అన్వేషించండి

Rohit Sharma News: టెలివిజన్ రంగంలోకి 'హిట్‌మ్యాన్' ఎంట్రీ.. రోహిత్ శర్మ టీజర్ వైరల్! కొత్త అవతారంలో టీమిండియా స్టార్

భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టీవీ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ విడుదల చేసిన ప్రోమో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

Rohit Sharma Set for Television Debut: ఇండియ‌న్ క్రికెట్ దిగ్గజం, సిక్సర్ల మెషిన్ రోహిత్ శర్మ ఇప్పుడు సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. కేవలం క్రికెట్ పిచ్‌కే పరిమితం కాకుండా టెలివిజన్ ప్రపంచంలోకి తన అరంగేట్రం ఖరారు చేశాడు. దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టీజర్‌ను సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ (Sony TV) రిలీజ్ చేసింది. ఈ టీజర్ చూస్తుంటే రోహిత్ ఒక స్పెషల్ షోతో రాబోతున్నట్లు అర్థమవుతోంది. త్వరలోనే ఈ షో టైటిల్, కాన్సెప్ట్ గురించి మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rohit Sharma (@rohitsharma45)

ఐపీఎల్ లో రోహిత్ జోరు..
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (MI) తరపున రోహిత్ శర్మ తన క్లాస్ చూపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనే 55.25 సగటుతో 221 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 174.01 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ పాత రోహిత్ ను గుర్తు చేస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా 7,267 పరుగులతో రికార్డుల్లో ఉన్నాడు. కెప్టెన్‌గా ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన ఘనత కూడా అతనికే సొంతం.

రికార్డుల రారాజు..
2007లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన రోహిత్, మూడు ఫార్మాట్లలో తిరుగులేని ప్లేయర్ గా ఎదిగాడు. ఓవరాల్ గా 508 మ్యాచ్‌ల్లో 20,109 పరుగులు సాధించాడు. ఇందులో 50 సెంచరీలు, 111 అర్థసెంచరీలు ఉన్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలను కెప్టెన్ గా, ప్లేయర్ గా గెలిచిన అరుదైన రికార్డు రోహిత్ ఖాతాలో ఉంది. టీ20 ఇంటర్నేషనల్స్ లో 4,231 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన రోహిత్, 2024 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

వన్డే వరల్డ్ కప్ పై కన్ను..
ప్రస్తుతం రోహిత్ ఫోకస్ అంతా 2027లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే వేదికలుగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ మీద ఉంది. ఇందుకోసం అతను తన ఫిట్‌నెస్ ను భారీగా మెరుగుపరుచుకున్నాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడు రోహిత్. 264 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. టెస్టుల్లో కూడా 40కి పైగా సగటుతో 4,301 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు.

మీమ్ మెటీరియల్ టు టీవీ స్టార్..
రోహిత్ కేవలం బ్యాటింగ్ తోనే కాదు, మైదానంలో తన హావభావాలు, స్టుంప్ మైక్ లో రికార్డ్ అయ్యే సరదా మాటలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాడు. అతని కామెడీ టైమింగ్, సెటైర్లు నెటిజన్లకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి. బహుశా ఇదే క్వాలిటీ అతన్ని ఇప్పుడు టీవీ షో వైపు నడిపించి ఉండొచ్చు. క్రికెట్ పిచ్ పై ప్రత్యర్థులను వణికించే హిట్‌మ్యాన్, ఇప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget