అన్వేషించండి

Rohit Sharma Record: విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హిట్ మ్యాన్.. త్వరలో ధోనీని వెనక్కి నెట్టే చాన్స్ 

ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ 84 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి లక్నోపై జట్టును గెలిపించాడు. ఇదే మ్యాచ్‌లో కోహ్లీని వెనక్కి నెట్టి రోహిత్ సరికొత్త ఐపీఎల్ మైలురాయిని అందుకున్నాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో లక్నోపై ముంబై విజయం సాధించింది.
  • ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడినవారిలో రోహిత్ రెండో స్థానంలో నిలిచాడు.
  • ధోనీ 2011 సిక్సర్‌తో ప్రేరణ పొంది క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు.
  • 21 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభించి, రఘు శర్మ కష్టపడి ఎదిగాడు.

Rohit Sharma Brutal Knock Vs LSG: ఐపీఎల్ (IPL 2026)లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన క్లాస్ పవర్ ఏంటో చూపించాడు. గత కొన్ని మ్యాచులకు దూరంగా ఉన్న హిట్ మ్యాన్.. ప్లేయింగ్ ఎలెవన్ లోకి తిరిగి వచ్చిన వెంటనే విధ్వంసం సృష్టించాడు. అతని మెరుపు బ్యాటింగ్ ధాటికి లక్నో నిర్దేశించిన భారీ లక్ష్యం ముంబై ముందు చిన్నబోయింది.

రోహిత్ శర్మ చారిత్రాత్మక రికార్డ్..
ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు బ్యాటింగ్‌లోనే కాకుండా ఒక ప్లేయర్‌గా కూడా చాలా స్పెషల్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ (276 మ్యాచులు)ని అధిగమించి, 277వ మ్యాచ్‌తో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం ఎంఎస్ ధోనీ 278 మ్యాచులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ ఈ సీజన్‌లో ఇంకా బరిలోకి దిగకపోవడంతో రోహిత్, కోహ్లీ ఇద్దరూ త్వరలోనే అతన్ని దాటే అవకాశం ఉంది.

 

ధోనినే ఇన్సిపిరేష‌న్..
ముంబై ఇండియన్స్ స్పిన్నర్ రఘు శర్మ ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షత్ రఘువంశీని అవుట్ చేసిన తర్వాత అతను చూపించిన ఎమోషనల్ నోట్ అందరినీ ఆకట్టుకుంది. ఆ సెలబ్రేషన్ వెనుక ఉన్న అసలు కారణాన్ని, తన కష్టతరమైన జర్నీని రఘు శర్మ తాజాగా వివరించాడు. తన లైఫ్ మారడానికి ఎంఎస్ ధోనీనే కారణమని అతను చెప్పుకొచ్చాడు.

Also Read: MI ప్లేయర్ రఘు శర్మ ఎమోషనల్ సెలబ్రేషన్.. వికెట్ తీశాక జేబులోంచి నోట్ తీసి ఏం చూపించాడంటే! LSGతో మ్యాచ్‌లో మిస్టరీ నోట్ వైరల్

ధోనీ సిక్సర్ - ఒక టర్నింగ్ పాయింట్..
"ఇదంతా 2011 సమయంలో మొదలైంది. మా ఇంట్లో అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు ఉండటంతో నేను కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. కానీ అప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడిని. సుమారు 102 కిలోల బరువు ఉండేవాడిని. 2011 వరల్డ్ కప్ ఫైనల్ లో శ్రీలంకపై ధోనీ కొట్టిన ఆ విన్నింగ్ సిక్సర్ చూశాక నాకు క్రికెట్ పై విపరీతమైన ఆసక్తి కలిగింది. ఆ ఒక్క షాట్ నా ఆలోచనలను మార్చేసింది" అని రఘు తెలిపాడు.

తండ్రి హెచ్చరికలు - 21 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభం..
తను క్రికెట్ ఆడతానన్నప్పుడు తండ్రి కూడా సపోర్ట్ చేయలేదని రఘు గుర్తు చేసుకున్నాడు. "నువ్వు చాలా లావుగా ఉన్నావు, క్రికెట్ లో చాలా పరిగెత్తాల్సి ఉంటుంది, ఇది నీవల్ల కాదు అని మా నాన్న చెప్పారు. నేను క్రికెట్ నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు నా వయస్సు 21 ఏళ్లు. అప్పటికే ఏజ్ గ్రూప్ క్రికెట్ ఆడే అవకాశాలన్నీ అయిపోయాయి. కానీ నా లక్ష్యంపై నాకు గురి ఉంది. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాను" అని రఘు ఎమోషనల్ అయ్యాడు.

Also Read: ముంబై రికార్డు ఛేజింగ్.. LSGపై ఘ‌న‌విజ‌యం, స‌త్తా చాటిన రోహిత్, రికెల్ట‌న్

రోజుకు 10 ఓవర్ల ప్రాక్టీస్..
లెగ్ స్పిన్ బౌలింగ్ లో పట్టు సాధించడానికి రఘు శర్మ ఎంతో కష్టపడ్డాడు. వారంలో ఆరు రోజులు కేవలం బౌలింగ్ పైనే ఫోకస్ పెట్టేవాడు. ఇప్పటికీ అతను ప్రతిరోజూ కనీసం 10 ఓవర్ల పాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. నిరంతరం బౌలింగ్ చేయడం వల్లే మణికట్టు (Wrist) సహజంగా పని చేయడం మొదలవుతుందని అతను నమ్ముతాడు. ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్ నుంచి కష్టపడే క్రికెటర్ గా మారడం వెనుక రఘు పడ్డ శ్రమ సామాన్యమైనది కాదు.

ముంబై ఇండియన్స్ తో ప్రయాణం..
ముంబై ఇండియన్స్ టీమ్ రఘు శర్మను 2025లో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ ఏడాది అతను కేవలం నెట్ బౌలర్‌గా మాత్రమే సేవలు అందించాడు. విఘ్నేష్ పుత్తూర్ గాయపడటంతో రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా మెయిన్ టీమ్ లోకి వచ్చాడు. 2025లో ఒక్క మ్యాచ్ ఆడే ఛాన్స్ రాకపోయినా, మేనేజ్మెంట్ అతనిపై నమ్మకంతో రిటైన్ చేసుకుంది. చివరకు 2026లో చెన్నై సూపర్ కింగ్స్ పై రఘు తన ఐపీఎల్ డెబ్యూ చేశాడు. రఘు శర్మ స్టోరీ చూస్తుంటే ఏ వయసులోనైనా కష్టపడితే అనుకున్నది సాధించవచ్చు అని అర్థమవుతోంది. 

Frequently Asked Questions

లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ ఎలాంటి ప్రదర్శన చేశాడు?

రోహిత్ శర్మ మెరుపు బ్యాటింగ్ తో లక్నో నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ సునాయాసంగా ఛేదించింది. అతను తిరిగి ప్లేయింగ్ ఎలెవన్ లోకి వచ్చిన వెంటనే విధ్వంసం సృష్టించాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ స్థానం ఏమిటి?

రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. అతను 277వ మ్యాచ్ ఆడాడు, విరాట్ కోహ్లీని అధిగమించాడు.

రఘు శర్మ తన క్రికెట్ కెరీర్ కు ఎంఎస్ ధోని ఎలా ప్రేరణ అయ్యాడు?

2011 వరల్డ్ కప్ ఫైనల్ లో ధోని కొట్టిన విన్నింగ్ సిక్సర్ ను చూసిన తర్వాత రఘు శర్మకు క్రికెట్ పై ఆసక్తి పెరిగింది. ఆ షాట్ అతని ఆలోచనలను మార్చేసింది.

రఘు శర్మ తన క్రికెట్ కెరీర్ ను ఎంత వయసులో ప్రారంభించాడు?

రఘు శర్మ 21 ఏళ్ల వయసులో క్రికెట్ నేర్చుకోవడం ప్రారంభించాడు. అప్పటికి ఏజ్ గ్రూప్ క్రికెట్ అవకాశాలు ముగిసినా, లక్ష్యంపై గురితో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
Embed widget