అన్వేషించండి
Advertisement
IPL 2024: ప్లే ఆఫ్ రేసులో పైచేయి ఎవరిదో ?
IPL 2024, LSG vs KKR: ప్లే ఆఫ్‌లో స్థానం దక్కించుకునేందుకు అడుగు దూరంలో ఉన్న కోల్‌కత్తా.. ప్లే ఆఫ్ చేరాలనే పట్టుదలతో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ కీలక మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి.
LSG vs KKR IPL 2024 Preview and Prediction : ఐపీఎల్(IPL)లో ప్లే ఆఫ్ దిశగా సాగుతున్న రెండు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ప్లే ఆఫ్‌లో స్థానం దక్కించుకునేందుకు అడుగు దూరంలో ఉన్న కోల్‌కత్తా(KKR).. ప్లే ఆఫ్ చేరాలనే పట్టుదలతో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్(LSG) కీలక మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. కానీ వరుస విజయాలతో దూకుడు మీదున్న కోల్‌కత్తాను లక్నో సూపర్ జెయింట్స్ ఎంతవరకూ అడ్డుకోగలదు అన్నదే ఆసక్తికరంగా మారింది. ఇదే సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో లక్నోపై కోల్‌కత్తా సునాయసంగా ఘన విజయం సాధించింది. ఇప్పుడు కోల్‌కత్తాపై గెలవాలంటే లక్నో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 24 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోల్‌కత్తా... ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్‌లో అడుగు పెట్టాలని చూస్తోంది. శ్రేయస్ అయ్యర్ జట్టు విసిరే సవాల్‌ను KL రాహుల్ సారథ్యంలోని లక్నో ఎంతవరకూ ఎదుర్కోగలదు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
లక్నో జట్టు ఇలా...
లక్నో జట్టులో కెప్టెన్ రాహుల్, ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్‌పై చాలా భారం ఉంది. గత మ్యాచ్‌లో ఆడని దక్షిణాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డి కాక్‌ని తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. నికోలస్ పూరన్ కూడా నిలకడగా ఆడుతున్నా భారీ స్కోర్లు చేయలేక పోతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని కూడా లక్నో చివరి ఓవర్‌లో ఛేదించింది. బ్యాటింగ్ సమస్యలకు చెక్ పెట్టి ప్లే ఆఫ్ అవకాశాలు పెంచుకోవాలని రాహుల్ సేన చూస్తోంది. ఆయుష్ బదోనికి మరో అవకాశం ఇస్తారేమో చూడాలి. పేసర్ మయాంక్ యాదవ్ లేకుండానే లక్నో బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో కేవలం మూడింటిలో మాత్రమే ఓడిపోవడంతో, కోల్‌కత్తాపై గెలుపు లక్నోకు కష్టమే అని మాజీలు విశ్లేషిస్తున్నారు.
కోల్‌కత్తా ఇలా..
గత మ్యాచ్‌లో తక్కువ స్కోరు చేసినా ముంబైపై గెలవడం కోల్‌కత్తా ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. కానీ కోల్‌కత్తాపై పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించినప్పుడు కోల్‌కత్తా బౌలింగ్ సమస్యలు బహిర్గతమయ్యాయి. అయ్యర్ జట్టు రెండు అద్భుతమైన విజయాలతో ఆ ఎదురుదెబ్బ నుంచి బలంగా బయటపడింది. ఏది ఏమైనా బౌలింగ్ బలహీనతలను కోల్‌కత్తా అధిగమించాల్సి ఉంది. నెమ్మదైన పిచ్‌లపై కోల్‌కత్తా బ్యాటర్లు తేలిపోతున్నారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌క్తతా ఒక దశలో 5 వికెట్ల నష్టానికి 57 పరుగులే చేసింది. కానీ వెంకటేష్ అయ్యర్ (70), మనీష్ పాండే (42) రాణించడంతో ఓ మోస్తరు స్కోరు చేసింది.
జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, షమర్ జోసెఫ్, యశ్ ఠాకూర్, మణిమారన్ సిద్ధార్థ్, ప్రేరాక్ మన్కడ్, అర్షద్ ఖాన్, కృష్ణప్ప గౌతం, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, నవీన్-ఉల్-హక్, దేవదత్ పడిక్కల్, యుధ్వీర్ సింగ్ చరక్, మయాంక్ యాదవ్, అర్షిన్ కులకర్ణి.
కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), KS భరత్ , రహ్మానుల్లా గుర్బాజ్ , రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ సింగ్, వరుణ్‌దీప్, రమణదీప్, చక్రవర్తి, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్, గుస్ అట్కిన్సన్, అల్లా గజన్‌ఫర్, ఫిల్ సాల్ట్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement