ధోనీ వయసు దృష్ట్యా, జట్టు వ్యూహంలో భాగంగా అతన్ని ఆలస్యంగా బ్యాటింగ్‌కు పంపాలని యోచిస్తున్నారు. గత సీజన్‌లో బ్యాటింగ్ ఆర్డర్ విఫలమైనప్పుడు మాత్రమే అతను ముందుగా బ్యాటింగ్ చేశాడు.
MS Dhoni: ఇంపాక్ట్ ప్లేయర్ గా చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనీ.. అశ్విన్ క్లారిటీ..
MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఈ సీజన్‌లో ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు, ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే అంశంపై అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు.

- ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ పై విశ్లేషకుల భిన్న అభిప్రాయాలు.
- కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు ధోనీ అనుభవం ఎంతో కీలకం.
- ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్ గా కాకుండా పూర్తి స్థాయిలో ఆడించాలన్నారు.
- 44 ఏళ్ల వయసులోనూ ధోనీ ఆటపైనే దృష్టి సారించారు.
MS Dhoni: భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ క్రౌడ్ పుల్లర్ ఎంఎస్ ధోనీ గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే. తన ప్రజెన్సే ఆడియెన్స్ ను మైమరింపచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గత సీజన్ నుంచి ధోనీ నుంచి బ్యాటింగ్ మెరుపులు ఆశించిన వాళ్లకు కాస్త నిరాశే ఎదురైంది. తను చివర్లో బ్యాటింగ్ కు రావడం చాలామంది అభిమానులకు మింగుడుపడలేదు. ఒక్కోసారి ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో కూడా బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే తన వయసు రిత్యా బ్యాటింగ్ లో లేట్ గా బరిలోకి దింపాలని జట్టు వ్యూహంగా తెలుస్తోంది. అయితే గతేడాది బ్యాటింగ్ ఆర్డర్ విఫలం కావడం వల్ల చాలా ఎర్లీగానే తను బ్యాటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సీజన్ లో తనను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించాలనే ఆలోచనను కొట్టి పారేస్తున్నారు విశ్లేషకులు.
ఎంతో కీలకం..
ఐపీఎల్లో ఐదు కప్పులు సాధించి దిగ్గజ కెప్టెన్ గా ధోనీ నిలిచాడు. ముంబై ఇండియన్స్ దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ తప్పించి ఈ ఘనతను మరెవరు సాధించలేదు. ఇక బ్యాటింగ్ లో చివర్లో కామియోలు ఆడటంతోపాటు పూర్తి స్థాయిలో ధోనీ మైదానంలో కీపింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను గైడ్ చేయడంలో ధోనీ అనుభవం చాలా అక్కరకు వస్తుందని, అలాగే కొత్త బౌలర్లను ట్రెయిన్ చేయడంలో ధోనీది అందె వేసిన చేయి కావడంతో తన ఎక్స్ పీరియన్స్ చాలా ఉపకరిస్తుందని దిగ్గజ ఆల్ రౌండర్ అశ్విన్ అంటున్నాడు. మైదానంలో 20 ఓవర్లపాటు ధోనీ అందుబాటులో ఉంటే, అది ఫీల్డింగ్ కెప్టెన్ కు ఎంతో లాభమని చెప్పుకొచ్చాడు. జట్టును అద్భుతంగా నడపగలడని, కెప్టెన్ కు విలువైన సలహాలు ఇవ్వగలడని తను తెలిపాడు.
అలా అయితే అక్కర్లేదు..
ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించాలనే ఆలోచనను పక్కన పెట్టాలని అశ్విన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. మైదానంలో తను ఉండటం ఎంతో ముఖ్యమని తెలిపాడు. గతేడాది సీఎస్కే తరపునే అశ్విన్ ఆడాడు. జట్టుతోపాటు ధోనీ ఉంటే అది వెయ్యి ఎనుగుల బలంలాంటిదని చెప్పుకొచ్చాడు. ఇక ధోనీలాంటి ప్లేయర్ పూర్తి స్థాయిలో ఫిట్ గా ఉంటేనే ఆడతారని, లేకపోతే బరిలోకి దిగరని చెప్పుకొచ్చాడు. మరోవైపు 44 ఏళ్ల వయసులో ఇంకా ఐపీఎల్ ఆడుతున్న ధోనీపై విమర్శలు వస్తున్నప్పటికీ, వాటిని తను ఖాతరు చేయడం లేదు. తన ఫోకస్ అంతా ఆటపైనే ఉందని, ఈ సీజన్ కు తను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక ఈనెల 30న గువాహటిలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో చెన్నై తమ తొలి మ్యాచ్ ను ఆడనుంది.
Frequently Asked Questions
ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ లో ఎందుకు ఆలస్యంగా వస్తాడు?
కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ధోనీ ఎలా సహాయం చేస్తాడు?
ధోనీ అనుభవం కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుంది. అలాగే, కొత్త బౌలర్లను తీర్చిదిద్దడంలో అతని అనుభవం కూడా జట్టుకు ఉపయోగపడుతుంది.
ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలనే ఆలోచనపై అశ్విన్ ఏమన్నాడు?
ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలనే ఆలోచనను పక్కన పెట్టాలని అశ్విన్ గట్టిగా చెప్పాడు. మైదానంలో ధోనీ ఉండటం జట్టుకు చాలా ముఖ్యం అని, అది వెయ్యి ఏనుగుల బలంతో సమానం అని అతను పేర్కొన్నాడు.
ట్రెండింగ్ వార్తలు



















