IPL 2024 : ధోనీ మరో రికార్డు, ఊగిపోయిన చెపాక్
MS Dhoni: విరామం వచ్చినా ధోనీ కీపింగ్‌లో మాత్రం పదును తగ్గలేదు. ఇన్నింగ్స్ చివరి బంతికి అనుజ్ రావత్‌ను రనౌట్ చేశాడు. ఈ రనౌట్‌తో ధోనీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
MS Dhoni pulls off brilliant run-out against RCB : ఐపీఎల్(IPL) తొలి మ్యాచ్.. అభిమానులను క ఆకట్టుకుంది. సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ చెన్నై(CSK) తొలి మ్యాచ్‌లో చెన్నై విజయనాదం చేయగా... ఆర్సీబీ(RCB) పోరాటం కూడా ఆకట్టుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ(Dhoni) నామస్మరణతో చెపాక్ మార్మోగిపోయింది. ధోని దగ్గరకు బంతి వెళ్లినా... ధోనీ క్యాచ్ పట్టినా... రనౌట్ చేసినా స్టేడియం దద్దరిల్లిపోయింది. ధోనీ... ధోనీ... ధోనీ అన్న నినాదాలతో చెపాక్ ప్రతిధ్వనించింది. అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కొత్త హెయిర్‌స్టైల్‌తో మునుపటి ధోనీని చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. విరామం వచ్చినా ధోనీ కీపింగ్‌లో మాత్రం పదును తగ్గలేదు. రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ క్యాచ్‌లను అద్భుతంగా అందుకున్న ధోనీ.. ఇన్నింగ్స్ చివరి బంతికి అనుజ్ రావత్‌ను రనౌట్ చేశాడు. ఈ రనౌట్‌తో ధోనీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక రనౌట్లు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ధోనీ ఇప్పటి వరకు 24 రనౌట్లు చేశాడు. రవీంద్ర జడేజా 23 రనౌట్‌లు చేసి తర్వాతి స్థానంలో నిలిచాడు.
రోహిత్ భావోద్వేగ పోస్ట్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని(Ms Dhoni) తప్పుకోవటం పట్ల రోహిత్ శర్మ(Rohit Sharma) తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ(Instagram Story)లో ఆసక్తికర చిత్రాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రలో ధోనీకి రోహిత్ శర్మ షేక్ హ్యాండ్ ఇచ్చి కాంగ్రాట్స్ చెబుతున్నట్లు ఉంది. దీనికితోడు క్యాప్షన్ లో హ్యాండ్‌షేక్ ఎమోజీని కూడా పంచుకున్నాడు. ఐపీఎల్ లో ముంబై కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించడం... మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ కి గుడ్బై చెప్పడంతో ఐపీల్ లో ఒక శకం ముగిసింది... ఈ ఏడాది చివరిలో ఐపీఎల్ టోర్నీకి ధోమి వీడ్కోలు పలికే అవకాశలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ధోనీ ఐపీఎల్ 2024లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగారని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.
కోహ్లీ రికార్డు
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ 2024(IPL)లో తొలి మ్యాచులో ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. టీ20 క్రికెట్‌లో 12000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా నిలిచాడు. మొత్తంగా టీ20ల్లో 12000 పరుగులు చేసిన నాలుగో ప్లేయర్ విరాట్. టీ20 కెరీర్‌లో అత్యధిక పరుగులు చేసి ఆటగాడిగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 14,562 పరుగులు చేశాడు. తర్వాత పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ 12,993 పరుగులు, కీరన్ పోలార్డ్ 12,430 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు.