IPL 2024: రికార్డులన్నీ బెంగళూరువైపే , కీలక మ్యాచ్‌లో ఢిల్లీ మెరుస్తుందా?
IPL 2024, RCB vs DC : ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకూ 30 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో బెంగళూరు 19 మ్యాచుల్లో విజయం సాధించింది. ఢిల్లీ 10 మ్యాచుల్లో గెలిచింది.
RCB vs DC Head to Head Records: ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో జరగబోయే మ్యాచ్‌లో వరుసగా ఐదో విజయంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కన్నేసింది. ఈ సీజన్‌ను ఓటములతో ఆరంభించిన బెంగళూరు రెండో అర్ధ భాగంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా నాలుగు విజయాలతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంటూ వస్తోంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచి బెంగళూరు పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరింది. విరాట్ కోహ్లీ భీకర ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లో కోహ్లీ 47 బంతుల్లో 92 పరుగులు చేసి సత్తా చాటాడు. మహ్మద్ సిరాజ్ మూడు వికెట్ల ప్రదర్శనతో రాణించాడు. దీంతో పంజాబ్‌ను 60 పరుగులతో చిత్తు చేసిన బెంగళూరు... ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీకి షాక్ ఇవ్వాలని చూస్తోంది. మరోవైపు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ కూడా గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పుంజుకుంది. గత మ్యాచ్‌లో పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్‌ను ఢిల్లీ ఓడించింది. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్ చెలరేగిపోతున్నారు. ఇప్పుడు బెంగళూరుపై అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని ఢిల్లీ చూస్తోంది.
హెడ్ టు హెడ్ రికార్డులు
ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకూ 30 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో బెంగళూరు 19 మ్యాచుల్లో విజయం సాధించింది. ఢిల్లీ 10 మ్యాచుల్లో గెలిచింది. ఇందులో ఓ సూపర్ ఓవర్ విజయం కూడా ఉంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌లో బెంగళూరు గెలిచింది. ఒక్క మ్యాచుల్లో ఫలితం రాలేదు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. కోహ్లీ 1030 పరుగులు చేశాడు. కింగ్ కోహ్లీ తర్వాత ఏబీ డివిలియర్స్ (690), రిషబ్ పంత్ (421) ఉన్నారు. బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ అత్యధిక వికెట్లు (15), కగిసో రబడ (13), హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ 12 వికెట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
పిచ్ రిపోర్ట్
చిన్నస్వామి స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామంగా ఉంటుంది. హైదరాబాద్ ఈ మైదానంలో 287 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద స్కోరు నమోదు చేసింది. చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు 147 పరుగులకే ఆలౌటైంది. అయితే 14వ ఓవర్‌లోనే బెంగళూరు లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరు-ఢిల్లీ మధ్య మ్యాచ్‌లోనూ పరుగల వరద పారే అవకాశం ఉంది.
జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్ ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్, సుమిత్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, కుమార్ కుషాగ్రా, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్, లిజాద్ విలియమ్స్, డేవిడ్ వార్నర్, ఝే రిచర్డ్‌సన్, అన్రిచ్ నార్ట్జే, యష్ ధుల్, మిచెల్ మార్ష్, రికీ భుయ్, రసిఖ్ దార్ సలామ్, విక్కీ ఓస్త్వాల్, స్వస్తిక్ చికారా.