(Source: ECI | ABP NEWS)
Ram Charan Upasana: కవలలకు జన్మనివ్వనున్న రామ్ చరణ్ ఉపాసన కపుల్! - మెగా ఫ్యామిలీలో డబుల్ సందడి
Upasana Second Pregnancy: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈసారి ఈ జంట కవల పిల్లలకు ఆహ్వానం పలకనున్నట్లు తెలుస్తోంది.

Ram Charan Upasana Couple Announces Second Pregnancy : మెగా ఫ్యామిలీలో మరోసారి సంబరాలు మొదలయ్యాయి. రామ్ చరణ్ ఉపాసన దంపతులు త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అయితే, ఉపాసన కవలలకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల చిరంజీవి నివాసంలో దీపావళి సంబరాలతో పాటు ఉపాసనకు సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు పలువురు అతిథులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఈసారి క్లీంకారకు తోడుగా మరో ఇద్దరు చిన్నారులు రానున్నట్లు తెలుస్తోంది. 'ఈ దీపావళి మా ఇంట డబుల్ వేడుకల్ని తీసుకురావడంతో పాటు ప్రేమ, ఆశీర్వాదాల్ని డబుల్ చేసింది.' అంటూ రాసుకొచ్చారు.
This Diwali was all about double the celebration, double the love & double the blessings.
— Upasana Konidela (@upasanakonidela) October 23, 2025
🙏🙏 pic.twitter.com/YuSYmL82dd
Also Read: పాపం థామా... రష్మికను లైట్ తీసుకున్న తెలుగు ఆడియన్స్!
దీంతో ఈ జంట కవలలకు ఆహ్వానం పలికేందుకు ఆనందోత్సహాలతో ఎదురు చూస్తున్నట్లు మెగా సన్నిహితులు తెలిపారు. రామ్ చరణ్, ఉపాసన 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి 2023లో క్లీంకార జన్మించింది. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పారు. విషయం తెలుసుకున్న మెగా అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు విషెష్ చెబుతున్నారు. ఈసారి వారసుడి ఎంట్రీ కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ క్లీంకార ఫోటో మాత్రం రివీల్ చేయలేదు.




















