అన్వేషించండి

IPL 2026 KKR VS MI: కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రాణించిన శార్దూల్ 

ర‌హానే, ర‌ఘువంశీ రాణించడంతో కేకేఆర్ భారీ స్కోరు సాధించింది. వాంఖ‌డేలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో గెలవాలంటే ముంబై రికార్డు ఛేజింగ్ చేయాల్సిందే. 2012 తర్వాత తమ తొలి లీగ్ మ్యచ్ లో ముంబై ఎప్పుడు గెలవలేదు.

IPL 2026KKR VS MI Match Update: ఐపీఎల్ 2026 సీజ‌న్ తమ తొలి లీగ్ మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ భారీ స్కోరు సాధించింది. ఐదుసార్లు చాంపియ‌న్ ముంబై ఇండ‌యన్స్ తో ఆదివారం వాంఖ‌డే స్టేడియంలో జ‌రుగుతున్న లీగ్ మ్యాచ్ లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల‌కు 220 ప‌రుగులు చేసింది. కెప్టెన్ అజింక్య ర‌హానే (40 బంతుల్లో 67, 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. లార్డ్ శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. నిజానికి టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కు అద్భుత ఓపెనింగ్ భాగ‌స్వామ్యం ల‌భించినా, దాన్ని కంటిన్యూ చేయ‌లేక‌పోయింది. ఒక ద‌శ‌లో 260 ప‌రుగుల వ‌రకు చేస్తుంద‌నుకున్న కేకేఆర్.. ఆ త‌ర్వాత కాస్త త‌క్కువ స్కోరుకే ప‌రిమిత‌మైంది. 

ర‌హానే-అలెన్ మెరుపులు..
ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కు ఓపెన‌ర్లు ఫిన్ అలెన్ (37), రహానే అద్భుత‌మైన శుభారంభం అందించారు. వీరిద్ద‌రూ బౌండ‌రీలు చెల‌రేగ‌డంతో కేకేఆర్ స్కోరు బోర్డు వేగంగా సాగింది. ముఖ్యంగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫామ్ ను కొన‌సాగించిన అలెన్.. ఆరు ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో స‌త్తా చాటాడు. మ‌రో ఎండ్ లో ర‌హానే కూడా స‌త్తా చాట‌డంతో 32 బంతుల్లోనే 69 ప‌రుగుల‌ను వీరిద్ద‌రూ జోడించారు. ఆ త‌ర్వాత అలెన్ వెనుదిరిగినా ర‌హానే జ‌ట్టును ముందుండి న‌డిపించాడు. వ‌న్ డౌన్ లో వ‌చ్చిన లీగ్ లోనే అత్యంత ఖ‌రీదైన ఓవ‌ర్సీస్ ప్లేయ‌ర్ కామెరాన్ గ్రీన్ (18) విఫ‌ల‌మ‌య్యాడు. మ‌రో ఎండ్ లో ఉన్న ర‌హానే, ర‌ఘువంశీ (29 బంతుల్లో 51, 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)తో క‌లిసి జ‌ట్టును ఆదుకున్నాడు. వీరిద్ద‌రూ సాధికారికంగా బ్యాటింగ్ చేయ‌డంతో కేకేఆర్ స్కోరు బోర్డు వేగంగా క‌దిలింది. 27 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన ర‌హానేను శార్దూల్ పెవిలియ‌న్ కు పంపాడు. 

ర‌ఘువంశీ జోరు..
ర‌హానే వెనుదిరిగిన త‌ర్వాత ర‌ఘువంశీ జోరు పెంచాడు. ఘ‌జ‌న్ ఫ‌ర్ బౌలింగ్ లో ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి తప్పించుకున్న ర‌ఘువంశీ.. ఆ త‌ర్వాత బౌండ‌రీల‌తో రెచ్చిపోయాడు. ముఖ్యంగా శార్దూల్ బౌలింగ్ లో బ్యాక్ హ్యాండ్ పంచ్ కొట్టిన సిక్స‌ర్ హైలెట్ అని చెప్ప‌వ‌చ్చు. ఆ త‌ర్వాత 28 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన ర‌ఘువంశీ పెవిలియ‌న్ కు చేరాడు. చివ‌ర్లో హిట్ట‌ర్ రింకూ సింగ్ (21 బంతుల్లో 33 నాటౌట్, 4 ఫోర్లు) కాస్త జోరు చూపించడంతో ముంబై 220 పరుగుల మార్కుకు చేరింది. బౌలర్లలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది. ఇక ఈ మ్యాచ్ లో గెలుపొందాలంటే ముంబై రికార్డు ఛేజింగ్ చేయాల్సిందే. ఇప్పటివరకు ఆ జట్టు చేసిన అత్యధిక ఛేదన 219 కాగా, ఈ మ్యాచ్ లో గెలిస్తే, తమ సక్సెస్ఫుల్ ఛేజింగ్ ను సవరించుకుంటుంది. ఇక 2012 తర్వాత తమ తొలి మ్యాచ్ లో ముంబై గెలవలేదు. ఈ మ్యాచ్ లో గెలిచి, 14 ఏళ్ల చెత్త రికార్డును బద్దలు కొట్టాలని ముంబై అభిమానులు కోరుకుంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget