IPL 2025 Qualifier 1 Race: తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడే అవకాశం ఎవరెవరికి ఉంది?
IPL 2025 Qualifier 1 Race: తొలి క్వాలిఫయర్‌కు అర్హత సాధించిన జట్లకు రెండో ఛాన్స్ ఉంటుంది. అందుకే దీని కోసం నాలుగు జట్లు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి.

IPL 2025 Qualifier 1 Race: లీగ్ దశ ముగింపు దశకు చేరుకుంటుండటంతో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో టాప్-టూ ఫినిషింగ్ కోసం టీంలు పోటీ పడుతున్నాయి. టాప్‌లో టూలో చోటు దక్కించుకున్న జట్లకు రెండు అవకాశాలు లభిస్తాయి. అందుకే టాప్‌లో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఇప్పుడు క్వాలిఫయర్ కోసం నాలుగు జట్లు ఎంపికయ్యాయి. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు అర్హత సాధించాయి. మరి ఈ జట్లలో టాప్ టూలో ఎవరు ఉంటారనే ప్రశ్న ఆసక్తిగా మారింది. ఇప్పుడు క్వాలిఫయర్ 1 రేసులో కొనసాగడానికి ప్రతి జట్టు ఏమి చేయాలో చూద్దాం.
ముంబై ఇండియన్స్ (MI): ప్రస్తుతం ఈ జట్టు నాల్గో స్థానంలో ఉంది. MIకి PBKSతో ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే 18 పాయింట్లకు చేరుకుంటుంది. అయితే ఈ జట్టు టాప్‌లో ఉండాలి అంటే మాత్రం మిగతా జట్ల విజయాలపై ఆధారపడి ఉంటుంది. RCB, PBKS రెండు జట్లు కూడా మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే ముంబై జట్టు టాప్‌లో ఉంటుంది.
గుజరాత్ టైటాన్స్ (GT): LSGతో GT ఇటీవల ఓడిపోవడంతో వారికి పెద్ద షాక్ తగిలింది. ప్రస్తుతానికి టాప్‌లో ఉన్నప్పటికీ ఆ మ్యాచ్ ఓటమి టాప్-టూ ఆశలు దెబ్బతీసింది. వారికి ఇప్పుడు CSKతో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అందులో కచ్చితంగా విజయం సాధిస్తేనే టాప్ టూలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ అది మాత్రమే సరిపోదు. ఈ జట్టు కూడ RCB, PBKS రెండూ మిగిలిన మ్యాచ్‌లలో ఓడిపోవాల్సి ఉంటుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): RCB జట్టు ఇప్పటికీ టాప్ 2లో ఉంది. ఇంకా ఈ టీం SRH , LSG జట్లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే టాప్ టూలోకి వెళ్లే అవకాశం ఉంది. వారి నెట్ రన్ రేట్ (NRR) చాలా కీలకంకానుంది.
పంజాబ్ కింగ్స్ (PBKS): PBKS జట్టు కూడా మూడో స్థానంలో ఉంది. అందుకే జరగబోయే రెండు మ్యాచ్‌లలో కచ్చితంగా విజయం సాధించాలి. DC, MIతో జరిగే మ్యాచ్‌లు గెలవడమే కాకుండా NRRలో RCBని అధిగమించాలి.
IPL 2025 ప్లేఆఫ్‌ల షెడ్యూల్, వేదికలను BCCI అధికారికంగా ప్రకటించింది. న్యూ చండీగఢ్, అహ్మదాబాద్ వేదికల్లో నాలుగు నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి.
IPL 2025 ప్లేఆఫ్స్ షెడ్యూల్
క్వాలిఫయర్ 1 (లీగ్ దశలో మొదటి రెండు జట్ల మధ్య మ్యాచ్): గురువారం, మే 29, 2025 - కొత్త PCA స్టేడియం, న్యూ చండీగఢ్
ఎలిమినేటర్ (3వ vs 4వ స్థానంలో ఉన్న జట్లు) - శుక్రవారం, మే 30, 2025 - కొత్త PCA స్టేడియం, న్యూ చండీగఢ్
క్వాలిఫయర్ 2 (క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టు vs ఎలిమినేటర్ విజేత)- ఆదివారం, జూన్ 1, 2025 - నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
ఫైనల్ (క్వాలిఫయర్ 1 విజేత vs క్వాలిఫయర్ 2 విజేత) - మంగళవారం, జూన్ 3, 2025 - నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్




















