Mumbai Indians Playoffs IPL 2025 | ముంబై ఎంట్రీ ఇచ్చిందంటే అపోజిషన్ల పొజిషన్స్ గల్లంతే
ముంబై ఇండియన్స్ కి ఐపీఎల్ లో ఎప్పుడూ ఓ సంప్రదాయం ఉంటుంది. సీజన్ ను అత్యంత బద్ధకంగా అత్యంత నిదానంగా ఆరంభిస్తుంది ముంబై ఇండియన్స్. ఈసారి కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించింది. మొదటి ఐదు మ్యాచుల్లో నాలుగు ఓడిపోయింది ముంబై. కేకేఆర్ మీద గెలుపు తప్ప ఏం లేదు. హా ఏముంది ముంబై సీన్ అయిపోయింది ఈ సారి అనుకున్నారు అంతా. కానీ తప్పు ఏ ఢిల్లీనైతే నిన్న ఓడించి ప్లే ఆఫ్స్ బెర్త్ ను కైవసం చేసుకుందో..అదే ఢిల్లీపై విజయంతో తన విన్నింగ్ స్ట్రీక్ ను ప్రారంభించింది ముంబై. ఏప్రిల్ 13న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ను గెలుచుకున్న ముంబై ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచులు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకు వచ్చింది. అసలు తమకు తిరుగే లేదన్నట్లుగా ఎదురొచ్చిన ప్రతీ టీమ్ ను కొట్టిన ముంబై తమను ఎందుకు ఛాంపియన్ జట్టు అంటారో ప్రూవ్ చేసింది. ఆరు విజయాల పరంపర తర్వాత గుజరాత్ మీద మ్యాచ్ ఓడి బ్రేక్ పడినా తిరిగి ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ ను మళ్లీ ఢిల్లీకి ఈ సీజన్ లో రెండో దమ్కీ ఇచ్చి ప్లే ఆఫ్స్ బెర్త్ ను జన్మహక్కులా లాక్కుంది. ఇప్పుడు అసలు టెన్షన్ ప్లే ఆప్స్ లో ఉన్న మిగిలిన జట్లకు. ఐరనీ ఏంటంటే ప్లే ఆఫ్స్ లో ఉన్న నాలుగు జట్లలో కేవలం ముంబైకి మాత్రమే ఒకటి కంటే ఎక్కువసార్లు కప్పు కొట్టిన హోదా ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఐదుసార్లు విజేతగా నిలిచిన ఘనమైన రికార్డు ముంబై ఇండియన్స్ ది. కానీ ప్లే ఆఫ్స్ లో మిగిలిన జట్లైన ఆర్సీబీ, పంజాబ్ అస్సలు ఒక్కసారి కప్ కొట్టలేదు. 18ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాయి. గుజరాత్ ఓసారి విజేతగా నిలిచినా ముంబై 11సార్లు ప్లే ఆఫ్స్ ఆడిన అనుభవం తో పోలిస్తే జీటీ అనుభవం చాలా తక్కువ. మరి చూడాలి గ్యాంగ్ స్టర్ ఆటతో ప్లే ఆఫ్స్ లోకి దూసుకొచ్చిన ముంబై గ్యాంగ్ స్టర్స్ ప్లే ఆఫ్స్ లో మిగిలిన జట్లను ఎలా వణికిస్తదో...ఆరో ఐపీఎల్ కప్ సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది ఏమో చూడాలి.





















