అన్వేషించండి
Advertisement
Paris Olympics 2024: హ్యాట్రిక్‌కు అడుగు దూరంలో, నేడు మను బాకర్ ఫైనల్
Olympic Games Paris 2024: విశ్వ క్రీడల్లో ఇప్పటికే రెండు పతకాలు సాధించి మంచి టచ్‌లో ఉన్న మను హ్యాట్రిక్ కొట్టి ఇంతవరకూ భారత క్రీడా చరిత్రలో అద్భుతం చేసే అవకాశం ఉంది ఈరోజు.
Paris 2024 Olympics India schedule August 3: ముచ్చటగా మూడో పతకం గెలవాలన్న పట్టుదలతో స్టార్ షూటర్ మను బాకర్(Manu Bhaker)... ఆమె హ్యాట్రిక్ కొట్టి ఇంతవరకూ భారత క్రీడా చరిత్రలో ఎవరూ సాధించిన ఘనత సాధిస్తే చూడాలన్న తలంపుతో అభిమానులు సిద్ధంగా ఉన్నారు. విశ్వ క్రీడల్లో(Paris 2024 Olympics 2024) మూడో పతకంపై కన్నేసిన మను బాకర్ ఇవాళ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్‌లో తలపడనుంది. ఇప్పటికే రెండు పతకాలు సాధించి మంచి టచ్‌లో ఉన్న మను... ఈ పతకాన్ని కూడా సాధిస్తే... క్రీడా చరిత్రలో ఆమె పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నట్లే. ఇప్పటికే మహిళల 10 మీటర్ల పిస్టల్, మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లలో కాంస్య పతకాలను గెలుచుకున్న మను.. మూడో పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించాలని చూస్తోంది. ఆర్చరీలో దీపికా కుమారి మళ్లీ ఇవాళ బరిలో దిగనుంది. భారత ఆర్చర్లు దీపికా కుమారి, భజన్ కౌర్‌లతో పాటు బాక్సర్ నిశాంత్ దేవ్ కూడా నేడు బరిలో దిగనున్నారు.
మూడుసార్లు ఒలింపియన్ దీపికా కుమారి 18 ఏళ్ల భజన్ కౌర్‌తో కలిసి మహిళల వ్యక్తిగత ఆర్చరీలో పాల్గొననుంది. 16వ రౌండ్‌లో దీపికా జర్మనీకి చెందిన మిచెల్ క్రోపెన్‌తో తలపడనుంది. భజన్ రెండుసార్లు ఆసియా క్రీడల్లో పతక విజేత ఇండోనేషియాకు చెందిన డియానందా కొయిరునిసాతో తలపడనుంది. ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటికే మిక్స్‌డ్ టీమ్ సిల్వర్ మెడల్ సాధించిన క్రోపెన్‌తో దీపిక రౌండ్ ఆఫ్ 16లో తలపడనుంది. పురుషుల 71 కేజీల క్వార్టర్ ఫైనల్‌లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ మార్కో అలోన్సో వెర్డే అల్వారెజ్‌తో తలపడనున్నాడు. గోల్ఫ్‌లో శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్ రౌండ్ 3 కోసం పోటీ పడుతున్నారు.
ఇవాళ్టీ భారత షెడ్యూల్
ఆర్చరీ
మహిళల వ్యక్తిగత రౌండ్ 16 - దీపికా కుమారి vs మిచెల్ క్రోపెన్ (జర్మనీ) - 1:52
మహిళల వ్యక్తిగత రౌండ్ 16 - భజన్ కౌర్ vs దియానందా చోయిరునిసా (ఇండోనేషియా ) - 2:05 PM
మహిళల వ్యక్తిగత క్వార్టర్-ఫైనల్ (అర్హత సాధిస్తే) - 4:30 PM
మహిళల వ్యక్తిగత సెమీ-ఫైనల్ (అర్హత సాధిస్తే) - 5:22 PM
మహిళల వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్ (అర్హత సాధిస్తే) - 6:03 PM
మహిళల వ్యక్తిగత గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హత సాధిస్తే) - 6:16 PM
బాక్సింగ్
పురుషుల 71 కేజీల క్వార్టర్ ఫైనల్స్ - నిశాంత్ దేవ్ vs మార్కో అలోన్సో వెర్డే అల్వారెజ్ (మెక్సికో) - 12:18 AM (ఆగస్టు 4)
గోల్ఫ్
పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ రౌండ్ 3 - శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్ - 12:30PM
సెయిలింగ్
పురుషుల డింగీ రేసు 5 - విష్ణు శరవణన్ - 3:45 PM
పురుషుల డింగీ రేసు 6 - విష్ణు శరవణన్ -
5 మహిళల డింగీ రేసు 4 - నేత్ర కుమనన్ - 3:35 PM
మహిళల డింగీ రేసు 5 - నేత్ర కుమనన్ -
మహిళల డింగీ రేసు 6 - నేత్ర కుమనన్
షూటింగ్ మహిళల స్కీట్ క్వాలిఫికేషన్ డే 1
రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ - మధ్యాహ్నం 12:30
పురుషుల స్కీట్ అర్హత 2వ రోజు - అనంతజీత్ సింగ్ నరుకా - మధ్యాహ్నం 12:30 మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్ - మను భాకర్ - మధ్యాహ్నం 1:00
పురుషుల స్కీట్ ఫైనల్ (అర్హత సాధిస్తే) - 7:00 PM
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion