అన్వేషించండి

IPL 2026 Final Venue: ఐపీఎల్ ఫైనల్ ఆతిథ్య హక్కులను RCB నుంచి ఎందుకు తొలగించారు? BCCI క్లారిటీ ఇదే

IPL 2026 Final Date: బీసీసీఐ ఫైనల్ మే 31న జరగనున్న ఐపీఎల్ ఫైనల్ 2026 వేదికగా మొదట బెంగళూరును ఎంచుకుంది, కానీ కొన్ని కారణాలతో నరేంద్ర మోదీ స్టేడియంకు మార్చారు.

ముంబై: IPL 2026 ఫైనల్ మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. బుధవారం నాడు BCCI ఐపీఎల్ 19వ సీజన్ ప్లేఆఫ్‌ల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఐపీఎల్ ఫైనల్ వేదిక కోసం మొదట బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియాన్ని ఎంచుకున్నామని, అయితే ఎందుకు దానిని అహ్మదాబాద్‌కు మార్చారో బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ లీగ్ స్టేజీ కీలక దశకు చేరుకుంది. ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ ఆయా జట్లకు ముఖ్యమే. రేసులో నిలవాలంటే ఆ జట్లు మ్యాచ్‌లు నెగ్గక తప్పదు. ప్లేఆఫ్‌ల పరంగా ప్రతి మ్యాచ్ చాలా ముఖ్యమైనది. నరేంద్ర మోదీ స్టేడియం గుజరాత్ టైటాన్స్ హోం గ్రౌండ్, ఇక్కడ గత 4 ఏళ్లలో 3 ఫైనల్స్ జరిగాయి. ఇప్పుడు ఈ సీజన్‌లో ఈ వేదికపై నాల్గవ ఫైనల్ నిర్వహించనున్నారు. ప్లేఆఫ్స్ షెడ్యూల్ ప్రకటనతో పాటు, ఐపీఎల్ 2026 ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ముందుగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఎంచుకున్నామని, అయితే కొన్ని విషయాల వల్ల వేదికను మార్చాల్సి వచ్చిందని BCCI స్పష్టంగా తెలిపింది.

RCB నుండి ఆతిథ్యాన్ని ఎందుకు తీసేశారు.. BCCI ఏం చెప్పింది

‘ఐపీఎల్ 2026 ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి మొదట బెంగళూరును ఎంచుకున్నాం. అయితే, స్థానిక క్రికెట్ బోర్డ్,  అధికారుల కొన్ని అవసరాల కారణంగా, ఇవి BCCI నిబంధనలు, ప్రోటోకాల్‌ల పరిధికి మించి ఉన్నాయి. దాంతో ఫైనల్ వేదిక బెంగళూరు నుంచి మరో వేదికకు మార్చాల్సి వచ్చిందని’ బీసీసీఐ పేర్కొంది.

కొన్ని నివేదికల ప్రకారం, టిక్కెట్ల అమ్మకం, డిమాండ్‌కు సంబంధించి వివాదం కారణంగా RCB హోం గ్రౌండ్ నుండి ఫైనల్ ఆతిథ్యాన్ని తీసేశారని సమాచారం. సీజన్ ప్రారంభానికి ముందు, MLAలు ప్రజా ప్రతినిధులు, వారికి కనీసం 5 ఐపీఎల్ టిక్కెట్లు ఇవ్వాలి. వారు టిక్కెట్ల కోసం ఎందుకు క్యూలో నిల్చోవాలి ? అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ కూడా RCB మ్యాచ్‌ల కోసం MLAలు, ఎంపీలకు 3 టిక్కెట్లు చొప్పున ఇస్తామని చెప్పారు.

