అన్వేషించండి

Malaysia Open: ఫైనల్లో తప్పని నిరాశ - సాత్విక్‌, చిరాగ్‌ ఓటమి

Malaysia Open: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడికి ఓటమి ఎదురైంది. ఫైనల్ వరకూ అద్భుతంగా ఆడిన ఈ ద్వయం తుదిమెట్టుపై బోల్తా పడింది.

Malaysia Open Super Tournament: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ(Malaysia Open Super 1000 tournament) ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడికి ఓటమి ఎదురైంది. ఫైనల్ వరకూ అద్భుతంగా ఆడిన ఈ ద్వయం తుదిమెట్టుపై బోల్తా పడింది. ప్రపంచ రెండో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి జోడి... 21-9, 18-21 17-21 తేడాతో చైనాకు చెందిన వరల్డ్‌ నెంబర్‌ వన్‌ జోడీ వాంగ్‌ – లియాంగ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమితో భారత జోడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 58 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్‌ గెలిచి మంచి ఊపు మీద కనిపించిన సాత్విక్‌–చిరాగ్‌ జోడి... తర్వాత రెండు సెట్లలో ఓడింది. ఫైనల్‌ దాకా అప్రతిహాత విజయాలతో వచ్చిన వరల్డ్‌ నెంబర్‌ 2 జోడీ.. తుది పోరులో మాత్రం తడబాటుకు గురైంది. తొలి సెట్‌లో ఈ ఇద్దరూ మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించారు. భారత జోడీ ఫస్ట్‌ సెట్‌ గెలిచిన తర్వాత రెండో సెట్‌ నుంచి చైనా ద్వయం పుంజుకుంది. క్రమంగా మ్యాచ్‌పై పట్టుబిగించిన చైనా జోడీ.. చివరి వరకూ అదే కొనసాగించి విజేతగా నిలిచింది.

సెమీస్‌లో అద్భుత ఆటతీరు
పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో రెండో సీడ్‌ సాత్విక్‌, చిరాగ్‌ జోడీ  21-18, 22-20 తేడాతో సౌత్‌ కొరియన్‌ జంట కంగ్‌ మిన్‌ హ్యూక్‌ – సీయో స్యూంగ్‌ జేలను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌ చేరడం ద్వారా మలేషియా ఓపెన్‌ డబుల్స్‌లో ఫైనల్స్‌ చేరిన తొలి భారత జోడీగా సాత్విక్‌, చిరాగ్‌ జోడీ రికార్డులకెక్కింది. 44 నిమిషాల పాటు హోరాహోరిగా సాగిన ఈ పోరులో సాత్విక్‌ జోడీ.. రెండు సెట్లలోనూ గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. గతేడాది ఇదే టోర్నీలో సెమీస్‌ వరకు చేరిన భారత జోడీ.. ఈ ఏడాది మాత్రం పట్టు విడవలేదు. రెండో సెట్‌లో ఒకదశలో 11-18తో ఓటమి ఖాయమనుకున్న స్థితిలో నిలిచిన భారత జోడీ.. అద్భుతంగా పుంజుకుని విజయం సాధించింది. 

చైనా మస్టర్స్‌లో ఓటమి
న భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి(Satwiksairaj Rankireddy-Chirag Shetty) జోడీకి షాక్‌ తగిలింది. చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ తుదిపోరులో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఈ జోడి పరాజయం పాలైంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆడిన ఆడిన అయిదు ఫైనల్లోనూ వరుస విజయాలు సాధించిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడి తొలిసారి తుది మెట్టుపై బోల్తా పడింది. చివరివరకూ పోరాడినా... ప్రతీ పాయింట్‌ కోసం తీవ్రంగా శ్రమించినా ఈ స్టార్‌ జోడీకి ఓటమి తప్పలేదు. చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సాత్విక్‌- చిరాగ్‌ జంట 19-21, 21-18, 19-21 తేడాతో చైనాకు చెందిన రెండో సీడ్‌ లియాంగ్‌- వాంగ్‌ చేతిలో పోరాడి ఓడింది. గంటా 11 నిమిషాల పాటు సాగిన పోరులో భారత ద్వయం అనవసర తప్పిదాలతో పరాజయం పాలైంది.

టాప్ హెడ్ లైన్స్

Mahela Jayawardene Steps Down: 3 సార్లు కప్ కొట్టించిన కోచ్ కు గుడ్ బై..  హెడ్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా, హార్దిక్  ట్రేడింగ్ తో మొదలైన పెను మార్పులు
3 సార్లు కప్ కొట్టించిన కోచ్ కు గుడ్ బై..  హెడ్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా, హార్దిక్  ట్రేడింగ్ తో మొదలైన పెను మార్పులు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Vaas Bowling Mastermind: వరల్డ్ కప్ హీరోతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. మునాఫ్  స్థానంలో లెజెండరీ పేసర్  ఎంట్రీ, గంగూలీ, యువరాజ్ కాంబోతో సరికొత్త టీమ్
వరల్డ్ కప్ హీరోతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. మునాఫ్  స్థానంలో లెజెండరీ పేసర్ ఎంట్రీ, గంగూలీ, యువరాజ్ కాంబోతో సరికొత్త టీమ్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget