అన్వేషించండి

MIW Vs DCW: టేబుల్ టాప్ జట్ల మధ్య పోరు - టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ!

ముంబై ఇండియన్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

Delhi Capitals Women vs Mumbai Indians Women, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  మహిళల ప్రీమియర్ లీగ్‌లో ప్రస్తుతం టాప్ 2 స్థానాల్లో ముంబై, ఢిల్లీనే ఉన్నాయి.

ఢిల్లీ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టేబుల్ టాప్‌కు చేరుకునే అవకాశం ఉంది. కానీ అది జరగాలంటే ముంబై రన్‌రేట్‌ను కూడా దాటాల్సిందే. టేబుల్ టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది.

ముంబై ఇండియన్స్ మహిళలు (ప్లేయింగ్ XI)
హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, ఇస్సీ వాంగ్, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలిత, సైకా ఇషాక్

ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ (ప్లేయింగ్ XI)
మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, తానియా భాటియా (వికెట్ కీపర్), జెస్ జోనాసెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 18 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ముంబై ఇండియన్స్ 15 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాటర్లలో యాస్తిక భాటియా (41: 32 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే రెండో ఓవర్లోనే ఢిల్లీకి ఎదురు దెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్ షెఫాలీ వర్మ (2: 6 బంతుల్లో) సైకా ఇషాక్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత వచ్చిన అలీస్ క్యాప్సే (6: 7 బంతుల్లో), మారిజానే క్యాప్ (2: 4 బంతుల్లో) విఫలం అయ్యారు. దీంతో 31 పరుగులకే ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (25: 18 బంతుల్లో, మూడు ఫోర్లు), ఓపెనర్ మెగ్ లానింగ్‌తో (43: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచింది. వీరిద్దరూ బౌండరీలతో స్కోరు వేగాన్ని కూడా పెంచారు. మెగ్ లానింగ్ మొదట నిదానంగా ఆడినా క్రమంగా తను కూడా జోరు పెంచింది. అయితే సైకా ఇషాక్ ఢిల్లీకి మరోసారి షాక్ ఇచ్చింది. క్రీజులో కుదురుకున్న జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్ ఇద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేసింది.

ఆ తర్వాతి ఓవర్లోనే జొనాసెన్ (2: 3 బంతుల్లో), మిన్ను మణిలను (0: 3 బంతుల్లో) హేలీ మాథ్యూస్ అవుట్ చేసింది. దీంతో ఢిల్లీ 84 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన వారు కూడా త్వరగానే అవుట్ అయిపోయారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 18 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు యాస్తిక భాటియా (41: 32 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), హేలీ మాథ్యూస్ (32: 31 బంతుల్లో, ఆరు ఫోర్లు) సూపర్ స్టార్ట్ ఇచ్చారు. వీరిద్దరి బ్యాటింగ్‌తో ముంబై పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. ఈ జోడి మొదటి వికెట్‌కు 65 పరుగులు జోడించింది. కొట్టాల్సిన స్కోరు తక్కువే కావడంతో నెట్ రన్ రేట్ పెంచుకోవడానికి వీరు బౌండరీలతో చెలరేగి ఆడారు. కేవలం 8.5 ఓవర్లలో వీరు ఈ భాగస్వామ్యాన్ని అందించారు.

ఆ తర్వాత వీరిద్దరూ తక్కువ వ్యవధిలోనే అవుట్ అయినా వన్ డౌన్‌లో వచ్చిన నాట్ స్కివర్ బ్రంట్ (23: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (11: 8 బంతుల్లో, రెండు ఫోర్లు) కలిసి 15 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు. ముంబై బౌలర్లలో అలీస్ క్యాప్సీ, టారా నోరిస్‌లకు చెరో వికెట్ దక్కింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Puliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget