అన్వేషించండి

IPL 2026 Final: ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ హిస్టరీ రిపీట్ చేస్తుందా.. లేక గుజరాత్ టైటాన్స్ సరికొత్త సృష్టిస్తుందా?

గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న చారిత్రాత్మక సెంటిమెంట్‌ను ఆర్సీబీ కాపాడుకుంటుందా.. లేక గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టిస్తుందా? అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 ఫైనల్ టైమ్ వచ్చేసింది. నేడు అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మే 31న జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు ట్రోఫీని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ రెండు జట్లు ఈ సీజన్ అంతటా నిలకడగా రాణిస్తూ అత్యంత బలమైన జట్లుగా నిలిచాయి.

ఈ టోర్నీలో ఫైనల్ చేరే క్రమంలో రెండు జట్లు కీలక మ్యాచులలో విజయాలు సాధించాయి. ఒకవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని సాధించి నేరుగా ఫైనల్‌ బెర్త్ ఖాయం చేసుకుంది. మరోవైపు, గుజరాత్ టైటాన్స్ జట్టు రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో ఫైనల్ టికెట్‌ను సొంతం చేసుకుంది. ఈ రెండు టేబుల్ టాపర్ జట్ల మధ్య జరగబోయే ఈ ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ విందును అందించడం ఖాయంగా కనిపిస్తోంది.

బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు వేదిక మార్పు..
వాస్తవానికి గత సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ హోం గ్రౌండ్ బెంగళూరులో ఐపీఎల్ 2026 ఫైనల్ నిర్వహించాల్సి ఉంది. అయితే గత ఏడాది విన్నింగ్ సెలబ్రేషన్ టైంలో తొక్కిసలాటలో ఫ్యాన్స్ చనిపోవడంతో ఈ ఏడాది ఫైనల్ వేదికను బీసీసీఐ పెద్దలు మార్చారు. మరోవైపు ఫైనల్ మ్యాచ్ నిర్వహణలో సమన్వయం కుదరదని, టికెట్లకు సంబంధించి సైతం ఆ రాష్ట్రం నుంచి కొన్ని డిమాండ్లు రావడంతో చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ వేదిక అహ్మదాబాద్‌కు మారింది. 

గత కొన్నేళ్లుగా వస్తున్న ఒక ఆసక్తికరమైన రికార్డు, చారిత్రాత్మక సెంటిమెంట్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ గెలిచిన జట్టే సీజన్ విజేతగా నిలుస్తోంది. ఈ అరుదైన రికార్డును ఆర్సీబీ కొనసాగిస్తుందా, లేదా గుజరాత్ టైటాన్స్ దాన్ని బ్రేక్ చేస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. ఈ సెంటిమెంట్ గుజరాత్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోంది.

Also Read: RCB vs GT ఫైనల్ వర్షం కారణంగా రద్దయితే, విజేత ఎవరు? IPL రూల్స్ ఇవే

గత ఎనిమిదేళ్ల ఐపీఎల్ విజేతల విశ్లేషణ 
గత 8 ఏళ్ల ఐపీఎల్ ప్లేఆఫ్స్ వివరాలను పరిశీలిస్తే, క్వాలిఫైయర్ 1 (Qualifier 1) గెలిచిన జట్టే ఫైనల్లో కూడా విజయం సాధించి ఛాంపియన్స్‌గా నిలుస్తూ వస్తోంది. ఈ టేబుల్ పరిశీలిస్తే మీకు క్లారిటీ వస్తుంది. 

సీజన్ క్వాలిఫైయర్ 1 విజేత  ఫైనల్ విజేత
2018 చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చెన్నై సూపర్ కింగ్స్
2019 ముంబై ఇండియన్స్ (MI) ముంబై ఇండియన్స్ 
2020 ముంబై ఇండియన్స్ (MI) ముంబై ఇండియన్స్ 
2021 చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చెన్నై సూపర్ కింగ్స్ 
2022 గుజరాత్ టైటాన్స్ (GT) గుజరాత్ టైటాన్స్ 
2023 చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చెన్నై సూపర్ కింగ్స్ 
2024 కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కోల్‌కతా నైట్ రైడర్స్ 
2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2026 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ?

Read Also: Rajat Patidar In Team India Race:  లైమ్‌లైట్ లోకి ఆర్‌సీబీ కెప్టెన్ పాటిదార్: టీమిండియాలోకి తీసుకోవాలంటూ డిమాండ్  

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget