అన్వేషించండి

Hardik Pandya : హార్దిక్ పాండ్యాను దూరం పెట్టిన ముంబై ఇండియన్స్‌! సంచలనంగా మారుతున్న పరిణామాలు!

Hardik Pandya : జట్టుకు వరుస వైఫల్యాలు అందించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ టీమ్‌ పక్కన పెట్టిందా అంటే, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ముంబై ఇండియన్స్‌లో హార్దిక్ పాండ్యా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
  • వెన్నునొప్పి కారణంగా హార్దిక్‌ను జట్టు నుంచి పక్కన పెట్టారనే వార్తలు వస్తున్నాయి.
  • కెప్టెన్సీ మార్పు, ఆటతీరు నిరాశపరిచి జట్టుకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది.
  • హార్దిక్‌పై యాజమాన్యం, ఆటగాళ్లు, అభిమానుల అంచనాలు నెరవేరలేదు.

Hardik Pandya : ఐపీఎల్‌ 2026 సీజన్ ముంబై ఇండియన్స్‌కు జట్టుకు పీడకలగా మారింది. వారికి అసలు కలిసి రాలేదు. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయి అత్యంత దారుణమైన ప్రదర్శన ఇస్తోంది. ఈ కష్టకాలంలో జట్టును ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా చుట్టూ ఇప్పుడు వివాదాలు, సందేహాలు ముసురుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం రాయ్‌పూర్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగనున్న కీలక పోరు కోసం ముంబై ఇండియన్స్ జట్టు విమానాశ్రయం నుంచి బయల్దేరగా అందులో హార్దిక్ పాండ్యా కనిపించలేదు. దీంతో ఆయనను ముంబై ఇండియన్స్ పక్కన పెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

ముంబై ఇండియన్స్ జట్టుకు దూరంగా హార్దిక్ పాండ్యా

మే4న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక పాండ్యా ఆడలేదు. ఆ సమయంలో అతనికి వెన్నునొప్పి ఉన్నట్టు జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. హార్దిక్ స్థానంలో సూర్య కుమార్ యాదవ్‌ ఆ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే బుధవారం ముంబై విమానాశ్రయం టెర్మినల్‌ 1 వద్ద జట్టు సభ్యులందరూ కనిపించినప్పటికీ , హార్దిక పాండ్యా మాత్రం వారిలో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతను నేరుగా రాయ్‌పూర్‌లో జట్టుతో కలుస్తాడా లేదా అనే విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదు. 

యాజాన్యమే హార్దిక్‌ను దూరం పెట్టిందా?

క్రికెట్ వర్గాల్లో హార్దిక్ గైర్హాజరీపై కేవలం గాయం మాత్రమే కారణం కాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో, బంతితో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 146 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా స్ట్రైక్ రేట్ 136.45 ఉంది. బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయాడు.  రోహిత్‌ను కెప్టన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాను పీఠంపై కూర్చోబెట్టం ముంబై ఇండియన్స్‌కు ఇబ్బందిగా మారింది. జట్టు సమన్వయం దెబ్బతింది.  

కెప్టెన్‌గా రోహిత్ శర్మ   

హార్ధిక్ గాయం గురించి ర్యాన్ రికెల్టన్ మాట్లాడుతూ.... అతనికి వెన్నునొప్పి ఉందని నాకు మధ్యాహ్నం తెలిసింది. అది ఎంత తీవ్రంగా ఉందో, అతను ఎప్పుడు తిరిగి వస్తాడో నాకు తెలియదు అని కామెంట్ చేశాడు. మే 6 మధ్యాహ్నం జట్టు సభ్యులు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. ఒక వేళ హార్దిక అందుబాటులో లేకపోతే కెప్టెన్ ఎవరు అవుతారనే చర్చ జరుగుతుంది. చాలా మంది సూర్యకుమార్ ఉంటాడు కదా అనుకుంటారు. కానీ సూర్య కుమార్ భార్య గర్భవతి, ఆమెకు ఒకట్రెండు రోజుల్లో బిడ్డ పుట్టబోతోంది. అందుకే  అతను కూడా జట్టుకు దూరంగా ఉంటాడు. చివరకు రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉందని సమాచారం.   

ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచ్‌లో కేవలం మూడింటిలోనే గెలిచింది. జట్టులో జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ సమష్టిగా విజయాలు సాధించడంలో విఫలమవుతోంది. రోహిత్ శర్మ నుంచి హార్ధిక్‌కు నాయకత్వ మార్పిడి ఆశించిన స్థాయిలో సాఫీగా జరగలేదు. గ్రౌండ్‌లో హార్దిక్ తీసుకుంటున్న నిర్ణయాలు, క్లిష్ట సమయంలో వికెట్లు తీయలేకపోవడం జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాయి. 

హార్దిక్ పాండ్యా గాయం తీవ్ర ఎంత, అతను రాయ్‌పూర్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేకా ముంబై ఇండియన్స్ యాజమాన్యం నాయకత్వం మార్పుపై ఆలోచిస్తుందా అనేది ఒకట్రెండు రోజుల్లో తేలనుంది. 

Frequently Asked Questions

2026 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ప్రదర్శన ఎలా ఉంది?

ముంబై ఇండియన్స్‌కు 2026 ఐపీఎల్‌ సీజన్ కలసి రాలేదు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.

హార్దిక్ పాండ్యా రాయ్‌పూర్‌ మ్యాచ్‌కు ఎందుకు హాజరు కాలేదు?

హార్దిక్ పాండ్యాకు వెన్నునొప్పి కారణంగా రాయ్‌పూర్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌కు హాజరు కాలేదని సమాచారం. అతని గాయం తీవ్రతపై స్పష్టత లేదు.

హార్దిక్ పాండ్యా ఆటతీరుపై ఏమైనా విమర్శలున్నాయా?

అవును, ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జట్టు ప్రదర్శన కూడా దీనికి తోడైంది.

హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోతే ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారు?

హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోతే, సూర్యకుమార్ యాదవ్‌ మరోసారి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
Embed widget