అన్వేషించండి

Abhishek Sharma Viral Video: అభిషేక్ శర్మకు చేదు అనుభవం! చెయ్యి లాగి హద్దు మీరిన మహిళా అభిమాని

Abhishek Sharma sunrisers hyderabad | టీమ్ హోటల్‌లో ఒక మహిళా అభిమాని బలవంతంగా చేయి పట్టుకుని లాగడంతో అభిషేక్ శర్మ తీవ్ర అసహనానికి గురవ్వగా, భద్రతా లోపాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

జైపూర్: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. సన్‌రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ సెక్యూరిటీకి సంబంధించిన ఒక వింతైన ఆఫ్ ఫీల్డ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఒక వీడియోలో టీం హోటల్‌లో స్టార్ క్రికెటర్‌ను చూసిన ఒక మహిళా అభిమాని బలవంతంగా అభిషేక్ శర్మ చేయి పట్టుకుని లాగింది. ఆటగాడిని చూసిన ఉత్సాహంలో అభిమాని అలా చేసింది.

చుట్టూ భద్రతా అధికారులు ఉన్నప్పటికీ ఈ ఘటన అభిషేక్‌ను తీవ్ర అసహనానికి గురిచేసింది. అభిషేక్ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా కనిపించాడు. ఈ పరిణామం అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. చాలా మంది నెటిజన్లు ఇది భద్రతా లోపమని చెబుతున్నారు. మరోవైపు ఇదే పని ఓ మగవాడు చేసి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అభిమానంతో చేసిన చేష్టలా అనిపించినప్పటికీ, క్రికెటర్ల వ్యక్తిగత స్వేచ్ఛకు కలిగించకూడదని నెటిజన్లు అంటున్నారు. అభిమానం హద్దులు దాటితే చిక్కుల్లో పడతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఫ్యాన్ గర్ల్ అభిషేక్ చేతికి పట్టుకుని లాగిన వెంటనే పరిస్థితి మరింత ముదరక ముందే హోటల్‌లోని భద్రతా సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని అమ్మాయి చేతి నుంచి విడిపించి ఆటగాడిని అక్కడి నుండి పంపేశారు. 

మరోవైపు, జైపూర్‌ వేదికగా జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఐపీఎల్ 2026లో తన మూడవ హాఫ్ సెంచరీ చేసి ఎస్‌ఆర్‌హెచ్ (SRH), రాజస్తాన్ రాయల్స్ (RR) పై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అభిషేక్ 196 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో, 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 29 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా అభిషేక్ న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్‌ను అధిగమించి ఎస్‌ఆర్‌హెచ్ తరపున అత్యధిక పరుగులు చేసిన 3వ ఆటగాడిగా నిలిచాడు.

రాయల్స్‌పై సన్‌రైజ్ విజయం..

జైపూర్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్, వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ (103) సాయంతో 228 పరుగులు చేసింది. అనంతరం 229 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలోనే ఛేదించింది. ఇషాన్ కిషన్ (74) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది తొలి ఛేజింగ్ విజయం కాగా, మొత్తంగా ఐదో గెలుపుతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఇది టోర్నీ చరిత్రలో నాలుగో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌గా నమోదైంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget