IPL 2025 LSG Out Of The PlayOff Race: లక్నోను ఎలిమినేట్ చేసిన సన్ రైజర్స్.. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చతికిలపడ్డ లక్నో.. రాణించిన అభిషేక్, క్లాసెన్
ప్లే ఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్ అయిన సన్ రైజర్స్.. లక్నోని కూడా తనతోపాటు తీసుకెళ్లింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బౌలింగ్ వైఫల్యంతో ఓడిపోయిన లక్నో.. నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది.

IPL 2025 SRH 4TH Victory: సన్ రైజర్స్ హైదరాబాద్.. లక్నో సూపర్ జెయింట్స్ కొంపముంచింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బరిలోకి దిగిన లక్నోను అదును చూసి దెబ్బ కొటింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్ లో అన్ని రంగాల్లో రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. 6 వికెట్లతో గెలుపొందింది. దీంతో లక్నో ప్లే ఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్ అయింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఓపెనర్ మిషెల్ మార్ష్ స్టన్నింగ్ ఫిఫ్టీ (39 బంతుల్లో 65, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో ఇషాన్ మలింగాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ లో సన్ రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఫిఫ్టీ (20 బంతుల్లో 59, 4 ఫోర్లు, 6 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో దిగ్వేశ్ రాఠీకి రెండు వికెట్లు దక్కాయి.
Mitchell Marsh scores 65 (39) runs before departing for the pavilion against SRH.#LSGvsSRH #LSGvSRH #SRHvsLSG #SRHvLSG #Abhishek #ishankishan pic.twitter.com/NZoR1hqSaF
— Info india (@IndEnfo) May 19, 2025
ఓపెనర్ల విధ్వంసం..
ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు మార్ష్, ఐడెన్ మార్క్రమ్ (38 బంతుల్లో 61, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగడంతో పవర్ ప్లేలోనే 69 పరుగులు సాధించారు. ముఖ్యంగా ఓపెనర్లు ఒకరినొకరు ప్రొత్సాహించుకుంటూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 115 రన్స్ తర్వాత మార్ష్ ఔటైనా, మార్క్రమ్ మాత్రం దూకుడు కొనసాగించాడు. అంతకుముందు 28 బంతుల్లోనే మార్ష్ ఫిఫ్టీ సాధించాడు. ఇక వన్ డౌన్ లో వచ్చిన రిషభ్ పంత్ (7) షరామాములుగానే మరోసారి విఫలమయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ (26 బంతుల్లో 45, 6 ఫోర్లు, 1 సిక్సర్) జోరు చూపించి, వేగంగా ఆడాడు. ఆ తర్వాత మిడిలార్డర్ విఫలం కావడంతో లక్నో అనుకున్నదానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది.
We 𝘄𝗲𝗿𝗲 familiar with your game, Abhi 👆
— SunRisers Hyderabad (@SunRisers) May 19, 2025
Abhishek Sharma | #PlayWithFire | #LSGvSRH | #TATAIPL2025 pic.twitter.com/0Q627ciiGu
హెడ్ కు రెస్ట్..
కరోనా కారణంగా ఈ మ్యాచ్ కు దూరమైన విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ స్థానంలో అథర్వ తైడే (13) అంతగా ఆకట్టుకోలేదు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫ్యాబ్యులస్ ఫిఫ్టీతో జోరు కొనసాగించాడు. అతనికి ఇషాన్ కిషన్ (35) చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 82 పరుగులను కేవలం 35 బంతుల్లోనే సాధించారు. ఈక్రమంలో కేవలం 18 బంతుల్లోనే అభిషేక్ శర్మ ఫిప్టీ సాధించాడు. ఆ తర్వాత తను వెనుదిరిగనప్పటికీ, హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 47, 4 ఫోర్లు, 1 సిక్సర్), కమిందు మెండిస్ (32 రిటైర్డ్ ఔట్) , కిషన్ సమష్టిగా ఆడి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. తాజా ఫలితంలో లక్నో ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. దీంతో చెన్నై, రాజస్థాన్, సన్ రైజర్స్, కేకేఆర్ తర్వాత ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ఐదో జట్టుగా లక్నో నిలిచింది. ఇప్పటికే పంజాబ్, ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకోగా, మిగతా ఒక బెర్త్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీపడనున్నాయి.




















