అన్వేషించండి
Advertisement
IPL 2024: దూకుడే హైదరాబాద్ మంత్రం, నేడు పంజాబ్‌తో కీలక పోరు
PBKS vs SRH: ఐపీఎల్‌లో హైదరాబాద్ మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది. చెన్నైపై గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్... పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
PBKS vs SRH IPL 2024 Preview and Prediction : ఐపీఎల్(IPL 2024)లో హైదరాబాద్ మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది. చెన్నైపై గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్... పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకూ నాలుగు మ్యాచులు ఆడి రెండు విజయాలు... రెండు పరాజయాలతో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఇరు జట్లకు నాలుగు పాయింట్లు ఉన్నాయి. అయితే నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న సన్‌రైజర్స్ అయిదో స్థానంలో ఉండగా... పంజాబ్ కింగ్స్ ఆరో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
సన్‌రైజర్స్ జోరు సాగేనా..?
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు... దూకుడుగా ఆడి మరోసారి భారీ స్కోర్లు నమోదు చేయాలని చూస్తున్నారు. ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌పైనా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రామ్ దూకుడుగా ఆడుతూ హైదరాబాద్‌కు విజయాలు అందిస్తున్నారు. అభిషేక్ శర్మ, ట్రానిస్ హెడ్ సన్‌రైజర్స్‌కు మెరుపు ఆరంభాలు అందిస్తున్నారు. మరోసారి వీరు విజృంభిస్తే పంజాబ్‌కు తిప్పలు తప్పవు. హైదరాబాద్‌ను బౌలింగ్ విభాగం ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. భువనేశ్వర్ గత మ్యాచ్‌లో వికెట్ సాధించినా కొత్త బంతితో ఇబ్బంది పడ్డాడు. నటరాజన్ ఇప్పటివరకు నాలుగు వికెట్లే నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసిన కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఇంకా రాణించాల్సి ఉంది.
పంజాబ్ కూడా బలంగానే..
శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్‌లతో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ విధ్వంసకరంగా కనిపిస్తోంది. కానీ శిఖర్ ధావన్ ఇంతవరకూ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ భారీ ఇన్నింగ్సులు ఆడాలని పంజాబ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ పర్వాలేదనిపిస్తున్నాడు. డెత్-ఓవర్ స్పెషలిస్ట్ అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ స్థాయి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం పంజాబ్‌ను ఆందోళన పరుస్తోంది. హర్‌ప్రీత్ బ్రార్ రాణిస్తున్నప్పటికీ... లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. డెత్ ఓవర్లలో పంజాబ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. పంజాబ్‌లోని మొహాలీలో కొత్తగా నిర్మించిన మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: జయదేవ్ ఉనద్కత్, ఝటవేద్ సుబ్రమణ్యన్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూఖీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, నితీష్, అబ్హ్ జాన్సేన్, అబ్హ్ జాన్సేన్ ఉపేంద్ర యాదవ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, ఆకాష్ మహరాజ్ సింగ్, వనిందు హసరంగా, ఉమ్రాన్ మాలిక్.
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్యా ., విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌ.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement