IPL Auction 2024: కావ్యా పాప క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, మళ్లీ ఫిదా అయిపోయిన ఫ్యాన్స్
IPL Auction 2024 Kavya Maran: ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తళుకున్న మెరిసింది. వ్యూహాత్మకంగా ఆటగాళ్లను కొనుగోలు చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది.
Kavya Maran IPL Auction 2024: ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తళుకున్న మెరిసింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ప్లకార్డ్‌ను ప్రదర్శిస్తూ వ్యూహాత్మకంగా ఆటగాళ్లను కొనుగోలు చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటోరి, స్పిన్ కోచ్ ముత్తయ్య మురళీ ధరణ్‌తో కలిసి కావ్య మారన్ వేలంలో పాల్గొంది.
వన్డే ప్రపంచకప్ ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చాడు. అతడిని దక్కించుకునేందుకు చెన్నై, సన్‌రైజర్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు రూ.6.80 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ట్రావిస్ హెడ్ సొంతమైన అనంతరం కావ్య మారన్ చిరునవ్వులు చిందించింది. ఆమె నవ్వుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తరువాత శ్రీలంక ఆల్‌రౌండర్ వానింద్ హసరంగా వేలంలోకి వచ్చాడు. అతడి బేస్ ప్రైజ్ రూ.కోటి కాగా.. రూ.1.5 కోట్లకే సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని కొనుగోలు చేసింది.తక్కువ మొత్తానికి హసరంగ దక్కడంతో కావ్య మారన్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ నిలిచాడు. కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ను రికార్డు ధరకు కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ స్టార్క్ కోసం పోటాపోటీగా వేలంలో పాల్గొన్నాయి. చివరికి మిచెల్ స్టార్క్ కోసం రూ.24.75 కోట్లు వెచ్చించి వేలంలో స్టార్ పేసర్ ను కళ్లు చెదిరే ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది.
గతంలో రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ కొట్టిన కేకేఆర్ మరోసారి టైటిల్ నెగ్గాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో కేకేఆర్ ఫ్రాంచైజీ భారీ ధరకు ఆటగాళ్లకు సొంతం చేసుకుంది. మొదట ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి పటిష్ట జట్లు ఆసీస్ పేర్ స్టార్క్ కోసం బిడ్డింగ్ మొదలుపెట్టాయి. ఓ మోస్తరు ధర వచ్చాక గుజరాత్ టైటాన్స్ రంగంలోకి దిగింది. క్రమంలో కేకేఆర్ వేలాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీతో పోటి పడి కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధరకు ఆసీస్ పేసర్ స్టార్క్ ను తీసుకుంది.
ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆసీస్ ఆటగాళ్లకు భారీ ధర పలుకుతోంది. మినీ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడుగా పాట్ కమిన్స్ (Pat Cummins) నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తాన్ని పెట్టి కమిన్స్ ను కొనుగోలు చేసింది. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఇతని కోసం పోటీ పడ్డాయి. మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీతో పూర్తిగా మారిపోయింది. 20.50 కోట్లకు సన్ రైజర్స్ కొనుగోలు చేసిన వెంటనే మిచెల్ స్టార్క్ రేసులోకి వచ్చాడు. రికార్డు స్థాయిలో రూ.24.75 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ పేసర్ ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇరవై కోట్ల ధర దాటడం ఇదే తొలిసారి. కాగా, ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇరవై కోట్లకు పైగా ధర పలికారు.