అన్వేషించండి
Advertisement
IPL 2024: మరో రసవత్తర పోరు - ఢిల్లీ దూకుడు, కోల్‌కత్తా ఆధిపత్యమా?
KKR vs DC, IPL 2024: పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోల్‌కత్తాతో అయిదో స్థానంలో ఉన్న ఢిల్లీ తలపడనుంది. వరుసగా 2 విజయాలతో ఆత్మ విశ్వాసంతో ఉన్న ఢిల్లీ కోల్‌కత్తా తో పోరుకు సిద్ధమైంది.
KKR vs DC IPL 2024 Preview and Prediction : ఐపీఎల్(IPL)) వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి ఆత్మ విశ్వాసంతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్(DC)... కోల్‌కత్తా నైట్ రైడర్స్(KKR)తో పోరుకు సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోల్‌కత్తాతో అయిదో స్థానంలో ఉన్న ఢిల్లీ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్‌కు చేరుకోవాలని పంత్ సేన పట్టుదలగా ఉంది. గుజరాత్, ముంబైలపై వరుస మ్యాచుల్లో విజయం సాధించిన ఢిల్లీ.. ఈ మ్యాచ్ కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. మరోవైపు ఈ సీజన్‌లోనే ఢిల్లీపై 106 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన కోల్‌కత్తా దాన్ని పునరావృతం చేసి... ప్లే ఆఫ్‌కు మరింత చేరువ కావాలని చూస్తోంది.
ఓ వైపు పంత్... మరోవైపు నరైన్
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కత్తా బౌలింగ్ సమస్యలను అధిగమించాలని చూస్తోంది. బ్యాటింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్‌లో కోల్‌కత్తా సామర్థ్యం మేరకు రాణించలేకపోతోంది. ఢిల్లీ బ్యాటర్ ఫ్రేజర్ మెక్‌గర్క్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇప్పటికే సంచలన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. బలహీనమైన కోల్‌కత్తా బౌలింగ్‌లో ఫ్రేజర్ మరింత విధ్వంసకరంగా ఆడతానడంతో సందేహం లేదు. గత అయిదు మ్యాచుల్లో ఫ్రేజర్ 237.50 స్ట్రైక్-రేట్‌తో 247 పరుగులు చేశాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనూ ఫ్రేజర్ ధాటిగా ఆడాడు. బుమ్రా వేసిన మొదటి బంతికే ఫ్రేజర్ సిక్సర్ కొట్టి తాను ఎంత ఆత్మ విశ్వాసంతో ఉన్నాడో ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు. ఫ్రేజర్ ధాటికి బుమ్రా ఒక్క ఓవర్లోనే 18 పరుగులు ఇచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లోనే విధ్వంసం ఇలా సాగితే ఇక మామూలు బౌలర్లు దొరికితే ఫ్రేజర్ ఎంత విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. మెక్‌గర్క్‌తో పాటు స్టబ్స్ కూడా తన అద్భుతమైన పవర్ హిట్టింగ్‌తో అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాడు. ముంబైపై స్టబ్స్ 25 బంతుల్లో 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, పంత్, స్టబ్స్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. పంత్ ప్రతి మ్యాచ్‌లో రాణిస్తున్నాడు. కోల్‌కత్తాలో స్పిన్నర్ సునీల్ నరైన్ మినహా మిగిలిన బౌలర్లు విఫలమవుతున్నారు.
నరైన్ నిలిస్తే..
కోల్‌కత్తా బౌలింగ్ సమస్యలను అధిగమించాలని చూస్తోంది. బ్యాట్‌తో నరైన్ సంచలనాత్మక ఫామ్‌లో ఉన్నాడు. నరైన్ ఎనిమిది మ్యాచ్‌లలో రెండు అర్ధసెంచరీలు, ఒక సెంచరీతో 357 పరుగులు చేశాడు. నరైన్-ఫిల్ సాల్ట్ జోడీ కోల్‌కత్తాకు మంచి ఆరంభాలు అందిస్తోంది. రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ దీప్ సింగ్‌లు కూడా ధాటిగా ఆడితే ఢిల్లీ బౌలర్లకు కష్టాలు తప్పవు. ప్లే-ఆఫ్ రేసులో ముందుకు సాగాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం.
కోల్‌కతా నైట్ రైడర్స్:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), కెఎస్ భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్ మరియు ముజీబ్ ఉర్ రెహమాన్.
ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, అభిషేక్ పోరెల్, రికీ భుయ్, యశ్ ధుల్, షాయ్ హోప్, పృథ్వీ షా, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, స్వస్తిక్ చికారా, ఇషాంత్ శర్మ, ఝే రిచర్డ్‌సన్, రసిఖ్ దార్ సలామ్, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నార్ట్జే, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, ఖలీల్ అహ్మద్, సుమిత్ కుమార్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నైబ్, లలిత్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
పాలిటిక్స్
రైతు దేశం
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement