అన్వేషించండి
Advertisement
IPL 2024: ఆధిపత్యం కోసం అగ్రజట్ల అమీతుమీ- కేకేఆర్‌పై నెగ్గితేనే రాజస్థాన్‌కు అడ్వాంటేజ్
RR vs KKR: ఐపిఎల్ 17 వ సీజన్ లో ఈ సారి ప్లే ఆఫ్‌కు ముందే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగనుంది.
Rajasthan Royals Vs Kolkata Knight Riders: వరుసగా నాలుగు మ్యాచుల్లో పరాజయం పాలైన రాజస్థాన్ రాయల్స్(RR).. కోల్‌కత్తా(KKR)తో జరిగే మ్యాచ్‌లో విజయాల బాట పట్టాలని చూస్తోంది. ప్లే ఆఫ్‌కు ముందు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా రాజస్థాన్ అగ్ర స్థానం దక్కించుకోలేదు. అయితే కోల్‌కత్తాపై గెలిచి ప్లే ఆఫ్‌కు ముందు ఆత్మ విశ్వాసం ప్రోది చేసుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది. హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్, చెన్నైలతో జరిగిన గత నాలుగు మ్యాచుల్లోనూ రాజస్థాన్ పరాజయం పాలైంది. ఈ వరుస ఓటములు రాజస్థాన్ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీశాయి. ఈ మ్యాచ్‌లో విజయంతో పాయింట్ల పట్టికలో ఏ మార్పులు జరగకపోయినా రాజస్థాన్ గాడిన పడేందుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
తడబడుతున్న రాజస్థాన్
16 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్త్ ఖాయం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్... కీలకమైన ప్లే ఆఫ్‌కు ముందు తడబడుతోంది. నాలుగు వరుస ఓటములు ఆ జట్టు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ కొట్టాయి. చివరి రెండు మ్యాచుల్లో రాజస్థాన్ బ్యాటర్లు కనీసం 150 పరుగుల మార్క్‌ను కూడా అందుకోలేకపోయారు. ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ స్వదేశానికి వెళ్లడంతో రాజస్థాన్ బ్యాటింగ్ మరింత బలహీనంగా మారింది. యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్, లోకల్ హీరో రియాన్ పరాగ్‌లు మెరుపులు మెరిపించి మళ్లీ గాడిన పడాలని చూస్తున్నారు.
ఫైనల్‌కు చేరాలంటే వీరు గాడినపడడం రాజస్థాన్‌కు చాలా అవసరం. పరాగ్ ఈ సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లోనే 153 స్ట్రైక్ రేట్‌తో 531 పరుగులు చేసిన పరాగ్.... మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు. సంజూ శాంసన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు కూడా రాణిస్తే రాజస్థాన్ గెలుపునకు అడ్డే ఉండదు. పరాగ్, శాంసన్ మరోసారి రాణిస్తే పంజాబ్ గెలుపు కష్టమే. రాజస్థాన్ జట్టు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా ఉంది. రియాన్, కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్‌మెయర్, ధృవ్ జురెల్‌లతో రాజస్తాన్ బ్యాటింగ్ బలంగా ఉంది.ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ , అవేష్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌లతో బౌలింగ్ కూడా చాలా బలంగా ఉంది.
పటిష్టంగా కోల్‌కత్తా
కోల్‌కత్తా ఈ సీజన్‌లో ఆత్మ విశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా కోల్‌కత్తా అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. గౌతమ్ గంభీర్ మార్గనిర్దేశంలో కోల్‌కత్తా గెలుపు జోరు కొనసాగిస్తోంది. కోల్‌కత్తా ఓపెనర్లు సాల్ట్-నరైన్ 182కుపైగా స్ట్రైక్ రేట్‌తో ఏడు అర్ధసెంచరీలు, ఒక సెంచరీ భాగస్వామ్యంతో ఇప్పటివరకూ 897 పరుగులు చేశారు. రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రాణిస్తే కోల్‌కత్తాకు తిరుగుండదు.
జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), KS భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ సింగ్, వరుణ్‌దీప్, రమణదీప్, చక్రవర్తి, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్, గుస్ అట్కిన్సన్, అల్లా గజన్‌ఫర్.
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్), అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, కుల్దీప్ సేన్, కునాల్ సింగ్ రాథోడ్, నాంద్రే బర్గర్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రాన్ హెట్మెయర్, శుభమ్ దూబే, శుభమ్ దూబే పావెల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, తనుష్ కోటియన్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion