Neeraj Chopra skydiving: నీరజ్ చోప్రా మరో సాహసం.. మొన్న స్కూబా డైవింగ్.. నేడు స్కై డైవింగ్‌తో ఆకట్టుకున్న ఛాంపియన్
నీరజ్ చోప్రా ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. వారం రోజుల క్రితమే మాల్దీవుల్లో సరదాగా గడిపిన బల్లెం వీరుడు.. ఇప్పుడు దుబాయ్‌లో విహరిస్తున్నాడు. తాజాగా పామ్ దీవిలో స్కైడైవింగ్ చేసి అబ్బురపరిచాడు
భారత ఒలింపిక్ రెండో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ఖాళీ సమయాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నాడు. టోక్యో నుంచి వచ్చాక కొన్నాళ్లు ఆటకు విరామం ఇచ్చాడు. విహార యాత్రకు బయల్దేరాడు. కొన్ని రోజుల క్రితమే మాల్దీవుల్లో సరదాగా గడిపాడు. నీటిలోకి దిగినా బల్లెం విసురుతున్న పోజుతోనే అందరినీ ఆకట్టుకున్నాడు.
Also Read: డేవిడ్ వార్నర్ అంశంలో గుసగుసలెందుకు? ఏదో జరుగుతోందని సంజయ్ మంజ్రేకర్ అనుమానం!
తాజాగా నీరజ్ దుబాయ్‌లో పర్యటిస్తున్నాడు. అక్కడి ఆకాశహార్మాలను వీక్షిస్తున్నాడు. పామ్ దీవిలో స్కైడైవింగ్ చేసి ఆకట్టుకున్నాడు. నిపుణుల సమక్షంలో అతడీ పని చేశాడు. తొలుత విమానం నుంచి దూకేటప్పుడు భయం వేసిందని.. ఆ తర్వాత మజా వచ్చిందని చెప్పాడు. ప్రతి ఒక్కరూ ఈ అనుభవాన్ని ఆస్వాదించాలని సూచించాడు. స్కైడైవింగ్‌కు ముందు, తర్వాత తనకు ఏమనిపించిందో ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
View this post on Instagram
Also Read: ఆఖరి బంతికి సిక్స్..! ఆ కిక్కులో ఆర్‌సీబీ చేసుకున్న సంబరాలు చూడండి
టోక్యో ఒలింపిక్స్ నీరజ్ చోప్రా అద్భుతం చేసిన సంగతి తెలిసిందే. మహామహులతో పోటీపడుతూ అతడు జావెలిన్‌ను దూరంగా విసిరాడు. అగ్రస్థానంలో నిలిచాడు. స్వర్ణ పతకం అందుకున్నాడు. భారత్ నుంచి రెండో వ్యక్తిగత పసిడి అందుకున్న ఆటగాడిగా ఆవిర్భవించాడు. అంతేకాకుండా అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం, పతకం అందించిన వీరుడిగా చరిత్ర లిఖించాడు.
Also Read: మెస్సీ.. ఏడోసారి గెలుస్తాడా? రొనాల్డోతో పోటీపడుతున్న అర్జెంటీనా దిగ్గజం
టోక్యో నుంచి వచ్చిన నీరజ్‌కు భారత్‌లో ఘన స్వాగతం లభించింది. అభిమానులు అతడిని ఆత్రుతగా చూశారు. ప్రభుత్వాలు, క్రీడా సంఘాలు అతడిని సన్మానించాయి. ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా అతడికి చుర్మా తినిపించారు. ఇదే కార్యక్రమంలో నీరజ్ ప్రధానికి ఆటోగ్రాఫ్ చేసిన జావెలిన్‌ను బహూకరించాడు. దానికి వేలం నిర్వహించగా రూ.1.5 కోట్లు లభించాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
View this post on Instagram