Murali Vijay Records: భారత ఓపెనర్‌గా మురళీ విజయ్ ప్రత్యేక రికార్డు - ఓపెనర్లలో నాలుగో స్థానంలో!
భారత క్రికెటర్ మురళీ విజయ్‌కు టెస్టుల్లో ప్రత్యేకమైన రికార్డు ఉంది.

Murali Vijay Record Team India: భారత క్రికెట్ జట్టు ఆటగాడు మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున టెస్టు ఫార్మాట్‌లో 12 సెంచరీలు సాధించిన మురళీ కెరీర్ ఎంతో కాలం నిలవలేదు. టెస్టు ఫార్మాట్‌లో 61 మ్యాచ్‌లు ఆడాడు. వన్డే ఫార్మాట్‌లో కేవలం 17 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. అయితే టెస్టు ఫార్మాట్‌లో మురళీ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.
మురళీ విజయ్ తన కెరీర్‌లో టీమిండియా తరఫున 61 టెస్టు మ్యాచ్‌లు ఆడి 3,982 పరుగులు చేశాడు. భారత్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఓపెనర్‌గా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఓపెనర్‌గా విజయ్ 3,880 పరుగులు చేశాడు. ఈ విషయంలో సునీల్ గవాస్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. గవాస్కర్ 9,607 పరుగులు చేశాడు. ఈ విషయంలో వీరేంద్ర సెహ్వాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. సెహ్వాగ్ 8,124 పరుగులు చేశాడు. గౌతమ్ గంభీర్ 4,119 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో విజయ్‌కి పెద్దగా అవకాశాలు లేకపోవచ్చు కానీ టెస్టుల్లో మాత్రం తన సత్తా చాటుకున్నాడు.
విజయ్ కెరీర్ మొత్తం చూస్తే అతను బాగానే ఆడాడు. మురళీ విజయ్ 105 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ సమయంలో అతని అత్యుత్తమ స్కోరు 167 పరుగులు. మురళీ విజయ్ 17 వన్డేల్లో 339 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో హాఫ్ సెంచరీ కూడా సాధించాడు.
మురళీ విజయ్ తొమ్మిది టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. విజయ్ తొమ్మిది మ్యాచ్‌ల్లో 169 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతను 106 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 2,619 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రెండు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను టెస్ట్, వన్డే ఫార్మాట్లలో బౌలింగ్ కూడా చేశాడు.
ఓపెనర్‌గా టెస్టు ఫార్మాట్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్
9,607 - సునీల్ గవాస్కర్
8,124 - వీరేంద్ర సెహ్వాగ్
4,119 - గౌతమ్ గంభీర్
3,880 - మురళీ విజయ్
2,911 - నవజ్యోత్ సింగ్ సిద్ధూ
2008లో భారత తరఫున అరంగేట్రం చేసిన మురళీ విజయ్ 2018లో తన చివరి మ్యాచ్ ను ఆడాడు. ఈ మధ్యకాలంలో టెస్టుల్లో మురళీ విజయం కీలక ప్లేయర్ గా ఎదిగాడు. ఓవర్సీస్ లో భారత్ కు మురళీ విజయ్ ఉత్తమ ఓపెనర్లలో ఒకడిగా నిలిచాడు. విదేశాల్లో మురళీకి మంచి రికార్డు ఉంది. ఆస్ట్రేలియాపై బ్రిస్బేన్ వేదికగా చేసిన 144 పరుగులు, ఇంగ్లండ్ పై ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా చేసిన 145 పరుగులు విజయ్ టెస్ట్ కెరీర్ లో బెస్ట్ గా నిలిచాయి.
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్, మయాంక్ అగర్వాల్ లాంటి వాళ్లు ఓపెనర్లుగా నిలదొక్కుకోవటంతో బీసీసీఐ 2018 నుంచి మురళీ విజయ్ ను జట్టులోకి తీసుకోవడం లేదు. ఇటీవలే బీసీసీఐ 40 ఏళ్లు వచ్చినవారిని వృద్ధులుగా చూస్తోందంటూ మురళీ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. ఇప్పుడిక విదేశీ లీగుల్లో ఆడేందుకు సిద్ధమైనట్లు మురళీ విజయ్ తెలిపాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

