అన్వేషించండి
Paris Olympics 2024: పారిస్‌లో అథ్లెట్లు భద్రమేనా? నిన్న మహిళపై రేప్, నేడు దొంగతనం
Olympic Games Paris 2024: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ కార్యక్రమానికి ముందు పారిస్ లో జరిగిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఆటగాళ్ల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
![Paris Olympics 2024: పారిస్‌లో అథ్లెట్లు భద్రమేనా? నిన్న మహిళపై రేప్, నేడు దొంగతనం Alleged gang rape of an Australian tourist raises alarms in Paris ahead of Olympic Games Paris Olympics 2024: పారిస్‌లో అథ్లెట్లు భద్రమేనా? నిన్న మహిళపై రేప్, నేడు దొంగతనం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/25/27c7c0c89dcda5922f3c33b9bc02acef17218891656921036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పారిస్‌లో అథ్లెట్లు భద్రమేనా (Photo Source: Twitter/@Olympics)
Source : twitter
Alleged rape of Australian rattles Paris days before Olympics: పారిస్ ఒలింపిక్స్( Paris Olympics) ఆరంభానికి ఒక రోజు ముందు కలకలం రేగింది. ఏకంగా ఓ దేశ అథ్లెట్ కారును పగొలగొట్టి దుండగులు దొంగతనానికి పాల్పడడం తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనతో పారిస్‌లో ఆటగాళ్ల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ అథ్లెట్ లోగాన్ మార్టిన్ కారు అద్దాలు పగొలగొట్టిన దుండగులు విలువైన వస్తువులు అపహరించినట్లు తెలుస్తోంది. పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఫ్రాన్స్ ప్రభుత్వం ఘనంగా ప్రకటించినా... పారిస్‌లో ఈ దాడి జరగడం తీవ్ర ఆందోళనకు కారణమైంది.
మరీ ఇంతలా తెగబడతారా..?
పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభానికి ముందు ఓ స్టార్ అథ్లెట్‌పై దుండగులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఆస్ట్రేలియన్ బీఎమ్‌ఎక్స్ స్టార్ లోగాన్ మార్టిన్ కారుపై దుండగులు దాడి చేశారు. లోగాన్‌కు చెందిన విలువైన వస్తువులను అపహరించుకు పోయారు. బ్లాక్ వ్యాన్‌లో వచ్చిన దుండగులు కారు అద్దాలు పగలగొట్టి తన వ్యక్తిగత వస్తువులు అపహరించుకుపోయినట్లు ఆస్ట్రేలియా తెలిపింది. తన బైక్‌లు సురక్షితంగా ఉన్నాయని... అయితే తన కారు నుంచి వ్యక్తిగత వస్తువులు ఉన్న బ్యాగ్‌లు దొంగలించారని మార్టిన్ తెలిపాడు. అయితే అదృష్టవశాత్తూ తమ వస్తువులు చాలా వరకు హోటల్ గదిలో ఉన్నాయని.. అవి కూడా కారులో ఉంటే ఇంకా ఎక్కువ పోగుట్టుకునే వారమని తెలిపారు. వాలెట్ సహా ఇతర వస్తువులను పోగొట్టుకున్నానని మార్టిన్ వెల్లడించాడు. ఒలింపిక్స్ జరుగుతున్న వేళ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నాడు. దాడి జరిగిన తర్వాత మార్టిన్ వస్తువులను ఆ ప్రదేశంలో చెల్లాచెదురుగా పడేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఆస్ట్రేలియన్ జట్టు చెఫ్ డి మిషన్ అన్నా మీరెస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్టిన్ కారు ధ్వంసం కావడం దురదృష్టకరమని...ఆమె అన్నారు. హోటల్‌కి వెళుతున్న సమయంలో ఈ దాడి జరగడంతో భద్రతాపరమైన భయాందోళనలు మరోసారి చెలరేగాయి.
దాడి జరగలేదు
అయితే ఇది కేవలం దొంగతనం మాత్రమే అని తనపై ఎలాంటి దాడి జరగలేదని... ఆస్ట్రేలియన్ బీఎమ్‌ఎక్స్ స్టార్ లోగాన్ మార్టిన్ వెల్లడించాడు. అయితే తన వ్యక్తిగత వస్తువుల్లో పనికిరాని వాటిని దుండగులు సమీపంలోని పార్కులో పడేసినట్లు గుర్తించినట్లు వెల్లడించాడు. ఇప్పటికే పారిస్‌లో ఆస్ట్రేలియన్ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. దీనిని పారిస్ అధికారులు ధ్రువీకరించారు. ఈ దాడి తర్వాత ఆస్ట్రేలియన్ ఒలింపియన్ అథ్లెట్లు తమ జట్టు యూనిఫాం ధరించి ఒలింపిక్ గ్రామం వెలుపలకు వెళ్లవద్దని ఆ దేశం హెచ్చరించింది.
అయిదుగురు ఆస్ట్రేలియా అథ్లెట్లకు కరోనా
ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆస్ట్రేలియా క్రీడాకారుల బృందంలో ఐదుగురికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. వాటర్ పోలో మహిళల జట్టు సభ్యులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, మిగిలిన ఆసీస్ క్రీడాకారులకు ఏ ఇబ్బందీ లేదని అధికారులు ప్రకటించారు. పాజిటివ్‌గా తేలిన ఆ ఐదుగురు ప్లేయర్లు కూడా ప్రస్తుతం బాగానే ఉన్నారని, పోటీల సమయానికి వారు సిద్ధంగా ఉంటారని వెల్లడించింది.
Also Read: 14 ఏళ్లకే ఒలింపిక్స్‌కు, భారత నిధి- ఈ ధినిధి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion