనంతరం సరబ్‌జోత్‌ వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్‌(Olympics 2024)లో పతకం గెలిచిన అనంతరం సరబ్‌జోత్‌ చేసిన ప్రకటన షూటింగ్‌పై అతని గురి కుదరటానికి నిదర్శనంగా నిలిచింది. తాను ఎప్పుడు ఎలాంటి ఒత్తిడి అనుభవించనని... తాను ఏం చేయగలనో అది వంద శాతం అందిస్తానని సరబ్‌జోత్‌ తెలిపాడు. షూటింగ్‌లో ఒత్తిడి అనుభవిస్తే ఆ ప్రభావం కనిపిస్తుందని అన్నాడు. 

 
సరిగ్గా పుష్కరం తర్వాత...
షూటింగ్‌లో గగన్‌ నారంగ్‌ కాంస్య పతకం గెలిచి ఇవాళ్టీకి సరిగ్గా పుష్కరం. సరిగ్గా 12 ఏళ్ల క్రితం 2012 జులై 30న గగన్‌ నారంగ్‌ విశ్వ క్రీడల్లో ఒలింపిక్‌ పతకం సాధించాడు. సరిగ్గా పుష్కరం తర్వాత సరబ్‌జోత్‌ సింగ్‌ భారత్‌కు మరో పతకం అందించి సత్తా చాటాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ విభాగంలో బరిలోకి దిగిన సరబ్‌జోత్‌ సింగ్‌ త్రుటిలో ఫైనల్‌ బెర్తును కోల్పోయాడు. ఆ ఓటమి సరబ్‌జోత్‌ను కుంగదీయలేదు. మరింత బలంగా తయారు చేసింది. అయిపోయిన దాని గురించి బాధ పడలేదు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సత్తా చాటాలని భావించాడు. అదే నిజమైంది 10 మీటర్ల  ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక పోరులో మనూ బాకర్‌తో కలిసి అద్భుతం చేశాడు. భారత్‌కు రెండో పతకం అందించాడు. ఈ పతకం సాధించేందుకు తనెంత తపన పడ్డాడో.. ఎంత శ్రమించాడో తనకే తెలుసు. 
 
హర్యాణ నుంచి ఒలింపిక్స్‌ వరకు..
తొలిసారిగా విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న సరబ్‌జోత్.. 13  సంవత్సరాల వయసులో షూటింగ్ సాధన చేయడం ప్రారంభించాడు. హర్యానాలోని అంబాలా సమీపంలోని ధేన్‌ గ్రామంలో 2001 సెప్టంబర్‌లో సరబ్‌జోత్‌ జన్మించాడు. సరబ్‌జోత్‌ 2021లో వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌గా నిలిచాడు. గత ఏడాది ఆసియా క్రీడల్లో రెండు పతకాలతోపాటు 2023, 2024లో మూడు ప్రపంచకప్ బంగారు పతకాలను కూడా గెలుచుకున్నాడు. 2023 చాంగ్వాన్ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు మూడ్రోజుల క్రితం జరిగిన విశ్వ క్రీడల 10 మీటర్ల ఎయిర్‌ పిస్తోల్‌ విభాగం ఫైనల్‌ బెర్తును త్రుటిలో చేజార్చుకున్నాడు. అంబాలాలోని ఏఆర్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్‌లో సరబ్‌జోత్‌ శిక్షణ తీసుకున్నాడు. సరబ్‌జిత్ విజయంతో తన స్నేహితుడు ఆదిత్య మల్రా కీలక పాత్ర పోషించాడు. అందుకే ఒలింపిక్స్‌ విజయానికి తన స్నేహితుడు ఎంతో స్ఫూర్తినిచ్చాడని సరబ్‌జోత్‌ తెలిపాడు. గొప్ప ఫుట్‌బాలర్‌ కావాలని కలలుకున్న సరబ్‌జోత్‌... మంచి షూటర్‌ అయి ఇప్పుడు భారత కీర్తి పతకాన్ని అంతర్జాతీయ క్రీడా వేదికపై రెపరెపలాడిస్తున్నాడు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget