అన్వేషించండి

Hardik Pandya News: ముంబై వర్సెస్ బెంగళూరు ఫైట్.. సూర్యకుమార్ యాదవ్ రీ ఎంట్రీ! హార్దిక్ పాండ్యా ఇంజ్యూరీ అప్డేట్

ముంబై ఇండియన్స్ కీలక పోరులో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. తండ్రి అయిన సంతోషంలో ఉన్న సూర్యకుమార్  జట్టుతో చేరనుండగా, హార్దిక్ గాయంతో దూరమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

IPL 2026 RCB VS MI Raipur Match Update: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం రాయ్‌పూర్‌లో ఒక క్రూషియల్ మ్యాచ్ జరగబోతోంది . ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై ఇండియన్స్‌కు ఈ గెలుపు చాలా అవసరం.. అయితే ఆర్సీబీ ఇప్పటికే టాప్ ఫోర్‌లో ఉండి పటిష్టంగా కనిపిస్తోంది.. ముంబై రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో ఈ మ్యాచ్ ఆడేది అనుమానంగానే ఉంది.. మరోవైపు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆనందంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ తాజాగా టీమ్‌తో చేరబోతున్నాడు.. ఆర్సీబీ ప్లేయర్లు రాయ్‌పూర్ లోని లోకల్ కల్చర్ ను ఎంజాయ్ చేస్తూ ఛత్తీస్‌గఢ్ సంప్రదాయ వంటకాలను రుచి చూశారు.. హోమ్ గ్రౌండ్ మార్పుతో రాయ్‌పూర్ స్టేడియంలో జరగనున్న ఈ పోరు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.

ఇక రాయ్‌పూర్‌ వేదికగా ఆదివారం జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌పై అందరి కళ్లు ఉన్నాయి. ఒకవైపు ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ముంబై ఇండియన్స్ కష్టపడుతుంటే, మరోవైపు బెంగళూరు జట్టు ఇప్పటికే రేసులో ముందంజలో ఉంది. అయితే ఈ కీలక పోరుకు ముందు ముంబై ఇండియన్స్‌ను గాయాల బెడద వేధిస్తోంది. వెన్నునొప్పి కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. మెడికల్ టీమ్ అతని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నప్పటికీ, ఆర్సీబీతో మ్యాచ్ కు అతను అందుబాటులో ఉండటం కష్టమేనని సమాచారం. ముంబై ఫ్యాన్స్‌కు ఇదొక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.

సూర్య రాకతో జోష్..
ముంబై టీమ్‌కి గుడ్ న్యూస్.. స్టార్ బ్యాటర్ క‌మ్ స్టాండిన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి జట్టులోకి రాబోతున్నాడు. గురువారం సూర్యకుమార్, దేవిషా శెట్టి దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని ఆయన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. బుధవారం జట్టు రాయ్‌పూర్ వెళ్ళినప్పుడు సూర్య వాళ్లతో లేడు. తన భార్య డెలివరీ సమయంలో దగ్గరున్న సూర్య, ఆర్సీబీతో మ్యాచ్ కోసం టీమ్ తో కలుస్తాడు. గత మ్యాచ్ లో ముంబైకి సారథ్యం వహించిన సూర్య రాకతో బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం కానుంది. దీపక్ చాహర్ తో పాటు ఇతర టీమ్ మెంబర్స్ సూర్యకు అభినందనలు తెలిపారు.

ఆర్సీబీ లోకల్ కల్చర్ టూర్..
ఆర్సీబీ టీమ్ రాయ్‌పూర్‌లోని లోకల్ వైబ్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ సంప్రదాయాలు, అక్కడి కళలు, సంగీతం గురించి తెలుసుకోవడానికి ఒక ఎక్స్‌పోను సందర్శించారు. లోకల్ ఫుడ్ ఐటమ్స్ ను టేస్ట్ చేయడమే కాకుండా, అక్కడి గిరిజన తెగల చరిత్ర గురించి నేర్చుకున్నారు. కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. ఇక్కడి డ్రమ్స్ మ్యూజిక్, డ్యాన్సులు చాలా బాగున్నాయని, రాయ్‌పూర్ కల్చర్ గురించి తెలుసుకోవడం ఒక మంచి ఎక్స్ పీరియన్స్ అని చెప్పుకొచ్చాడు. ప్రాక్టీస్ సెషన్స్ మధ్యలో ఇలాంటి కార్యక్రమాలు ప్లేయర్ల ఒత్తిడిని తగ్గిస్తాయని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.

హోమ్ గ్రౌండ్ మార్పు..
ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ కి ఎంతో ముఖ్యమ‌ని తెలుస్తోంది. పాయింట్ల పట్టికలో వాళ్లు వెనుకబడి ఉన్నారు. బెంగళూరు జట్టుకు ఇది హోమ్ గ్రౌండ్ కావడం విశేషం. నిజానికి ఆర్సీబీ తన మొదటి ఐదు మ్యాచ్ లను చిన్నస్వామి స్టేడియంలో ఆడింది. అయితే  మిగిలిన రెండు హోమ్ మ్యాచ్ లను రాయ్‌పూర్ లోని వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడుతోంది. ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది. ముంబై టీమ్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు అనివార్యం. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో ఉండటం వాళ్లకు కలిసి వచ్చే అంశం. అలాగే హార్దిక్ పాండ్యా లేకపోతే టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు ఆర్సీబీ ఇప్పటికే ప్లేఆఫ్స్ కు చేరువలో ఉంది కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే ఛాన్స్ ఉంది. రాయ్‌పూర్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget