అన్వేషించండి
Advertisement
PBKS vs GT : 142 పరుగులకే పంజాబ్ ఆలౌట్, మెరిసిన సాయికిశోర్
PBKS vs GT : గుజరాత్‌తో మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. గుజరాత్ బౌలర్లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.
PBKS vs GT IPL 2024 Gujarat target 143: పంజాబ్(PBKS)తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ (GT)బౌలర్లు రాణించారు. గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లో పంజాబ్ 142 పరుగులకే కుప్పకూలింది. ప్రభ్‌సిమ్రన్‌సింగ్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ 30 పరుగుల మార్క్‌ను కూడా అందుకోలేకపోయారు. సాయి కిశోర్ నాలుగు వికెట్లతో పంజాబ్ పతానాన్ని శాసించగా ... మిగిలిన గుజరాత్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
వరుసగా వికెట్లు
పంజాబ్‌కు తొలి ఓవర్ నుంచే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్ వేసిన ఒమర్జాయ్ కట్టుదిట్టంగా బంతులు విసరడంతో కేవలం రెండు పరుగులే వచ్చాయి. కానీ రెండో ఓవర్‌లో పంజాబ్ బ్యాటర్లు పుంజుకున్నారు. సందీప్ వారియర్ వేసిన రెండో ఓవర్‌లో పంజాబ్ 21 పరుగులు రాబట్టింది. ప్రభ్ సిమన్ ఆడి మూడు బౌండరీలు, ఒక సిక్స్ కొట్టాడు. తొలి 3 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసిన పంజాబ్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ తర్వాతే పంజాబ్ కష్టాలు మొదలయ్యాయి. 52 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 35 పరుగులు చేసి మోహిత్ వేసిన ఆరో ఓవర్లో అవుటయ్యాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి పంజాబ్ స్కోర్ ఒక వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. 63 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 63/2. రషీద్ వేసిన 8వ ఓవర్‌లో మరో వికెట్ పడింది. ఐదో బంతికి 20 పరుగులు చేసిన కరన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. వికెట్లు పడటంతో పంజాబ్ బ్యాటింగ్ నెమ్మదించింది. నూర్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో పంజాబ్ 3 పరుగులు చేసింది. 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 74/3.
సాయి కిశోర్ వేసిన 14వ ఓవర్లో అశుతోష్(3) ఔటయ్యాడు. 5 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ స్కోర్ 97 పరుగులకే పరిమితమైంది. 17 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 114/7. సాయి కిశోర్ నాలుగు వికెట్లతో పంజాబ్ పతానాన్ని శాసించగా నిర్ణీత 20 ఓవర్లో పంజాబ్ 142 పరుగులకే కుప్పకూలింది. గత ఎనిమిదేళ్లుగా కనీసం ప్లే ఆఫ్‌కు చేరిన పంజాబ్ సూపర్ కింగ్స్(PBKS).. మరోసారి ఆ దిశగా పయనిస్తుండడం ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఐపీఎల్(IPL) 2014 సీజన్ నుంచి నాకౌట్ దశకు చేరుకోలేదు. ఈ ఐపీఎల్లో ఇప్పటివరకూ ఏడు మ్యాచులు ఆడిన పంజాబ్ రెండు విజయాలు.. అయిదు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లోనూ పంజాబ్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు పాయింట్ల పట్టికలో గుజరాత్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఏడు మ్యాచుల్లో మూడు విజయాలు.. నాలుగు పరాజయాలతో కొనసాగుతోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీనిని ఢిల్లీ బ్యాటర్లు సునాయసంగా ఛేదించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
సినిమా రివ్యూ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion