అన్వేషించండి

Jasprit Bumrah News: వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..

ఐపీఎల్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో బుమ్రా వికెట్లు తీయకపోయినా, అతనికి రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. వాంఖడే వంటి చోట్ల పరుగుల నియంత్రణే కీలకంమ‌ని వ్యాఖ్యానించాడు.

IPL 2026 Jasprit Bumrah Updates: ముంబై ఇండియన్స్ (MI) ప్రధాన అస్త్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఒక వింతైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. గత ఐదు ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో అత‌డు ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా, ఈ వికెట్ల కరువు రెండు సీజన్ల పాటు కొనసాగుతోంది. ఐపీఎల్ 2025 చివరి మ్యాచ్‌తో పాటు, ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో బుమ్రా వికెట్ లేకుండానే వెనుదిరిగాడు. అయితే, ఈ గణంకాలపై టీమ్ ఇండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికరంగా స్పందించాడు. బుమ్రాను విమర్శించడం సరికాదని, ఆయన విలువ.. వికెట్లలో కాకుండా పరుగుల నియంత్రణలో ఉందని స్పష్టం చేశాడు.

రికార్డు స్థాయిలో వికెట్లు లేని ఇన్నింగ్స్..
తాజా గణాంకాల ప్రకారం, బుమ్రా ఏకంగా 122 బంతుల నుండి ఒక్క వికెట్ కూడా తీయలేదు. అత‌ని ఐపీఎల్ కెరీర్‌లో ఇదే అత్యంత సుదీర్ఘమైన వికెట్ లేని సమయం. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌ల్లో బుమ్రా వికెట్లు దక్కించుకోలేకపోయాడు. తాజాగా ఆదివారం వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తో జరిగిన మ్యాచ్‌లోనూ 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి వికెట్ లేకుండానే ఇన్నింగ్స్ ముగించాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 20 ఓవర్లలో 240 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, ముంబై బౌలర్లలో బుమ్రానే అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడం విశేషమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అశ్విన్ ఏమన్నాడంటే?
బుమ్రా వికెట్లు తీయడం లేదనే చర్చ జట్టు ప్రయోజనాలను దెబ్బతీస్తుందని అశ్విన్ తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నాడు. వాంఖడే వంటి హై-స్కోరింగ్ వేదికలపై వికెట్ల కోసం ప్రయత్నించడం కంటే, పక్కాగా యార్కర్లు వేస్తూ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోవడం చాలా ముఖ్యమని అన్నాడు. బుమ్రా చేస్తున్నది అదేన‌ని, ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ పరుగులు ఇవ్వకుండా ఒత్తిడి పెంచడం వికెట్లు తీయడం కంటే విలువైనదని అశ్విన్ వివరించాడు. టీ20 క్రికెట్‌లో బౌలింగ్ అనేది భాగస్వామ్యంతో కూడిన పని అని, ఒక ఎండ్‌లో బుమ్రా ఒత్తిడి పెంచితే మరో ఎండ్‌లో వికెట్లు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన గుర్తు చేశాడు.

ఎకానమీ రేటే బుమ్రా బలం..
వరుసగా వికెట్లు దక్కకపోయినా, బుమ్రా తన ఎకానమీ రేటును మాత్రం అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నాడు. కేవలం రెండు మ్యాచ్‌ల్లో తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ఆయన ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు. రికార్డు స్కోర్లు నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 8 లేదా 9 ఎకానమీతో బౌలింగ్ చేయడం ఒక గొప్ప విషయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే బుమ్రా ఇచ్చే ఈ ఎకానమీ సపోర్ట్ చాలా అవసరం. వికెట్లు ప్ర‌జెంట్ రాకపోయినా, తదుపరి మ్యాచ్‌ల్లో బుమ్రా ఖచ్చితంగా తన సత్తా చాటుతాడ‌ని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు ఇప్పటివరకు టోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఆడిన ముంబై.. కేవలం ఒక్క మ్యాచ్ లోనే గెలుపొందింది. దీంతో 8వ స్థానంలో ప్రజెంట్ నిలిచింది. 

 

టాప్ హెడ్ లైన్స్

DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget