అన్వేషించండి

IPL 2024: హైదరాబాద్‌కు కీలకం, రాజస్థాన్‌పై పోరు నేడే

SRH vs RR, IPL 2024: రెండు వరుస పరాజయాలతో ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టంగా మారిన వేళ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. రాజస్థాన్‌ తో జరుగుతున్న మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.

SRH vs RR IPL 2024 Preview And Prediction : రెండు వరుస పరాజయాలతో ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టంగా మారిన వేళ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. లక్ష్య ఛేదనలో ఎదురవుతున్న సమస్యలను అధిరోహించి.. రాజస్థాన్‌(RR)తో జరుగుతున్న మ్యాచ్‌లో విజయం సాధించాలని హైదరాబాద్‌ పట్టుదలగా ఉంది. ఈ ఐపీఎల్‌లో ఇప్పటికే మూడుసార్లు 250కుపైగా పరుగులు చేసిన హైదరాబాద్‌ బ్యాటర్లు.. ఈ మ్యాచ్‌లో జూలు విదిల్చారని చూస్తున్నారు. ఇప్పటికే ప్లే ఆఫ్‌కు అధికారికంగా అర్హత సాధించిన రాజస్థాన్‌... ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఆత్మవిశ్వాసంతో ప్లే ఆఫ్‌కు వెళ్లాలని చూస్తోంది.

హైదరాబాద్‌పైనే ఒత్తిడి 
చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌లపై వరుసగా విజయాలు నమోదు చేసి చాలా పటిష్టంగా కనిపించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... కీలక పోరుకు సిద్ధమైంది. వరుసగా ఎదురవుతున్న పరాజయాలకు రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెక్‌ పెట్టాలని చూస్తోంది. ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అద్భుతంగా ఆడుతున్న రాజస్థాన్‌పై ఎలా ఆడుతుందో చూడాలి. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్‌ టాప్‌, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు లక్ష్య ఛేదనలో వరుసగా విఫలమవుతున్నారు. ఈ సీజన్‌లో SRH 250 పరుగుల మార్క్‌ను మూడుసార్లు అధిగమించింది, అయితే ఈ మూడు సార్లు కూడా హైదరాబాద్‌ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడే ఈ స్కోరు నమోదు చేసింది. తాము లక్ష్యాన్ని సులువుగానే ఛేదిస్తామని.. కానీ తమలో ఇంకా అది బయటకు రాలేదని కెప్టెన్ కమిన్స్ చెప్పాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరోసారి ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడితే రాజస్థాన్‌పై గెలుపు అంత కష్టం కాదు. ఐడెన్ మార్క్రామ్ మరింత మెరుగ్గా రాణించాలని హైదరాబాద్‌ జట్టు కోరుకుంటోంది. 
రాజస్థాన్‌ బలంగా..
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ చాలా బలంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌పై కూడా విజయం సాధించి ఆత్మ విశ్వాసంతో ప్లే ఆఫ్‌కు చేరాలని చూస్తోంది. 16 పాయింట్లతో పట్టికలో రాజస్థాన్‌ అగ్రస్థానంలో ఉంది. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్‌లతో రాజస్థాన్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్‌ ఉంది. హెట్‌మెయిర్‌, రోవ్‌మాన్ పావెల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మలతో బౌలింగ్‌ కూడా బలంగా ఉంది.

జట్లు:
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్‌), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర ఖాన్ చాహల్, అవేశ్వేంద్ర ఖాన్ చాహల్, , రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్, తనుష్ కోటియన్, కేశవ్ మహారాజ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతవేద్ సుబ్రమణ్యన్.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
Embed widget