KL Rahul Comments On Dhoni: ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో "కేక్" వాక్ చేసిన రాహుల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
టీమ్‌లో బౌలర్లు అంతా యంగ్ స్టర్స్ అన్న రాహుల్ వాళ్లెప్పుడూ ఎక్స్ ట్రీమ్ ప్రెషర్ కండీషన్స్‌ను ఫేస్ చేయలేదు అన్నాడు. ధోని బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు ఈ కుర్ర బౌలర్లంతా అండర్ ప్రెషర్‌లో ఉన్నారని కామెంట్
IPL 2024: ఏప్రిల్ 18న లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బర్త్ డే. హోటల్ లో లక్నో టీమ్ మేనేజ్మెంట్ పార్టీ అరేంజ్ చేసింది. కేక్ కట్ చేసిన కేఎల్ రాహుల్‌కు అంతా బర్త్‌డే విషెస్ చెప్పారు. ఈ లోగా మిగిలిన టీమ్ మేట్స్ అంతా కలిసి కేక్ స్మాష్ చేశారు. కేఎల్ రాహుల్ మొహానికి మొదలు పెట్టి షర్ట్ విప్పేసి మరీ బాడీ అంతా పూసేశారు. తమ కెప్టెన్ ఫన్నీగా ఆటపట్టించేందుకు టీమ్స్ అంతా ఇలా రాహుల్ బర్త్ డేని సెలబ్రేట్ చేశారు.
కట్ చేస్తే నెక్ట్స్ డే చెన్నైతో మ్యాచ్. ధోని సపోర్టర్స్ ఫుల్ గా కమ్మేసిన ఎకానా స్టేడియంలో ఎల్లో జెర్సీకి సౌండ్ లేకుండా చేశాడు కెప్టెన్ రాహుల్. చెన్నై విధించిన 177పరుగుల లక్ష్యాన్ని మరో ఓపెనర్ క్వింటన్ డికాక్‌తో ఆడుతూ పాడుతూ ఛేజ్ చేసేశాడు. డికాక్ 43బాల్స్ లో 54పరుగులు చేస్తే కెప్టెన్ రాహుల్ 53 బాల్స్ లో 9ఫోర్లు 3 సిక్సర్లు బాది 82 పరుగులు చేశాడు. జడేజా అద్భుతమైన క్యాచ్ పట్టాడు కాబట్టి అవుటయ్యాడు కానీ లేదంటే విన్నింగ్ షాట్ వరకూ రాహులే ఉండేవాడు. ఆ స్థాయిలో క్రీజులో పాతుకుపోయాడు.
పనిలో పనిగా ధోని పేరు మీదున్న ఓ రికార్డును సైతం బద్ధలు కొట్టాడు రాహుల్. ఇప్పటివరకూ ధోనినే ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు కొట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ కాగా నిన్న చెన్నైపై 25వ హాఫ్ సెంచరీ కొట్టి ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు కొట్టిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా నిలిచాడు కేఎల్ రాహుల్.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గానూ నిలిచాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ సీఎస్కే మాజీ కెప్టెన్ ధోనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎకానా వికెట్‌పై 160పరుగులు చేస్తే చాలని తమ టీమ్ స్ట్రాటజీస్‌లో అనుకున్నామని చెన్నై బ్యాటర్లను ఆ స్కోరు లోపలే రిస్ట్రిక్ చేశామని 18ఓవర్ వరకూ అనుకున్నామని చెప్పాడు రాహుల్. కానీ ఎప్పుడైతే 19ఓవర్ ధోని ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి సిచ్యుయేషన్ మారిపోయిందన్నాడు.
తమ టీమ్ లో బౌలర్లు అంతా యంగ్ స్టర్స్ అన్న రాహుల్ వాళ్లెప్పుడూ ఎక్స్ ట్రీమ్ ప్రెషర్ కండీషన్స్‌ను ఫేస్ చేయలేదు అన్నాడు. ధోని బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు ఈ కుర్ర బౌలర్లంతా అండర్ ప్రెషర్‌లో ఉన్నారన్న రాహుల్. ధోని ఫినిషింగ్‌లో సిక్స్‌లు, ఫోర్లుతో విరుచుకపడిన తీరు, సపోర్ట్ చేస్తూ ఫ్యాన్స్ అరిచిన అరుపులతో తమ యంగ్ బౌలర్లు చాలా ఒత్తిడికి లోనయ్యారని చెప్పాడు.
ధోని లాంటి హ్యూజ్ ఫిగర్ అలా డామినేట్ చేస్తున్నప్పుడు అలాంటి సిచ్యుయేషన్స్‌లో ఆడటం చాలా కష్టమన్న రాహుల్..ఈ ఏజ్‌లోనూ అతను అంతలా సిక్సులు బాదటం గొప్పగా అనిపిస్తోందన్నాడు. లక్నో స్టేడియాన్ని ఎల్లో జెర్సీతో నింపేసిన అభిమానులు తాము చెపాక్‌లో ఆడుతున్నప్పుడు ఇలా సపోర్ట్ చేస్తారా అంటూ ఫన్నీ కౌంటర్లు కూడా విసిరాడు.
19వ ఓవర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన ధోని 9 బాల్స్ ఆడి 3ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కొట్టిన రెండు సిక్సుల్లో ఒకటి 101మీటర్ల భారీ సిక్సర్ కాగా మరొకటి 360డిగ్రీస్ తిరుగుతూ వికెట్ కీపర్ మీదుగా స్కూష్ షాట్ ఆడి సిక్స్ కొట్టి ఫ్యాన్స్‌ను ఎంటర్ టైన్ చేశాడు ధోని.