Paris Olympics 2024 : ప్లీజ్! అలాంటి భాష వాడొద్దు , ఒలింపిక్ కమిటీ విజ్ఞప్తి
Portrayal Guidelines to media: విశ్వ క్రీడలు సమీపిస్తున్న వేళ ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ కీలక సూచనలు చేసింది.మహిళలు, ట్రాన్స్ జెండర్లను తక్కువ చేసేలా ఎలాంటి ప్రకటనలు, కామెంట్లు ఉండద్దని చెప్పింది.
IOC advises media against calling trans athletes "biologically male/female": అంతర్జాతీయ క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ గేమ్స్ మరో 45 రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రీడల్లో సత్తా చాటి అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించాలని అథ్లెట్లు సిద్ధమవుతున్నారు. జులై 26 నుంచి పారిస్ వేదికగా ఒలింపిక్స్ 2024(Paris Olympics 2024 ) పోటీలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. కళ్లు మిరుమిట్లుగొలిపేలా ఆరంభ వేడుకలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వ క్రీడలు సమీపిస్తున్న వేళ... ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ(International Olympic Committee) కీలక సూచనలు చేసింది. జెండర్ ఈక్వలిటీని పాటించాలని నిబంధనల్లో పేర్కొంది. మహిళలు, ట్రాన్స్ జెండర్లను తక్కువ చేసేల ఎలాంటి ప్రకటనలు... కామెంట్లు ఉండకుండా జాగ్రత్త పడాలని ప్రసారకర్తలకు కూడా సూచించింది.
With #Paris2024 set to be the first @Olympics to achieve full gender parity on the field of play, the IOC's updated Portrayal Guidelines seek to provide practical checklists & advice for fair representation across all forms of media and communication.
— IOC MEDIA (@iocmedia) June 7, 2024
⬇️ https://t.co/IyMJ5eWXn2 pic.twitter.com/s6mxZpxOE4