Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డ్.. ఐపీఎల్ చరిత్రలో ఆ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా సరికొత్త చరిత్ర!
ఆర్సీబీ స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్న తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

Bhuvneshwar Kumar Becomes First Pacer to Reach 200 IPL Matches: ఐపీఎల్ అంటేనే రికార్డుల అడ్డా. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన కెరీర్‌లో ఒక మెమరబుల్ మైలురాయిని చేరుకున్నాడు. గురువారం లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరిగిన మ్యాచ్‌లో భువీ బరిలోకి దిగడమే ఒక రికార్డుగా మారింది. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఏ ఫాస్ట్ బౌలర్ కూడా 200 మ్యాచ్‌లు ఆడలేదు. ఆ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ పేసర్‌గా భువనేశ్వర్ నిలిచాడు. అంతేకాదు, ఐపీఎల్ లో 200 పైగా వికెట్లు తీసిన ఏకైక ఫాస్ట్ బౌలర్ కూడా అతనే కావడం విశేషం.
2️⃣0️⃣0️⃣* #TATAIPL games. 🥹
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 7, 2026
2️⃣1️⃣5️⃣* #TATAIPL wickets. 🤌
No pacer has ever breached the 200-game and wickets mark in the league before.... Bhuvi just did tonight. 🤌
We're glad to witness your magic in Red, Blue, and Gold, 𝐒𝐖𝐈𝐍𝐆 𝐊𝐈𝐍𝐆. ❤️ pic.twitter.com/gcAfALeuck
ఎమోషనల్ అయిన స్వింగ్ కింగ్..
ఈ అరుదైన రికార్డుపై భువనేశ్వర్ కుమార్ స్పందిస్తూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఏ మైలురాయి అయినా స్పెషలే అని, కానీ 200 మ్యాచ్‌లు ఆడటం అనేది నిజంగా ఒక బిగ్ అచీవ్‌మెంట్ అని ఆనందం వ్యక్తం చేశాడు. అందుకే చాలా గర్వంగా, హ్యాపీగా ఉందని, ముఖ్యంగా గతేడాది కప్పు గెలిచిన జట్టులో ఉంటూ, ఈ సీజన్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్న సమయంలో ఈ రికార్డ్ రావడం ఇంకాస్త స్పెషల్ ఫీలింగ్ ఇస్తోందని పేర్కొన్నాడు. తన కెరీర్‌లో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. వాటన్నిటిలో ఒకదాన్ని ఎంచుకోవడం కష్టమే కానీ, ఇన్నేళ్ల ప్రయాణంలో తన తొలి వికెట్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపాడు. అక్కడి నుండే ఈ జర్నీ మొదలైందని భువీ తన మనసులోని మాటను చెప్పాడు.
మారుతున్న ఆట తీరు - భువీ ప్లాన్:
ప్రస్తుత కాలంలో టీ20 ఫార్మాట్ చాలా వేగంగా మారిపోతోంది. ముఖ్యంగా పవర్‌ప్లేలో బ్యాటర్లు విరుచుకుపడుతున్నారు. దీనిపై భువనేశ్వర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బ్యాటర్ల అప్రోచ్ పూర్తిగా మారిపోయిందని, పవర్‌ప్లేలో వాళ్ళు చాలా అగ్రెసివ్‌గా ఆడుతున్నారని విశ్లేషించాడు. ఇలాంటి కండిషన్స్‌లో బౌలర్లు నిరంతరం తమ గేమ్ ను ఇంప్రూవ్ చేసుకోవడం ఒక పెద్ద ఛాలెంజ్ అని, కానీ తాను మాత్రం ఎప్పుడూ తన బేసిక్స్‌ను బలంగా ఉంచుకోవడానికే ట్రై చేస్తానని, అదే తనను ఇన్ని ఏళ్లుగా సక్సెస్ ఫుల్‌గా ముందుకు నడిపిస్తోందని వివరించాడు.
లక్నో భారీ స్కోరు..
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే భువనేశ్వర్ ఈ మ్యాచ్‌లో వికెట్ తీయలేక పోయాడు. నాలుగు ఓవర్లలో 34 పరుగులు ఇచ్చాడు. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఇంజూరీ సమస్యలతో సతమతమవుతోంది. జోష్ ఇంగ్లిస్, మొహ్సిన్ ఖాన్, ఆవేష్ ఖాన్ వంటి కీలక ప్లేయర్లు ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అర్షిన్ కులకర్ణి, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్ టీమ్ లోకి వచ్చారు.
భారత క్రికెట్ లో భువనేశ్వర్ కుమార్ ఒక సైలెంట్ వారియర్ లాంటివాడని, ఎన్ని కొత్త టెక్నాలజీలు వచ్చినా, ఎంతమంది కొత్త బౌలర్లు వచ్చినా భువీ తన స్వింగ్ తో బ్యాటర్లను వణికించగలడని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. 200 మ్యాచ్‌ల ఈ మైలురాయి అతని హార్డ్ వర్క్ కు నిదర్శనమని గుర్తు చేస్తున్నారు.
Before You Go
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
ట్రెండింగ్ వార్తలు



















