అన్వేషించండి

IPL 2025 Prize Money: ఐపీఎల్ 2025 విజేతకు ప్రైజ్‌మనీ ఎంత వస్తుంది? 

IPL 2025 Prize Money: ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే ఐపీఎల్ 2025 విన్నర్ దాదాపు ఇరవై కోట్ల వరకు ప్రైజ్‌మనీ తీసుకెళ్లే అవకాశం ఉంది.  

IPL 2025 Prize Money: ఐపీఎల్‌2025 కీలక దశకు చేరుకుంది. ప్లైఆఫ్‌ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే నాలుగు టీంలు ప్లైఆఫ్‌కు చేరుకున్నాయి.  గుజరాత్ టైటాన్, రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తమ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. 

ఈ ఐపీఎల్ ఫైనల్ పోటీ జూన్ 3న జరగనుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఆఖరి పోరులో గెలిచే టీం భారీగానే ప్రైజ్‌మనీ తీసుకెళ్లబోతోంది. గతంలో ఇచ్చిన ప్రైజ్‌మనీ ఆధారంగా లెక్కలు వేసుకుంటే మాత్రం 20 కోట్లకుపైగానే విజేతకు దక్కే అవకాశం ఉంది. అదే టైంలో రన్నర్‌కు దాదాపు పదమూడు కోట్ల రూపాయలు రానున్నాయి. ఇది 2022 నుంచి ఇస్తున్నది. ఇప్పటి వరకు దీన్ని మారుస్తున్నట్టు ఐపీఎల్ నిర్వాహకులు ఎక్కడా ప్రకటించలేదు. 

గత ఏడాది కూడా విన్నర్, రన్నర్‌కు ఇదే ప్రైజ్‌మనీ ఇచ్చారు. IPL 2024 విజేత కేకేఆర్‌కు 20 కోట్ల రూపాయలు దక్కింది. రన్నర్‌గా ఉన్న హైదరాబాద్ టీంకు 13 కోట్లు వచ్చింది.  

IPL ప్రైజ్‌మనీ ఎప్పుడు ఎంత ఇచ్చారంటే! 
2008–2009: ఐపీఎల్ విజేతకు రూ. 4.8 కోట్లు | రన్నరప్‌కు రూ. 2.4 కోట్లు

2010–2013: ఐపీఎల్‌ విజేతకు రూ. 10 కోట్లు | రన్నరప్ - రూ. 5 కోట్లు

2014–2015: ఐపీఎల్ విజేతకు రూ. 15 కోట్లు | రన్నరప్ - రూ. 10 కోట్లు

2016: ఐపీఎల్ విజేత రూ. 16 కోట్లు | రన్నరప్ రూ. 10 కోట్లు

2017: ఐపీఎల్ విజేతకు రూ. 15 కోట్లు | రన్నరప్ రూ. 10 కోట్లు

2018–2019: ఐపీఎల్ విజేతకు రూ. 20 కోట్లు | రన్నరప్ - రూ. 12.5 కోట్లు

2020 (కరోనా సంవత్సరం): ఐపీఎల్ విజేతకు రూ. 10 కోట్లు | రన్నరప్ రూ. 12.2 కోట్లు

IPL 2025 ప్లేఆఫ్స్ షెడ్యూల్

క్వాలిఫయర్ 1 (లీగ్ దశలో మొదటి రెండు జట్ల మధ్య మ్యాచ్): గురువారం, మే 29, 2025 - చండీగఢ్

ఎలిమినేటర్ (3వ vs 4వ స్థానంలో ఉన్న జట్లు) - శుక్రవారం, మే 30, 2025 -  చండీగఢ్

క్వాలిఫయర్ 2 (క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టు vs ఎలిమినేటర్ విజేత)- ఆదివారం, జూన్ 1, 2025 - అహ్మదాబాద్

ఫైనల్ (క్వాలిఫయర్ 1 విజేత vs క్వాలిఫయర్ 2 విజేత) - మంగళవారం, జూన్ 3, 2025 - అహ్మదాబాద్

ప్లేఆఫ్ ఫార్మాట్ ప్రకారం మొదటి రెండు జట్లు క్వాలిఫయర్ 1లో ఒకదానితో ఒకటి తలపడతాయి. అయితే మూడో  నాల్గో స్థానంలో ఉన్న జట్లు ఎలిమినేటర్‌లో తలపడతాయి.

లీగ్ దశ చివరిలో పాయింట్ల పట్టికలో మొదటి రెండు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో స్థానం సంపాదించుకుంటుంది.

3వ, 4వ స్థానంలో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో తలపడతాయి. ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది.

క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టుకు రెండో అవకాశం లభిస్తుంది. ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫైయర్ 2లో తలపడుతుంది.

క్వాలిఫైయర్ 2 విజేత ఫైనల్‌కు చేరుకుంటుంది. క్వాలిఫైయర్ 1 విజేతతో ఢీ కొడతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Embed widget