అయితే, టిక్కెట్ల డిమాండ్ గురించి BCCI స్పష్టంగా ఏం చెప్పలేదు, అయితే స్థానిక క్రికెట్ బోర్డు (కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్), అధికారుల కొన్ని అవసరాలు ఉన్నాయని.. ఇవి BCCI మార్గదర్శకాలు, ప్రోటోకాల్‌ల పరిధిలోకి రావని పేర్కొంది. ఇదే కారణాలతో IPL 2026 ఫైనల్ వేదిక మార్చినట్లు అంతా భావిస్తున్నారు. మరోవైపు గత ఏడాది ఆర్సీబీ విజయం సాధించాక చిన్నస్వామిలో కార్యక్రమంలో సందర్భంగా తొక్కిసలాట జరిగి అభిమానులు చనిపోవడం తెలిసిందే. అభిమానుల సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని అతిపెద్ద స్టేడియంలో, పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ఫైనల్ వేదికను అహ్మదాబాద్ లోని నరేంద్ర స్టేడియానికి మార్చినట్లు తెలుస్తోంది.

IPL 2026 ప్లేఆఫ్‌ల షెడ్యూల్

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 ( లీగ్ స్టేజీలో తొలి 2 స్థానాల్లోని జట్లు) మే 26న ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిర్వహిస్తారు. ఆపై ఎలిమినేటర్ మ్యాచ్ ( లీగ్ స్టేజీలో 3, 4 స్థానాల్లో జట్లు) మే 27న న్యూ చండీగఢ్ (ముల్లాన్‌పూర్)లో జరుగుతుంది. మే 29న న్యూ చండీగఢ్‌లో క్వాలిఫయర్-2 జరుగుతుంది. ఫైనల్ మే 31న నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 KKR VS RCB Result Update: కోహ్లీ అన్ బీటెన్ సెంచ‌రీ.. ఆర్సీబీ ఈజీ విక్ట‌రీ.. టాప్ ప్లేస్ కు ప‌తిదార్ సేన‌.. స‌త్తా చాటిన ప‌డిక్క‌ల్, కేకేఆర్ కు నిరాశ‌
కోహ్లీ అన్ బీటెన్ సెంచ‌రీ.. ఆర్సీబీ ఈజీ విక్ట‌రీ.. టాప్ ప్లేస్ కు ప‌తిదార్ సేన‌.. స‌త్తా చాటిన ప‌డిక్క‌ల్, కేకేఆర్ కు నిరాశ‌
Virat Kohli Surpasses MS Dhoni , Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డు - ధోనీ, రోహిత్ లను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి!
ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డు - ధోనీ, రోహిత్ లను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి!
MS Dhoni Skips LSG Match: LSG మ్యాచ్‌కు దూరంగా ఎంఎస్ ధోనీ- సీఎస్కే అభిమానులకు నిరాశ తప్పదా?
LSG vs CSK మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడతాడా? బిగ్ అప్డేట్ గురించి తెలుసా?
Kagiso Rabada Equals Historic IPL Powerplay Record: పవర్‌ప్లేలో నయా రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ కగిసో రబాడ
పవర్‌ప్లేలో నయా రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ కగిసో రబాడ
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
Uttar Pradesh Storm: రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
Spy Thrillers OTT : న్యూక్లియర్ వెపన్... ఇండియన్ ఏజెంట్స్ సీక్రెట్ ఆపరేషన్ - ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్
న్యూక్లియర్ వెపన్... ఇండియన్ ఏజెంట్స్ సీక్రెట్ ఆపరేషన్ - ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్
Breaking News: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌!
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌!
Memu Coplam OTT : విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Mamata Banerjee: సీఎం పదవి పోగానే లాయర్ అయిన మమతా బెనర్జీ - చట్టానికి, న్యాయానికి జరిగిన సమరంలో..
సీఎం పదవి పోగానే లాయర్ అయిన మమతా బెనర్జీ - చట్టానికి, న్యాయానికి జరిగిన సమరంలో..
Honda City Facelift Spied: హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు
Suriya Hit Movies On OTT: సూర్య టాప్ 10 హిట్ సినిమాలు... ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ & స్ట్రీమింగ్ డీటెయిల్స్
సూర్య టాప్ 10 హిట్ సినిమాలు... ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ & స్ట్రీమింగ్ డీటెయిల్స్
Embed widget