![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
RR Vs PBKS: పంజాబ్‌పై టాస్ గెలిచిన సంజు - బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్!
ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
![RR Vs PBKS: పంజాబ్‌పై టాస్ గెలిచిన సంజు - బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్! RR Vs PBKS: Rajasthan Royals Won the Toss Chose to Bowl Against Punjab Kings RR Vs PBKS: పంజాబ్‌పై టాస్ గెలిచిన సంజు - బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/44b972937e10b28e65cda6d2e5d3cc1f1680702425697252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajasthan Royals vs Punjab Kings: ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే లక్ష్యంతో రెండు జట్లూ బరిలో దిగుతున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్టిట్యూట్స్
ధృవ్ జురెల్, ఆకాష్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, డోనావన్ ఫెరీరా
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్టిట్యూట్స్
రిషి ధావన్, అథర్వ టైడే, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, మాథ్యూ షార్ట్, మోహిత్ రాథీ
We are batting first again! 💪🏽#SherSquad, let's make it 2⃣ wins in 2⃣ games. 🎯#RRvPBKS #JazbaHaiPunjabi #SaddaPunjab #TATAIPL pic.twitter.com/hE5WdLi1hk
— Punjab Kings (@PunjabKingsIPL) April 5, 2023
How many runs will our opening duo put up on the board? 👇#JazbaHaiPunjabi | #SaddaPunjab | #TATAIPL | #RRvPBKS
— Punjab Kings (@PunjabKingsIPL) April 5, 2023
ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 72 పరుగుల తేడాతో ఓడించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ కింగ్స్ ఏడు పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగనుంది.
ఐపీఎల్లో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మొత్తం 24 మ్యాచ్‌లు ఆడగా, ఇందులో రాజస్థాన్ 14 మ్యాచ్‌లు గెలుపొందగా, పంజాబ్ కింగ్స్ తొమ్మిది మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. అదే సమయంలో ఈ రెండు జట్లూ తలపడ్డ గత ఐదు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ నాలుగు సార్లు విజయం సాధించింది.
రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎవరు గెలుస్తారో అంచనా వేయాలంటే... గణాంకాల ప్రకారం ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌దే పైచేయి అయినట్లు కనిపిస్తోంది. అయితే ఈసారి కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్ వంటి బౌలర్లతో పంజాబ్ కింగ్స్ గొప్ప బౌలింగ్ ఎటాక్‌ను కలిగి ఉంది. మరోవైపు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజూ శామ్సన్ వంటి బలమైన టాప్ ఆర్డర్‌తో రాజస్థాన్ జట్టు రంగంలోకి దిగనుంది.
ఈ మ్యాచ్ గౌహతిలో జరగనుంది. గౌహతి వేదికగా ఐపీఎల్లో జరగనున్న తొలి మ్యాచ్ ఇదే.అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫేవరెట్‌గా నిలవనుంది. ఇప్పుడు ఏ జట్టు గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)