అన్వేషించండి

IPL 2026 RCB: ఐపీఎల్ 2026కు ముందే ఛాంపియన్ ఆర్సీబీకి గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

RCB M chinnaswamy stadium | విరాట్ కోహ్లీతో పాటు RCB అభిమానులకు శుభవార్త వచ్చింది. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ లకు కర్ణాటక ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది.

IPL 2026 ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు శుభవార్త వచ్చింది. బెంగళూరులోని M. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత ఐపీఎల్ సీజన్‌లో ట్రోఫీ గెలిచిన తర్వాత RCB ఈ స్టేడియంలో విక్టరీని సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమం ఇక్కడ నిర్వహించింది. అయితే భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరగడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఈ వేదికలో మ్యాచ్‌లు నిర్వహించడంపై నిషేధం విధించారు.

ESPNcricinfo నివేదిక ప్రకారం, కొత్తగా ఎన్నికైన KSCA చీఫ్, టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ఎన్నికైన వారం రోజుల తర్వాత కర్ణాటక ప్రభుత్వం నుండి మ్యాచ్‌లు నిర్వహించడానికి అనుమతి పొందారు. దాంతో బెంగళూరు M. చిన్నస్వామి స్టేడియం BCCI రాడార్‌లోకి తిరిగి రావడానికి మార్గం సుగమం అయింది. BCCIకి కూడా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్ ప్రసాద్ తాజా పరిణామాల గురించి తెలియజేసినట్లు సమాచారం.

IPL 2026 ముందు కోహ్లీ చిన్నస్వామి స్టేడియంలో ఆడతారా?
నివేదికల ప్రకారం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2026 లో తమ సొంత మ్యాచ్‌లను M చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుందని స్పష్టంగా ఉంది. కానీ ఈ లీగ్‌కు ముందే కోహ్లీ అక్కడ ఆడటం చూడవచ్చు. ఢిల్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఇక్కడ ఆడే అవకాశం ఉంది. డొమోస్టిక్ పరంగా చూస్తే ఢిల్లీ జట్టు తరపున ఆడుతున్నందున విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నాడు. జాతీయ జట్టుకు ఆడని సమయంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆటగాళ్లకు కండీషన్ పెట్టడం తెలిసిందే.

నివేదికల ప్రకారం, భద్రతా, లాజిస్టికల్ సమస్యల కారణంగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఢిల్లీ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లను ఆలూరు నుండి మార్చాలని భావిస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌లు ఢిల్లీ జట్టులో చేరారు. మొదటి మూడు మ్యాచ్‌లకు ఈ ఇద్దరు క్రికెటర్లు అందుబాటులో ఉండవచ్చు.

విజయ్ హజారే ట్రోఫీలో అభిమానులకు ప్రవేశం
నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఆడే మ్యాచ్‌ల కోసం ప్రజలకు కొన్ని స్టాండ్‌లను తెరవాలని KSCA పరిశీలిస్తోంది. 2,000 నుండి 3,000 మంది ప్రేక్షకులకు అవకాశం కల్పించడానికి అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడినప్పుడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం బయట పెద్ద ఎత్తున అభిమానులు కనిపించారు. దాంతో డొమెస్టిక్ గేమ్ సమయంలో వారి ఆట చూసేలా అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Advertisement

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Embed widget