Costliest Players of IPL Auctions : ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు.. ధోని నుంచి రిషబ్ పంత్ వరకు
IPL Auction History : ఐపీఎల్ 2026 వేలం కొత్త శిఖరాలకు చేరుకుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు ఎవరో? ఎంతకి అమ్ముడుపోయారో చూసేద్దాం.

Most Expensive Players in Every Season of IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premiure League) అత్యంత ప్రతిష్టాత్మకంగా వేలం పాటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అన్నీ ఫ్రాంచైజీలు అత్యుత్తమ ప్రతిభ కలిగినవారిని పొందడానికి గట్టిగా పోటీపడతాయి. ఎన్నో సంవత్సరాలుగా మంచి ప్రతిభను కనబరుస్తారనే ఆటగాళ్లను.. భారీ వేలం వేసి సొంతం చేసుకుంటున్నారు. టైట్ మ్యాచ్‌లలో తేడాను చూపించగల గేమ్-ఛేంజర్‌లపై జట్లు అపారమైన విలువను ప్రతిబింబిస్తాయి.
ధోని నుంచి మొదలైంది
2008లో జరిగిన మొదటి ఐపీఎల్ వేలంలో ఎంఎస్ ధోని అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ 9.5 కోట్లకు ధోనిని కొనగోలు చేసింది. ఈ లీగ్‌లో పెద్ద మొత్తంలో వేలం వేయడానికి నాంది పలికింది. తరువాతి సంవత్సరం.. కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్ వంటి ఆటగాళ్లు 9.8 కోట్లు సాధించారు. ఇది అంతర్జాతీయ తారలకు ఉన్న డిమాండ్‌ను హైలైట్ చేశాయి.
యువరాజ్, గంబీర్ కూడా
తదుపరి దశాబ్దంలో పెరుగుతున్న ధరల ధోరణి కొనసాగింది. గౌతమ్ గంభీర్ 2011లో 14.9 కోట్లతో అత్యధిక ధర కలిగిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత 2012లో రవీంద్ర జడేజా 12.8 కోట్లు పలికాడు. అనుభవజ్ఞులైన, మ్యాచ్-విన్నింగ్ ఆటగాళ్ల విలువను చూపిస్తూ.. RCB, తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 14 కోట్లు, 16 కోట్లకు యువరాజ్ సింగ్ కోసం పెద్ద మొత్తంలో సంతకాలు చేశారు. అదేవిధంగా షేన్ వాట్సన్, బెన్ స్టోక్స్, పాట్ కమ్మిన్స్ తరువాతి వేలాలలో 9.5 కోట్ల నుంచి 15.5 కోట్ల వరకు అధిక ఫీజులను పొందారు. ఇది వారి ఆల్-రౌండ్ సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. ఇటీవలి కాలంలో ఈ వేలం కొత్త శిఖరాలకు చేరుకుంది.
అత్యంత ఖరీదైన IPL ఆటగాళ్లు
MS ధోని (CSK) – 2008 – 9.5 కోట్లు
కెవిన్ పీటర్సన్ (RCB) / ఆండ్రూ ఫ్లింటాఫ్ (CSK) – 2009 – 9.8 కోట్లు
షేన్ బాండ్ (KKR) / కీరన్ పొలార్డ్ (MI) – 2010 – 4.8 కోట్లు
గౌతమ్ గంభీర్ (KKR) – 2011 – 14.9 కోట్లు
రవీంద్ర జడేజా (CSK) – 2012 – 12.8 కోట్లు
గ్లెన్ మాక్స్‌వెల్ (MI) – 2013 – 6.3 కోట్లు
యువరాజ్ సింగ్ (RCB) – 2014 – 14 కోట్లు
యువరాజ్ సింగ్ (DD) – 2015 – 16 కోట్లు
షేన్ వాట్సన్ (RCB) – 2016 – 9.5 కోట్లు
బెన్ స్టోక్స్ (RPS) – 2017 – 14.5 కోట్లు
బెన్ స్టోక్స్ (RR) – 2018 – 12.5 కోట్లు
జయదేవ్ ఉనద్కత్ (RR) / వరుణ్ చక్రవర్తి (KKR) – 2019 – 8.4 కోట్లు
పాట్ కమ్మిన్స్ (KKR) – 2020 – 15.5 కోట్లు
క్రిస్ మోరిస్ (RR) – 2021 – 16.25 కోట్లు
ఇషాన్ కిషన్ (MI) – 2022 – 15.25 కోట్లు
సామ్ కురాన్ – 2023 – 18.5 కోట్లు
మిచెల్ స్టార్క్ – 2024 – 24.75 కోట్లు
రిషబ్ పంత్ – 2025 – 27 కోట్లు
ఐపీఎల్ ప్రారంభమై ధోనితో మొదలైన ఈ వేలం హవా ఇప్పటికీ మొదలవుతుంది.





















